ETV Bharat / state

TDP Janasena Coordination Meetings: జిల్లాస్థాయిలో టీడీపీ, జనసేన సంయుక్త భేటీలు.. ఉమ్మడి ఐదు జిల్లాల్లో జరిగిన సమావేశాలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 30, 2023, 9:50 AM IST

TDP_Janasena_Coordination_Meetings
TDP_Janasena_Coordination_Meetings

TDP Janasena Coordination Meetings: ఏపీలో జిల్లాస్థాయి తెలుగుదేశం, జగనసేన సంయుక్త సమావేశాలు నిర్ణయించాయి. రెండు పార్టీల మధ్య సమన్వయానికి.. ఉమ్మడి జిల్లాల స్థాయిలో తలపెట్టిన సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం 5 జిల్లాల్లో సదస్సులు నిర్వహించారు.

TDP Janasena Coordination Meetings: జిల్లాస్థాయిలో టీడీపీ, జనసేన సంయుక్త భేటీలు.. ఉమ్మడి ఐదు జిల్లాల్లో జరిగిన సమావేశాలు

TDP Janasena Coordination Meetings: వైసీపీ అరాచక పాలనపై అలుపెరగని పోరాటం చేయాలని.. తెలుగుదేశం, జనసేన సంయుక్త సమావేశాలు నిర్ణయించాయి. రెండు పార్టీల మధ్య సమన్వయానికి.. ఉమ్మడి జిల్లాల స్థాయిలో తలపెట్టిన సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరంలో.. ఈ నెల 23న టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఆధ్వర్యంలో జరిగిన రెండు పార్టీల సంయుక్త కార్యాచరణ సమితి సమావేశానికి కొనసాగింపుగా.. సోమవారం 5 జిల్లాల్లో సదస్సులు నిర్వహించారు.

TDP JSP Three Days District Level Coordination Meetings: రాష్ట్రంలో దోపిడీ సర్కారుపై ఉమ్మడి పోరుకు తెలుగుదేశం, జనసేన సిద్ధమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుల్లో భాగంగా.. ఉమ్మడి ఐదు జిల్లాల్లో సంయుక్త సమావేశాలు నిర్వహించారు. శ్రీకాకుళంలో జరిగిన సమావేశానికి పార్టీల సమన్వయకర్తలుగా వంగలపూడి అనిత, జనసేన నేత బొమ్మిడి నాయకర్‌ వ్యవహరించారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు, కూన రవికుమార్‌, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి తదితరులు పాల్గొన్నారు.

Jana Sena TDP joint action : కదన రంగంలోకి టీడీపీ-జనసేన.. రైతుల సాగునీటి సమస్యపైనే తొలి ఐక్య పోరాటం

Janasena TDP Coordination Committee Meeting: విజయనగరంలో.. పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల రెండు పార్టీల సమన్వయ కమిటీ సమావేశానికి టీడీపీ తరఫున అశోక్‌గజపతిరాజు, గుమ్మిడి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, కిమిడి నాగార్జున తదితరులు హాజరయ్యారు. ప్రజాస్వామ్య రక్షణకు కలిసి పనిచేయాలని రెండు పార్టీలు నిర్ణయించాయని సమావేశంలో పాల్గొన్న జనసేన జిల్లా పరిశీలకుడు కోన తాతారావు తెలిపారు. కాకినాడలో రెండు పార్టీల సమన్వయకర్తలుగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, జనసేన నేత శివశంకర్‌ వ్యవహరించారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న వైసీపీను గద్దె దించడమే అందరి లక్ష్యం కావాలన్నారు.

Janasena TDP Joint Action: అనంతపురం జిల్లా సమావేశానికి టీడీపీ నుంచి మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డితో పాటు ముఖ్య నేతలు పాల్గొన్నారు. జనసేన నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు వరుణ్‌, నాయకులు భవానీ రవికుమార్‌ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన సమన్వయ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌, బాలవీరాంజనేయస్వామి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌తో పాటు జనసేన నేతలు షేక్‌రియాజ్‌, పెదపూడి విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న వైసీపీను గద్దె దించడమే అందరి లక్ష్యం కావాలని.. నేతలు తీర్మానం చేశారు.

'' వైసీపీ అరాచక పాలనపై అలుపెరగని పోరాటం చేయాలి. రాష్ట్రంలో దోపిడీ సర్కారుపై ఉమ్మడి పోరుకు తెలుగుదేశం, జనసేన సిద్ధమయ్యాయి. ప్రజాస్వామ్య రక్షణకు కలిసి పనిచేయాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న వైసీపీను గద్దె దించడమే అందరి లక్ష్యం కావాలి." - సంయుక్త భేటీలో నేతలు

TDP Janasena Co ordination First meeting Highlights ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణ.. ఆరు అంశాలతో టీడీపీ-జనసేన అజెండా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.