ETV Bharat / state

కరాటేలో 74 పతకాలు సాధించిన సందీప్ కుమార్‌ - పల్లె నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన యువకుడు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 21, 2023, 2:26 PM IST

Sandeep Kumar Achieved 74 Medals In Karate: కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా నిరాశ చెందలేదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా తన లక్ష్యాన్ని మాత్రం వదల్లేదు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినా సరే పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని నిరూపించిన కరాటే ఆటగాడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

sandeep_kumar_achieved_74_medals_in_karate
sandeep_kumar_achieved_74_medals_in_karate

కరాటేలో 74 పతకాలు సాధించిన సందీప్ కుమార్‌ - పల్లె నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన యువకుడు

Sandeep Kumar Achieved 74 Medals In Karate: విశాఖ జిల్లాలోని ఓ యువకుడు తన ఆర్థిక పరిస్థితుల వల్ల చదువును మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. సహాయంగా కుటుంబానికి అండగా నిలిచాడు. ఈ క్రమంలో అతనికి ఆటలపై ఇష్టం పెరిగింది. అతనికి కరాటేపై కాస్త ఆసక్తి మళ్లింది. దానిలోని మెలకువలు నేర్చుకోవడం మొదలు పెట్టాడు. ప్రతిరోజు ఆరు గంటల పాటు సాధన చేసేవాడు. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎన్ని ఎదురైన తట్టుకొని.. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ముందుకు నడిచారు. పలు కరాటే పోటీల్లో పాల్గొని నేడు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కైవసం చేసుకుంటూ మరింత ముందుకు కొనసాగుతున్నారు సందీప్‌.

ఈ యువకుడు చిన్నప్పటి నుంచి ఆటలపై ఇష్టం పెంచుకున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న నిరాశ చెందలేదు. పేదరికం అయినా ఏ మాత్రం దిగులు చెందలేదు. కుటుంబసభ్యులు, స్నేహితుల సహకారంతో కరాటేలో అంచెలంచెలుగా ఎదిగాడు సందీప్‌. ఇటీవల అంతర్జాతీయ పోటీల్లో దాదాపు 19కి పైగా స్వర్ణపతకాలు సాధించాడు. పతకాలు పేదరికానికి అడ్డంకులు కావని నిరూపిస్తూ అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నారు.

visakha boy in karate story: గత కొన్ని సంవత్సరాలుగా కరాటే సాధన చేస్తున్నఈ క్రీడాకారుని పేరు సందీప్‌కుమార్‌. విశాఖ జిల్లాలోని పెందుర్తి స్వస్థలం. వీరిది వ్యవసాయ కుటుంబం. చిన్నతనం నుంచి ఆటలపై ఇష్టం పెంచుకున్నాడు. దాంతో కరాటేపై సాధన మొదలు పెట్టాడు. ఎప్పటికైన ఈ రంగంలో అగ్రగామిగా ఎదగాలని నిర్ణయించుకుని దానిపై కసరత్తు చేస్తున్నాడు.

నాలోని ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు వెన్నుతట్టి ప్రోత్సహించారు. రోజూ తల్లిదండ్రులు కూలీకి వెళ్తే కానీ కుటుంబ అవసరాలు తీరేవి కావు. అలాంటి పరిస్థితుల్లో కూడా కుటుంబ సభ్యులు నిరాశ చెందలేదు. ఆ స్థితి నుంచి ప్రస్తుతం ఈ స్థితికి రావడానికి నా తల్లిదండ్రులే కారణం. నిరంతరం ప్రోత్సాహంతో నేడు లక్ష్యం దిశగా అడుగులు వేశాను. ఒక్కో మెట్టు ఎక్కుతు ఇటీవల కెనడాలో జరిగిన ప్రపంచస్ధాయి కరాటే పోటీలలో పాల్గొన్నాను. ఇంగ్లండ్ క్రీడాకారునిపై మంచి ప్రదర్శన కనబర్చి చివరి దశలో రెండోస్దానంలో నిలిచి రజత పతకాన్ని సాధించాను. ప్రతి రోజూ కనీసం నాలుగు నుంచి ఆరు గంటల పాటు సాధన చేసేందుకు నా గురువు సహకరించేవారు. -వై.సందీప్ కుమార్, కరాటే వీరుడు.

తన 12 ఏళ్ల వయసు నుంచే కరాటే మార్షల్ ఆర్ట్స్​లో సాధన చేస్తూ వచ్చాడు సందీప్‌. ఇప్పటివరకు పాల్గొన్న ప్రతి పోటీలో పాల్గొని పతకాలను తన సొంతం చేసుకుంటు వచ్చాడు. అలా పలు పోటీల్లో ప్రాతినిధ్యం వహించి 19 బంగారు, 23 వెండి, 32 కాంస్య పతకాలను తనఖాతాలో వేసుకున్నాడు

సందీప్‌ తన గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగేందుకు స్వచ్ఛంద సంస్ధలు తోడ్పాటు అందించాయి. వీటితో పాటు పలువురు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయం అందించడంతో సందీప్‌లో సాధించాలనే కసి పెరిగి లక్ష్యం దిశగా ప్రణాళికలు రచించాడు. సందీప్‌ ఈ స్థాయికి చేరుకోవడంపై చాలా సంతోషంగా ఉంది.-నాయుడు, కరాటే కోచ్‌

ఇంతటి ఘన విజయం సాధించిన సందీప్‌కుమార్‌కు విశ్వనాధ్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగింది. సహాయ సహకారాలు వెన్నంటే ఉండటంతో నేడు విజేతగా నిలిచాడు. వివిధ క్రీడల్లోకి వచ్చే ఔత్సాహిక క్రీడాకారులకు తమ వంతు సహకారం అందిస్తామని స్పోర్ట్స్ క్లబ్‌ ఆథారిటీ తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.