ETV Bharat / state

బోర్డు మార్చినంత సులువు కాదు.. మోడల్ స్కూలు అంటే..!

author img

By

Published : Jan 29, 2023, 10:46 AM IST

Lack of funds for Nujendla Model School: పేరుకే అదో మోడల్‌ స్కూల్‌.!. అక్కడ గ్రామీణ, నిరుపేద విద్యార్థులకు విద్యతోపాటు వసతి, భోజన సౌకర్యాలూ కల్పించాలి. కానీ అక్కడ అన్ని చోట్లు ఉండే సాధారణ తరగతులు తప్ప.. మరే ఇతర సౌకర్యాలు లేవు. మరో 2నెలల్లో విద్యాసంవత్సరం ముగుస్తున్నా.. నేటికీ వసతి, భోజనం సదుపాయం అందుబాటులోకి రాలేదు. నిధుల కొరత, పాలకుల నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది.

Lack of funds for Nujendla Model School
Lack of funds for Nujendla Model School

Lack of funds for Nujendla Model School: నాడు- నేడు పథకం కింద పాఠశాలల రూపురేఖల్ని మార్చేస్తున్నాం. విద్యా వ్యవస్థలో... సమూల మార్పులు తెస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం.. పదే పదే ప్రచారం చేసుకుంటోంది. కానీ పల్నాడు జిల్లా నూజెండ్ల మోడల్ స్కూల్‌ మాత్రం.. కనీస సౌకర్యాలకు నోచుకోలేకపోతోంది. విద్యార్థులకు... ఉత్తమ విద్యతో పాటు చక్కటి వసతి, పౌష్టికాహారం అందించాలనే సదాశయంతో... మోడల్‌ స్కూళ్లను ఏర్పాటు చేశారు. ఐతే విద్యాసంవత్సరం మెుదలై ఆర్నెళ్లు గడుస్తున్నా... నూజెండ్ల మోడల్ స్కూల్‌లో... వసతిగృహన్ని ప్రారంభించలేదు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు విధిలేని పరిస్థితుల్లో రోజూ పాఠశాలకు వచ్చిపోవాల్సి వస్తోంది.

ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో వసతిగృహ నిర్వహణ కష్టంగా మారిందని నూజెండ్ల మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ పద్మజ తెలిపారు. దాతల సాయంతో... ఇటీవలే మరుగుదొడ్లు శుభ్రం చేయించామని, సరుకులు సరఫరా లేకపోవడంతో భోజన, వసతి సౌకర్యం ఆలస్యమైందన్నారు. ఫిబ్రవరి నుంచి వసతి గృహం తెరుస్తామని తెలిపారు. మోడల్‌ స్కూల్‌ వసతి గృహ నిర్వహణకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందించాలని... విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

మో'డల్' స్కూల్​కు నిధుల కొరత.. విద్యాసంవత్సరం మెుదలై ఆర్నెళ్లైనా తెరుచుకోని వసతి గృహం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.