ETV Bharat / state

ఆత్మకూరులో ప్రజలకు యోగా శిక్షణ

author img

By

Published : Aug 18, 2020, 1:33 PM IST

Yoga program in Atmakur
ఆత్మకూరులో యోగా కార్యక్రమం

యోగా చేయటం ద్వారా రోగనిరోధక శక్తి, మనోధైర్యం పెరుగుతుందని నెల్లూరు జిల్లా ఆత్మకూరు మునిసిపల్​ అధికారులు పేర్కొన్నారు. తద్వారా కొవిడ్​ను ధైర్యంగా ఎదుర్కోవచ్చని తెలుపుతూ మునిసిపల్​ అధికారులు ఆత్మకూరు పురపాలక సంఘం పరిధిలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మునిసిపాలిటీలో రోజు రోజూకి కరోనా పాజిటివ్ కేసులు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్ బారిన పడకుండా ఉండేందుకు... ప్రధానంగా ప్రజల్లో రోగ నిరోధక శక్తి, మనో ధైర్యం పెంచేందుకు ఆత్మకూరులో యోగా కార్యక్రమం నిర్వహించారు.

ఆత్మకూరు పురపాలకసంఘ పరిధిలోని ఏపీ టెడ్కో భవనాల్లో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్​లో ఈ యోగా కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ ఎం.రమేశ్ బాబు ప్రారంభించారు. మున్సిపల్ మేనేజర్ సయ్యద్ ఖాసిం పాల్గొని అందరికి యోగా పై అవగాహన కల్పించారు. వారికి పలు ఆసనాలు నేర్పించారు.

ఇవీ చదవండి: వరద ముంపు ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టండి: సీఎం జగన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.