నీటి సంపులో పడిపోయిన బాలుడు త్రుటిలో తప్పిన ప్రాణాపాయం

By

Published : Dec 21, 2022, 5:32 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

thumbnail

మధ్యప్రదేశ్‌లోని దమోహ్ జిల్లాలో అర్నవ్ జైన్‌ అనే 7 ఏళ్ల పిల్లాడు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడ్డాడు. అర్నవ్ జైన్‌, అతని స్నేహితుడు శ్యామ్‌ జైన్‌ కలిసి పొరుగింటి ప్రాంగణంలో ఆడుకుంటూ ఉండగా ఈ ఘటన జరిగింది. అర్నవ్ జైన్‌ సంపుపైకి ఎక్కి అనుకోకుండా దాని మూతపై కాలు పెట్టాడు. ఒక్కసారిగా మూత తిరగబడి అందులో పడ్డాడు. ఇది గమనించిన అతడి స్నేహితుడు శ్యామ్‌ జైన్‌ పైపును గట్టిగా పట్టుకొమ్మని సలహా ఇచ్చాడు. ఆ వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. అనంతరం పవన్‌ జైన్‌ అనే వ్యక్తి బావిలోకి దూకి పిల్లాడి ప్రాణాలు కాపాడాడు. ఘటన మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్‌ అయింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది.

Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.