ETV Bharat / state

కరోనా కట్టడిలో మేము సైతం: స్వచ్ఛందంగా హల్వా దుకాణాలు మూసివేత

author img

By

Published : May 22, 2021, 5:33 PM IST

కరోనా కట్టడిలో మేము సైతం : స్వచ్ఛందంగా హల్వా దుకాణాలు మూసివేత
కరోనా కట్టడిలో మేము సైతం : స్వచ్ఛందంగా హల్వా దుకాణాలు మూసివేత

కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నియంత్రణకు విశాఖ జిల్లా మాడుగుల హల్వా వ్యాపారులు ముందుకొచ్చారు. పది రోజుల పాటు దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేయాలని నిర్ణయించుకున్నారు.

విశాఖ జిల్లా మాడుగుల పేరు చెప్పగానే ఠక్కున గుర్తు కొచ్చేది హల్వా. మాడుగుల, ఘాట్ రోడ్డు కూడలి ఇతర ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హల్వా దుకాణాల్లో విక్రయిస్తుంటారు.

కరోనా కట్టడిలో మేము సైతం : స్వచ్ఛందంగా హల్వా దుకాణాలు మూసివేత
కరోనా కట్టడిలో మేము సైతం : స్వచ్ఛందంగా హల్వా దుకాణాలు మూసివేత

రాష్ట్ర స్థాయిలో పేరు ప్రఖ్యాతలు..

మాడుగుల హల్వా విశాఖ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతల్ని, గుర్తింపును పొందింది. కరోనా ప్రభావం హల్వా దుకాణాలపై పడటంతో సుమారు 500 మంది వ్యాపారులు, కూలీలు ప్రత్యక్షంగా ప్రభావితం కానున్నారు. ఈ క్రమంలో హల్వా దుకాణాలు తెరిచినా.. కొవిడ్ భయంతో పెద్దగా అమ్మకాలు సాగట్లేదు.

కరోనా కట్టడిలో మేము సైతం : స్వచ్ఛందంగా హల్వా దుకాణాలు మూసివేత
కరోనా కట్టడిలో మేము సైతం : స్వచ్ఛందంగా హల్వా దుకాణాలు మూసివేత

సమిష్టిగా నిర్ణయం..

మరోవైపు కరోనా భూతం వెంటాడుతోంది. ఫలితంగా వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సమిష్టిగా నిర్ణయించుకుని కరోనా కట్టడికి అడుగులు వేశారు. పది రోజుల పాటు హల్వా దుకాణాలు పూర్తిగా మూసివేయాలని తీర్మానించారు. దీంతో శనివారం నుంచి మాడుగుల, ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న హల్వా దుకాణాలు తాత్కాలికంగా మూతపడ్డాయని వ్యాపారి దంగేటి మోహన్ , సిబ్బంది కుమార్ పేర్కొన్నారు.

కరోనా కట్టడిలో మేము సైతం : స్వచ్ఛందంగా హల్వా దుకాణాలు మూసివేత
కరోనా కట్టడిలో మేము సైతం : స్వచ్ఛందంగా హల్వా దుకాణాలు మూసివేత

ఇవీ చూడండి : సోనూసూద్ ఆక్సిజన్​ ప్లాంట్లు.. ఆంధ్రా​ నుంచే శ్రీకారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.