ETV Bharat / state

"రైతులకు కనీస మద్దతు ధర రావాలంటే.. ఇవి పాటించండి".. నెల్లూరు జిల్లా మార్క్​ఫెడ్​ మేనేజర్​

author img

By

Published : Feb 28, 2023, 11:48 AM IST

markfed manager
మార్క్​ఫెడ్ మేనేజర్ పవన్

MARKFED MANAGER ON SENAGA CROP : రాష్ట్రంలో లక్ష మెట్రిక్​ టన్నుల శనగను కొనుగోలు చేస్తున్నట్లు నెల్లూరు జిల్లా మార్క్​ఫెడ్​ మేనేజర్​ పవన్​ తెలిపారు. మార్చి 15 నుంచి 20వ తేదీ లోపు జిల్లాలోని కందుకూరు, కలిగిరి, కలువాయి మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

MARKFED MANAGER ON SENAGA CROP : రాష్ట్రంలో 1,22,000 మెట్రిక్ టన్నుల శనగ పంటను కొనుగోలు చేస్తున్నట్లు నెల్లూరు జిల్లా మార్క్​ఫెడ్ మేనేజర్ పవన్ తెలిపారు. నెల్లూరు జిల్లాలో 12 మండలాలలోని 17 వేల ఎకరాలలో శనగ పంటను రైతులు సాగు చేశారని ఆయన తెలిపారు. మార్చి 15 నుంచి 20వ తేదీ లోపు కందుకూరు, కలిగిరి, కలువాయి మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో మార్క్​ఫెడ్​ ద్వారా 6000 క్వింటాళ్లు కొనుగోలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి రైతు ఈ క్రాఫ్, ఈ కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. రైతులు ఈ క్రాఫ్ట్, ఈ కేవైసీ చేసుకోకపోతే వారి శనగ పంటను కొనుగోలు చేయలేమన్నారు. తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. కొనుగోలు చేసిన 15 రోజుల్లో డబ్బులు చెల్లిస్తామన్నారు.

2023 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం శనగ పంటకు కనీస మద్దతు ధరను 5వేల 3వందల 35 రూపాయలుగా ప్రకటించినట్లు తెలిపారు. రాష్ట్రంలో శనగ పంట ధర.. కనీస మద్దతు ధర కన్నా తక్కువుగా ఉండటం వల్ల మార్క్​ఫెడ్​ ద్వారా కనీస మద్దతు వచ్చేలా కొనుగోలు చేయడం జరుగుతుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం కేంద్రం మార్క్​ఫెడ్​ ద్వారా లక్ష మెట్రిక్​ టన్నుల శనగలను రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు చేయడానికి అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు.

మిగతా జిల్లాలతో పోల్చుకుంటే.. నెల్లూరులో పంటను ఆలస్యంగా వేశారని.. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ త్వరలోనే ప్రారంభం అవుతాయన్నారు. దాదాపు మార్చి మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతాయన్నారు. పంట కొనుగోలు చేసిన వెంటనే తేమ శాతం అధికంగా ఉంటుందని.. దాని వల్ల నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉండడం వల్ల కొనుగోలులో ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు.

తేమని 12శాతం కన్నా తక్కువుగా ఉండేలా చూసుకోవాలని.. అందుకోసం పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే ముందు ఎండబెట్టాలని సూచించారు. డబ్బుల విషయంలో రైతులు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని.. ధాన్యం కొనుగోలు చేసిన 15 రోజుల్లోపు నగదు చెల్లిస్తామన్నారు.

జిల్లా వ్యాప్తంగా 12 మండలాల్లో ప్రధాన పంటగా శనగ వేసినట్లు తెలిపారు. ముఖ్యంగా కనిగిరి, కలువాయి, కందుకూరు ఈ మూడు మండలాల్లో అధికంగా సాగు చేసినట్లు పేర్కొన్నారు. పంట కొనుగోలు కేంద్రాలను మండలాల్లోని రైతు భరోసా కేంద్రాలు లేకపోతే వాటికి సమీపంలో ఉండే ఏఎంసీకి ట్యాగ్​ చేస్తామన్నారు. ఏఎంసీలో పంట ఆరబెట్టుకోవడానికి, నిల్వ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని వెల్లడించారు.

కనీస మద్దతు ధర రావాలంటే రైతులు చేయాల్సిన పనులు:

1. ఈ క్రాప్​లో పంట నమోదు అయ్యిందో లేదో చూసుకోవాలి. అలాగే ఈ కేవైసీ కూడా చేయించుకోవాలి.

2. రైతు భరోసా కేంద్రం వద్దకు వెళ్లి వీఏఎల్​(VAL) ద్వారా సీఎం యాప్​లో నమోదు చేసుకోవాలి.

3.పంట కొనుగోలులో నాణ్యతా ప్రమాణాలు ఉండేలా పాటించాలి..(తేమ లేకుండా చూసుకోవడం, జల్లెడ పట్టడం)

4. బ్యాంకు అకౌంట్​కి ఆధార్​తో అనుసంధానం చేసుకుని యాక్టివ్​లో ఉండేటట్లు చూసుకోవాలి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.