ETV Bharat / state

Prathipati on YSRCP: 'గడిచిన నాలుగేళ్లలో ఎక్కడైనా యంత్ర పరికరాలు ఇచ్చారా?'

author img

By

Published : Jun 3, 2023, 5:39 PM IST

Prathipati Pulla Rao Comments On Government: రైతు భరోసా కేంద్రాల పేరిట వైఎస్సార్సీపీ ప్రభుత్వం దగా చేస్తోందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. రైతు భరోసా కింద గడిచిన నాలుగేళ్లలో ఎక్కడైనా యంత్ర పరికరాలు ఇచ్చారా అని ప్రశ్నించారు.

Etv Bharat
Etv Bharat

Prathipati Pulla Rao Comments On Government: రైతు భరోసా కేంద్రాల పేరిట వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్​కు నాలుగేళ్ల తర్వాత రైతులు గుర్తొచ్చారని, రైతు భరోసా కింద నాలుగేళ్లలో ఎక్కడైనా యంత్ర పరికరాలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. ప్రకాశం, కృష్ణా జిల్లాల నుంచి పాత ట్రాక్టర్లు తీసుకొచ్చి, గుంటూరులో షో చేశారని ఎద్దేవా చేశారు. 361 కోట్ల రూపాయల యంత్ర పరికరాలు రైతులకు ఇచ్చినట్లు అసత్య ప్రచారం చేస్తోందని, 185 కోట్ల రూపాయల రాయితీ విడుదల చేసినట్లు చెబుతున్నారని, అందులో కేంద్ర, రాష్ట్ర వాటా ఎంతో చెప్పాలని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.

రైతులకు దగా: మంత్రి విడదల రజిని కూడా పంట నష్టమంటూ నవంబర్​లో హడావిడి చేశారని ఇంతవరకూ పంట నష్టం నమోదు చేయలేదని, రైతులకు పరిహారం ఊసే లేదని, మంత్రి విడదల రజిని సమాధానం చెప్పాలని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. పంట నష్టపోయిన రైతులను జగన్ పూర్తిగా దగా చేశారని, గతంతో ఇవ్వాల్సిన ఇన్ పుట్ సబ్సిడీ డబ్బులు కూడా ఇవ్వలేదన్నారు. సకాలంలో పంటలకు బీమా చేయాలని చంద్రబాబు అసెంబ్లీలో కింద కూర్చొని నిరసన కూడా తెలిపారని గుర్తు చేశారు.

ఆవిడ అవినీతి మంత్రి : శనగలు, మొక్కజొన్నలను ఎక్కడా రైతుల నుంచి కొనుగోలు చేయలేదని, వైఎస్సార్సీపీ నేతలే తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరకు అమ్ముకుంటున్నారన్నారు. మంత్రి వర్గంలో అత్యంత అవినీతి మంత్రి విడదల రజిని అని ఆరోపించారు. రైతు బీమా నిధులను కూడా విడుదల చేయకుండా మోసం చేశారని, రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎక్కడైనా నేరుగా రైతుల నుంచి ధాన్యం కొంటున్నారా? అని ప్రశ్నించారు. సకాలంలో టార్ఫాలిన్ పట్టలు ఇవ్వకపోవడంతో అపార నష్టం జరిగిందని, తమ ప్రభుత్వంలో రైతులకు సకాలంలో అన్నీ అందించామన్నారు.

జగన్​ కొత్త పల్లవి: ఆదివారం చిలకలూరిపేట నియోజకవర్గంలో ఏరువాక కార్యక్రమం చేయబోతున్నట్లు ప్రత్తిపాటి తెలిపారు. భవిష్యత్ గ్యారెంటీకి రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వస్తున్నాయని, ప్రజలకు ఉన్నత భవిష్యత్ ఇచ్చే ఉద్దేశంతో మంచి మేనిఫెస్టో తీసుకొచ్చామన్నారు. ఏరువాక కార్యక్రమంలో భాగంగా రైతుల సమక్షంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నట్లు చెప్పారు. టీడీపీలో వివాదాలకు తావులేదని అధినేత నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందేనని అన్నారు. పేదలు, పెత్తందార్లు అంటూ జగన్ కొత్త పల్లవి అందుకున్నారని.. ఏడు ప్యాలెస్​లు ఉన్న జగన్ పేదవాడు ఎలా అవుతారని.. దేశంలోనే అత్యంత ధనికుడు జగన్ రెడ్డేనని ఆయన విమర్శించారు.

సీఎం జగన్ సొంత జిల్లాలోనూ యువగళం పాదయాత్రకు విశేష ఆదరణ లభిస్తోందని లోకేశ్ యువగళం పాదయాత్ర పెను ఉప్పెనలా మారుతోందని లోకేశ్ జోలికి వస్తే రాష్ట్రంలో జగన్ ఎక్కడా తిరిగే పరిస్థితి కూడా ఉండదని హెచ్చరించారు. ఒడిశా రైలు ప్రమాద ఘటన అత్యంత దురదృష్టకరమని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.

గడిచిన నాలుగేళ్లలో ఎక్కడైనా యంత్ర పరికరాలు ఇచ్చారా?

"జగన్ మోహన్ రెడ్డికి నాలుగు సంవత్సరాల తరువాత రైతు సంక్షేమం గుర్తుకు వచ్చినట్లుంది. గడిచిన నాలుగు సంవత్సరాల రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ పనిమట్లు ఇచ్చారా? ప్రకాశం, గుంటూరు జిల్లాల నుంచి పాత టాక్టర్లను తీసుకువచ్చారంటా మీడియాలో వచ్చింది. ఎవర్ని మోసం చేయడానికి ఇదంతా."-ప్రత్తిపాటి పుల్లారావు, టీడీపీ నేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.