ETV Bharat / state

ధాన్యం కొనుగోలులో ఆర్బీకేల నిర్లక్ష్యం.. రైతులకు తిప్పలు

author img

By

Published : Dec 13, 2022, 9:27 PM IST

Crop loss to farmers due to Cyclone
ఆర్బీకేల నిర్లక్ష్యం

Farmers face heavy losses due to Cyclone: అహర్నిశలు శ్రమించి సాగు చేసిన పంట... తుపాను దెబ్బకు వర్షార్పణం కావడంతో అన్నదాతలు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. కళ్లాల్లో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు, స్థానిక నేతలు డిమాండ్ చేశారు. ఆర్​బీకే ద్వారా ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేసుంటే ఈ నష్టం తప్పేదని వాపోతున్నారు. తడిచిన పంటను ధర తగ్గించుకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ధాన్యం తడిచి మెులకలు రావడంతో లబోదిబోమంటున్న అన్నదాతలు

Crop loss due to Cyclone: మాండౌస్‌ తుపాను దెబ్బకు రాయలసీమ సహా దక్షిణకోస్తా జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంట చేతికిరాని పరిస్థితి. వర్షాలకు ధాన్యం తడిచి మెులకలు రావడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. పంట నష్టం అంచనాలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. గోనె సంచుల కోసం ఆర్బీకేల చుట్టూ తిరిగినా ప్రయోజనం శూన్యమని వాపోతున్నారు.

అహర్నిశలు శ్రమించి సాగు చేసిన పంట...తుపాను దెబ్బకు వర్షార్పణం కావడంతో అన్నదాతలు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. అంతలోనే తేరుకుని నీటిపాలైన ధాన్యం, ఇతర పంటలను కాపాడేకునేందుకు శక్తి మేరకు ప్రయత్నిస్తున్నా....ప్రభుత్వ సహకారం లేకపోవడంతో తీవ్ర అగచాట్లు పడుతున్నారు. నెల్లూరు జిల్లా మర్రిపాడులో ఖాదర్ బాషా అనే రైతు 4 ఎకరాల్లో 3 లక్షలకు పైగా ఖర్చు పెట్టి బొప్పాయి పంట వేశాడు. వర్షానికి పూర్తిగా నీటిలో మునిగింది. నష్టాన్ని పరిశీలించామని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా...సరైన స్పందన లేదని, ఆత్మహత్యే శరణ్యమని వాపోతున్నాడు.

చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో కౌండిన్య నది ప్రవాహానికి పరిసర గ్రామాల పొలాలు నీట మునిగాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని బనవాసిలో తుపానుకు వరి పంట దెబ్బతింది. కళ్లాల్లో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు, స్థానిక నేతలు డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లాలోని బాపట్ల, కర్లపాలెం మండలాల్లో వందల ఎకరాల వరి నీటమునిగింది. కాలువల్లో పూడికలు తీయకపోవడం వల్ల పొలాల్లో నీరు నిలిచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను తెలుగుదేశం బృందం పరిశీలించింది. సంతనూతలపాడు నియోజకవర్గ తెలుగుదేశం ఇంఛార్జ్‌ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో చేకూరపాడు, ఉప్పుగుండూరు, మట్టిగుంట గ్రామాల్లో పంటలను పరిశీలించారు. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

నిల్వ చేసేందుకు గోనె సంచులు లేకపోవడంతో తడిచిన ధ్యానం మెులకెత్తుతుందని కృష్ణాజిల్లా పెదఅవుటుపల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగురోజులుగా ఆర్బీకేల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేదని వాపోతున్నారు.

కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం చోరగుడిలో వరి ఓదెలు నీట మునగడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. ఆర్​బీకే ద్వారా ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేసుంటే ఈ నష్టం తప్పేదని వాపోతున్నారు. తుపానుకు దెబ్బతిన్న వరి పొలాల్ని, ధాన్యాన్ని తెదేపా వ్యవసాయ కమిటీ బృంద సభ్యులు పరిశీలించారు. తడిచిన పంటను ధర తగ్గించుకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.