ETV Bharat / state

Fevers are Rampant in West Godavari District: నరసాపురంలో విజృంభిస్తున్న జ్వరాలు..పట్టించుకోని ప్రభుత్వ వైద్యాధికారులు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 23, 2023, 1:51 PM IST

Fevers_are_Rampant_West_Godavari_District
Fevers_are_Rampant_West_Godavari_District

Fevers are Rampant in West Godavari District: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరం గ్రామస్థులు పారిశుద్ధ్య అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 15 రోజులుగా జ్వరాలు వ్యాపిస్తున్న అధికారులు స్పందించటంలేదని వాపోతున్నారు. రహదారి పక్కన ఉన్న పిచ్చి మొక్కలు తొలగించి..గ్రామాల్లో తాత్కాలిక డ్రైనేజీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

నరసాపురంలో విజృంభిస్తున్న జ్వరాలు..పట్టించుకోని ప్రభుత్వ వైద్యాధికారులు

Fevers are Rampant in West Godavari District: రాష్ట్ర వ్యాప్తంగా గతకొన్ని రోజులుగా జ్వరాలు దడపుట్టిస్తున్నాయి. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా జ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రస్తుతం ఎవరి నోట విన్నా జ్వరమొచ్చింది..! అనే మాటే వినబడుతోంది. ఇంట్లో ఒకరికి జ్వరం వస్తే చాలు.. అందరినీ చుట్టుముట్టేస్తోంది. ఇప్పటికే కొవిడ్‌తో సతమతమయిన ప్రజలు.. డెంగీ, మలేరియా, ఫ్లూ జ్వరాల విజృంభణతో అల్లాడిపోతున్నారు. జ్వరం తీవ్రత తట్టుకోలేక బాధితులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి.

Fevers are Spreading in Narasapuram Mandal: ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరంలో జ్వరాలు రోజురోజుకు విజృంభిస్తున్నాయి. గ్రామాల్లో పారిశుద్ధ్యం సరిగా చేయకపోవడం, వర్షపు నీరు ఇళ్ల మధ్యలో రోజులు తరపడి నిల్వ ఉండటంతో.. ఆనారోగ్యం బారిన పడుతున్నామని పలు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. అధికారులకు పలుమార్లు విన్నంచినా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు గ్రామాల్లో పలువురు డెంగ్యూ బారిన పడినట్లు స్థానికులు వెల్లడించారు.

Booming poisonous fevers : విజృంభిస్తున్న విష జ్వరాలు

Local Doctors who Set up Camps in Villages: పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జ్వరాలు విస్తరిస్తున్న విషయాన్ని తెలుసుకున్న స్థానిక వైద్యులు.. గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి, చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ.. చెత్త సేకరణ నెలకు రెండు, మూడు సార్లు మించి జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 15 రోజుల నుంచి జ్వరాలు ఎక్కువగా వ్యాపిస్తున్నాయని వాపోయారు. వెంటనే అధికారులు స్పందించి.. రహదారి పక్కన ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి.. మురుగు నీరు బయటకు వెళ్లేందుకు తాత్కాలిక డ్రైనేజీలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Rural Areas People should be Alert: మరోవైపు విస్తరిస్తున్న జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వర్షాల్లో తడవటం వల్ల డెంగీతోపాటు మలేరియా, టైఫాయిడ్‌, అతిసారం కేసులు ప్రబలించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ జ్వరాల కేసులు మరిన్న పెరిగే అవకాశాలు ఉన్నట్లు వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నారు.

కలవర పెడుతున్న జ్వరాలు.. ఆందోళన వద్దంటున్న వైద్యాధికారులు

ప్రస్తుతం వర్షాల కారణంగా ఈ ఇబ్బంది మరింత ఎక్కువగా ఉండటంతోనే జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. వరుసగా 15 రోజుల నుంచి జ్వరాలు వ్యాపిస్తున్నాయి. చాలా మంది స్థానిక పీఎంపీలు, ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. మరికొంతమంది పాలకొల్లు, నరసాపురంలో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తుతున్నారు. ఇప్పటికైనా ప్రజలు పడుతున్న బాధలను అధికారులు అర్ధం చేసుకుని.. వెంటనే స్పందించాలి. రహదారుల పక్కనున్న పిచ్చి మొక్కలను తొలగించడానికి చర్యలు చేపట్టాలి. గ్రామాల్లో రోజుల తరబడి నిలిచిపోయిన మురుగునీరును కొత్త డ్రైనేజీలను ఏర్పాటు చేసి, మళ్లించాలి. గ్రామాల్లో ప్రభుత్వ వైద్యాధికారులు క్యాంపులు నిర్వహించి..జ్వారాల బారినపడిన ప్రజలకు చికిత్స చేయాలి. ''- నరసాపురం స్థానికులు

మన్యం జిల్లాలో ఫ్లూజ్వరాలు.. కిటకిటలాడుతున్న ఆసుపత్రులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.