ETV Bharat / state

అంతర్జాతీయ జల సదస్సులో 'ఫ్లాష్ మాబ్' - ప్రతినిధుల మెప్పు పొందిన 'ఆంధ్ర' విద్యార్థుల మైమ్

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 21, 2023, 3:46 PM IST

Visakha_Students_Shows_Off_Their_Great_Skills
Visakha_Students_Shows_Off_Their_Great_Skills

Visakha Students Shows Off Their Great Skills: విశాఖ ఆంధ్రాయూనివర్సిటీలో మైమ్ ప్రదర్శన వీక్షకులను ఆకట్టుకుంది. 90 దేశాల నుంచి దాదాపు 600కి పైగా విదేశీ ప్రతినిధులు హాజరైన అంతర్జాతీయ జల సదస్సులో.. విద్యార్థులు తమ సత్తాచాటారు.

అంతర్జాతీయ జల సదస్సులో 'ఫ్లాష్ మాబ్' - ప్రతినిధుల మెప్పు పొందిన 'ఆంధ్ర' విద్యార్థుల మైమ్

Visakha Students Shows Off Their Great Skills: విశాఖలో దాదాపు వారం రోజులపాటు అంతర్జాతీయ జల సదస్సు జరిగింది. కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి ఈ సదస్సు ప్రారంభ సభకు హాజరయ్యారు కూడా. 90 దేశాల నుంచి దాదాపు 600కి పైగా విదేశీ ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరయ్యారు. వారందరిని ఆలోచింప జేసే విధంగా మైమ్ ప్రదర్శన ఇచ్చారు.

నటన, నాట్యం, మైమ్ వంటివి హావభావాలు, డైలాగ్​లు వంటి వాటితో గీతానికి అనుగుణంగా ప్రదర్శనలు వంటి వాటితో కళారంగంలో రాణించేందుకు తద్వారా సినీ, టివి రంగాల్లోకి ప్రవేశించేందుకు తొలిమెట్టుగా భావిస్తారు. ఇందులో శిక్షణ పొందితే తమకున్న అభిరుచికి మరింత మెరుగులు దిద్దుకుని జనాదరణ పొందేందుకు, నటన అవకాశాలు దక్కించుకునేందుకు వీలుపడుతుందన్నది నేటి తరం అభిప్రాయం.

నటన, కళా రంగాలకు చెందిన వివిధ విభాగాలు దర్శకత్వం, స్క్రిప్టు రైటింగ్, నటన వంటి వాటి ద్వారా మంచి అవకాశాలు కలిసి వస్తాయన్నది వీరి మనోగతం. అంతర్జాతీయ ప్రతినిధులు వచ్చిన సమయంలో ఈ తరహా విద్యార్థినీ విద్యార్థులకు తమకంటే ఎంతో ఎక్కువ వయసు ఉన్నవారు సహాధ్యాయులుగా ఉన్న వారితో కలిసి అభినయ వేదిక పంచుకుని తమ సత్తా చాటిచెప్పి వారిని మెప్పించారు.

కరాటేలో 74 పతకాలు సాధించిన సందీప్ కుమార్‌ - పల్లె నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన యువకుడు

వివిధ దేశాల నుంచి వచ్చిన వారందరికి తమ అభినయం ద్వారా జల సంరక్షణ, ప్రాజెక్టుల అవసరం, దానివల్ల వచ్చే సంపద, గ్రామాల్లో వచ్చే అభివృద్ధి వంటి సందేశాన్ని అర్థమయ్యే విధంగా ఈ మైమ్ రూపొందించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ప్రభావితమయ్యే తీరును కూడా ప్రదర్శించడం అక్కడికి వచ్చిన అంతర్జాతీయ ప్రతినిధులను ఇట్టే ఆకర్షించింది.

ప్లాష్ మాబ్ లా చేసినప్పటికి ఈ తరహా మైమ్ ప్రదర్శన ద్వారా అభినయంతో మెప్పించడానికి దాదాపు రెండు వారాలపాటు తమ విభాగాధిపతి నేతృత్వంలో విద్యార్థినీ విద్యార్థులు శ్రమించారు. ఇందులో యువత, తమకంటె పెద్ద వయసు వారితో కలిసి అభినయించి కార్యక్రమాన్ని పండించడం కొసమెరుపు.

ఉద్యోగం కోల్పోయినా మరో వంద మందికి ఉపాధి చూపిన సురేశ్ - 'సుగంధ' సేద్యంతో భారీగా ఆదాయం

International Water Summit at Andhra University: థియేటర్ ఆర్ట్స్ విభాగం ఉన్న అతి కొద్ది విశ్వవిద్యాలయాలల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఒకటి. దీని పేరే ఆంధ్రవిశ్వకళాపరిషత్. ఈ వర్సిటీలో సాయంకాలం ఈ విభాగం కోర్సులకు యువత ప్రధానంగా ఆకర్షితులై తమ థియేటర్ ఆర్ట్స్ కోర్సులను వివిధ స్పెషలైజేషన్లలో పూర్తి చేస్తారు. ఇదే సమయంలో ప్రదర్శనలు, ప్రత్యేక కార్యక్రమాలను జన బాహుళ్యంలో అభినయం చేయడం ద్వారా మంచి గుర్తింపు కోసం యత్నిస్తున్నారు. దీనికి వీరి అధ్యాపక సిబ్బంది తోడు ఎంతగానో ఉంటోందన్నది వీరి అభిప్రాయం.

వందేళ్లకు దగ్గరవుతున్న ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రంగస్థల విభాగంలో ఎంతో మంది దర్శకులు, నటులు శిక్షణ పొందిన చరిత్ర ఉంది. నేటి తరానికి అవి తెలుసుకోవడం ద్వారా వారికి ఒక ప్రేరణ లభిస్తుందన్నది ఆచార్యుల అభిప్రాయం. మరో వైపు అంతర్జాతీయ ప్రతినిధుల ముందు ఈ రకంగా ప్రదర్శన ఇవ్వడం ద్వారా వారికో గుర్తింపు లభిస్తుందని చెబుతున్నారు.

మాటల్లేని చిత్రాలు బహుళ జనాదరణనే పొందగలిగాయి. అందులో అభినయం వంటివి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వంటివి ఇప్పుడు నటీనటుల కౌశలానికి బాగా తోడవుతున్నాయి. యువత ఈ తరహా ప్రదర్శనలలో రాణించేందుకు, తమ చదువు కొనసాగించేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు.

ఆసియాక్రీడల్లో అదరగొట్టిన విజయవాడ కుర్రాడు - విలువిద్యలో రజతం సాధించిన ధీరజ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.