CM Jagan at Tulluru: ''అమరావతి ఇక నుంచి సామాజిక అమరావతి అవుతుంది. మన అందరి అమరావతి అవుతుంది. ఈరోజున 50,793 మంది పేదలకు ఇళ్ల స్థలాలను అందజేస్తున్నాం. ఈ స్థలాలు రూ. 7 లక్షల నుంచి రూ. 10 లక్షల విలువ చేసే ఇంటి స్థలాలు. పైసా ఖర్చు లేకుండా అక్కచెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం. ఇవి కేవలం ఇళ్ల పట్టాలే కాదు.. సామాజిక, న్యాయ పత్రాలు కూడా. సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాల్లో మొత్తం 25 లేఅవుట్లలో ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. వారం రోజుల పాటు ఇళ్ల పట్టాల పండుగ కార్యక్రమం ఉంటుంది. ఇళ్లు కట్టుకోవడానికి జులై 8వ తేదీ (దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి)న బీజం పడుతుంది'' అని సీఎం జగన్ గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రకటించారు.
ఆర్5 జోన్‌లో పేదలకు సీఎం ఇళ్ల పట్టాలు.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటాయపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాజధాని అమరావతి పరిధిలో 50,793 మంది పేదలకు ఈరోజు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాగంగా రాజధాని ప్రాంతంలోని ఆర్5 జోన్‌లో పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాక అమరావతి సామాజిక అమరావతిగా మారిందని, ఇప్పుడు ఇది మన అందరీ అమరావతి అని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు.
Volunteers Ki Vandanam: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సంక్షేమ సారథులు వాలంటీర్లు: సీఎం జగన్
ఇవి ఇళ్ల పట్టాలు కావు-సామాజిక పత్రాలు.. అనంతరం జూలై 8వ తేదీన ఇళ్ల నిర్మాణ పనులను కూడా ప్రారంభిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఇళ్ల పట్టాల పంపిణీ ద్వారా ఇప్పటి వరకూ రెండు లక్షల కోట్ల రూపాయల సంపదను రాష్ట్రంలోని లబ్దిదారులకు అందించామన్నారు. గతంలో పేదలకు ఇళ్లు ఇవ్వాలని పోరాటాలు జరిగితే, ఇప్పుడు అమరావతిలో వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వమే సుప్రీంకోర్టులో పోరాడాల్సి వచ్చిందన్నారు. అమరావతిలో ఈరోజు పేదలకు ఇచ్చినవి ఇళ్ల పట్టాలు కాదని.. సామాజిక పత్రాలని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు.
వారం రోజుల్లోగా ఇంటి పట్టాలను అందిస్తాం.. సీఎం జగన్ మాట్లాడుతూ.. రాజధాని పరిధిలోని ఆర్5 జోన్‌లో 1,402 ఎకరాల్లో సెంటు భూమి చొప్పున 50,723 మంది లబ్దిదారులకు ఇచ్చిన ఇంటి స్థలాలకు వారం రోజుల్లోగా పట్టాలను లబ్దిదారులకు అందిస్తామన్నారు. ఇందుకోసం 25 లేఅవుట్లు వేసి ల్యాండ్ లెవలింగ్, రహదారులు కూడా నిర్మించామన్నారు. గతంలో పేదలకు పట్టాలు ఇవ్వాల్సిందిగా పోరాటాలు జరిగేవని.. ఇప్పుడు ప్రభుత్వమే అమరావతిలో పేదలకు పట్టాలు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. కొన్ని పార్టీలు అమరావతిలో పేదలకు పట్టాలు ఇవ్వకూడదని పోరాటం చేశాయన్నారు. పేదలకు పట్టాలు ఇస్తున్న ప్రాంతంలో ఒక్కో గజం కనీస ధర 15-20 వేల వరకూ ఉందని, పేదలకు ఇచ్చే భూమి విలువ 7 లక్షల రూపాయలు ఉంటుందన్నారు.
Volunteer ki Vandanam: వాలంటీర్లకు వందనం.. లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం జగన్
ఇంటి స్థలం వద్ద ఫోటో తీసి జియో ట్యాగింగ్ చేస్తాం.. లబ్దిదారుడికిచ్చిన ఇంటి స్థలంలో ఫోటో తీసి, జియో ట్యాగింగ్ చేస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. జూలై 8వ తేదీన ఇళ్లు కట్టించే కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తామన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఇసుకను ఉచితంగానే అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. దీంతోపాటు ఇళ్ల నిర్మాణం కోసం అవసరమయ్యే సామాగ్రిని కూడా సబ్సిడీ ధరలో ఇస్తామన్నారు. లబ్ధిదారులకు రూ. 35 వేల రూపాయల రుణం పావలా వడ్డీకే ఇప్పించే ఏర్పాటు చేస్తామన్నారు.
రాష్ట్రంలో క్లాస్ వార్ జరుగుతోంది.. కొవిడ్ కారణంగా రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులూ ఎదురైనప్పటికీ.. మానిఫెస్టోలో పెట్టిన 98 శాతం హామీలను నెరవేర్చామని ముఖ్యమంత్రి జగన్ వివరించారు. ఇప్పటి వరకూ రూ. 2.11 లక్షల కోట్లు లంచాలు లేకుండా నేరుగా బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాలకు వేశామన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 31 లక్షల మందికి ఇచ్చిన ఇంటి స్థలాల విలువ రూ. 75 వేల కోట్లు ఉంటుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కులాల యుద్ధం ఎమీ జరగటం లేదని, కేవలం క్లాస్ వార్ మాత్రమే జరుగుతోందని సీఎం జగన్ పేర్కొన్నారు.
New Master Plan for Durga Temple: దుర్గగుడికి కొత్త మాస్టర్ ప్లాన్.. పాతది గ్రాఫిక్స్‌కే పరిమితం..!
''ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల 70 వేల మందికి ఇళ్ల స్థలాలను అందజేశాం. అందులో సుమారు 21 లక్షల మంది ఇప్పటికే ఇళ్లు కట్టుకున్నారు. ప్రస్తుతం ఆ ఇంటి కనీస విలువ చూస్తే రూ.2 లక్షల కోట్లు మేర సంపద వస్తుంది. గతంలో ఎప్పుడూ ఏ పాలకులు ఇలాంటి సాహసం చేయలేదు. అమరావతిలో 50 వేల మందికి ఇళ్ల పట్టాలతోపాటు 5024 మందికి టిడ్కో ఇళ్లను ఇస్తాం. వారం రోజుల్లో లబ్దిదారులకు అందరికీ ఇళ్ల కాగితాలు అందిస్తాం. రూ. 443 కోట్లతో టిడ్కో ఇళ్లు నిర్మించాం.. కేంద్రం రూ. 150 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్ల వ్యయం జత చేసింది. ఒక్క రూపాయికే టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు ఇస్తాం''-జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి