ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9PM

author img

By

Published : Dec 14, 2022, 9:06 PM IST

TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు

.

  • వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోంది: చంద్రబాబు
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడున్నరేళ్ల పరిపాలనలో.. రాష్ట్రంలో ప్రజలు విసురు చెందారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు.. అందుకనే రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామేమోనని జగన్​కు ఇప్పటికే భయం పట్టుకోందని.. అందుకే ఎప్పడెప్పడానని ముందస్థు ఎన్నికలకు వెళ్తామని ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వైకాపా ప్రభుత్వానికి హాలీడే ప్రకటించాలి: నాదెండ్ల
    ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ప్రభుత్వం భరోసా ఇవ్వలేకపోయిందని నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. రాష్ట్రంలో మూడేళ్లలో 3 వేలకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఆయా కుటుంబాలకు జనసేన తరపున రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. రైతులు క్రాప్​ హాలీడే ప్రకటించకుండా.. వైసీపీకి హాలీడే ప్రకటించాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఈ నెల 22న హైకోర్టుకు సీఎస్​ జవహర్​రెడ్డి హాజరు కావాలని ఆదేశం
    పాఠశాల ప్రాంగణాల్లో సచివాలయాల నిర్మాణాలపై ధర్మాసనం మరోసారి మండిపడింది. నిర్మాణాలు చేపట్టవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలను.. అమలు చేయకుండా కట్టడాలు చేపట్టారని మండిపడిన న్యాయస్థానం.. ఈ నెల 22న కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని సీఎస్​ను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • దంతవైద్యురాలి అపహరణ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌ రెడ్డిపై పీడీ యాక్ట్​
    హైదరాబాద్‌ మన్నెగూడలో దంతవైద్యురాలి అపహరణ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌ రెడ్డిని పోలీసులు హైదరాబాద్ తీసుకొస్తున్నారు. నవీన్‌రెడ్డిపై ఆదిభట్లలో మూడు కేసులు ఉండగా.. వరంగల్‌లో రెండేళ్ల క్రితం మరో చీటింగ్‌ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో అతడిపై పీడీ చట్టం నమోదు చేసే యోచనలో రాచకొండ పోలీసులు ఉన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • చైనా దురాక్రమణపై విపక్షాల ఉమ్మడి పోరు.. కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా ప్లాన్!
    భారత్ సరిహద్దులో చైనా దురాక్రమణ విషయంలో కేంద్రంపై సమష్టిగా పోరాడేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలో 17 పార్టీలకు చెందిన నేతలు భేటీ అయి.. ఈ మేరకు చర్చలు జరిపాయి. కాగా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశానికి హాజరుకాలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • దిల్లీ ఎయిమ్స్​పై సైబర్ దాడి చైనా పనే.. 100 సర్వర్లు హ్యాక్.. ఆ డేటా రికవరీ!
    దిల్లీలోని ఎయిమ్స్‌ సర్వర్లపై సైబర్‌ దాడి.. చైనా హ్యాకర్ల పనేనని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం సర్వర్లలోని డేటాను రిట్రీవ్‌ చేసినట్లు తెలిపాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తవాంగ్ ఘర్షణపై చైనాకు అమెరికా షాక్.. భారత్​కు పూర్తి మద్దతు
    అరుణాచల్‌ప్రదేశ్‌ తవాంగ్‌ సెక్టార్‌లో జరిగిన ఘర్షణకు సంబంధించి అగ్రరాజ్యం అమెరికా.. చైనాను తప్పుబట్టింది. ఉద్రిక్తతలు తగ్గించడం కోసం భారత్‌ తీసుకొన్న చర్యలకు పూర్తి మద్దతును ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మస్క్ సంపద డౌన్.. ప్రపంచ కుబేరుడిగా బెర్నార్డ్ ఆర్నాల్ట్.. అసలు ఎవరీయన?
    ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్‌ మస్క్‌ రెండో స్థానానికి పడిపోయారు. ఫ్రెంచ్‌ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ మొదటి స్థానంలో నిలిచారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అర్జున్ తెందుల్కర్​ ఘనత.. అచ్చం సచిన్​లానే.. తొలి మ్యాచ్​లోనే సెంచరీ
    తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు దిగ్గజ క్రికెటర్​ సచిన్ తెందుల్కర్​​ తనయుడు అర్జున్​ తెందుల్కర్​. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో భాగంగా రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గోవా తరఫున బరిలోకి దిగిన అర్జున్‌.. 178 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసి సచిన్‌ వారసత్వాన్ని ఘనంగా చాటాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఈ బర్త్​డే బాయ్​ను గుర్తుపట్టారా ఇప్పుడు ఈయన పాన్​ ఇండియా స్టార్​
    ఈ ఫొటోలో కనిపిస్తున్న బుడ్డోడు ఓ ప్రముఖ నిర్మాత తనయుడు. ఓ స్టార్​ హీరో అన్న కొడుకు. అంతే కాకుండా నేటి తరంలో అతి తక్కువ సమయంలో స్టార్​డం తెచ్చుకున్న యంగ్​ అండ్​ డైనమిక్​ హీరోల్లో ఒకరు. ఈయన బుధవారం తన బర్త్​డేను సెలబ్రేట్​ చేసుకుంటున్నారు. ఇంతకీ ఈయన ఎవరంటే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.