ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు అదృశ్యం.. నర్సరావుపేటలో కలకలం
Updated on: Jan 21, 2023, 11:02 PM IST

ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు అదృశ్యం.. నర్సరావుపేటలో కలకలం
Updated on: Jan 21, 2023, 11:02 PM IST
child missing : పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని బ్యాంక్ కాలనీలో ఏడాది వయస్సున్న పసివాడు అదృశ్యమయ్యాడు. ఇంటి బయట ఆడుకుంటున్న తన కుమారుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు తండ్రి బండి వాసు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
child missing : పల్నాడు జిల్లా నరసరావుపేట లో సంవత్సరం వయస్సున్న బండి భాను ప్రకాష్ అనే బాలుడి మిస్సింగ్ కలకలం రేపింది. పట్టణంలోని బ్యాంక్ కాలనీలో శనివారం సాయంత్రం బాలుడు ఇంటి బయట ఆడుకుంటుండగా గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారని బాలుడి తండ్రి బండి వాసు ఆరోపించారు. బాలుడు కనిపించకపోవడంతో గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డీఎస్పీ విజయభాస్కరరావు, గ్రామీణ సీఐ భక్తవత్సల రెడ్డి, సిబ్బంది ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.
ఇవీ చదవండి :
- 'తెలుగు రాష్ట్రాల్లో 'పఠాన్' ప్రమోషన్స్.. రామ్చరణ్ తీసుకెళ్తే వస్తా!'
- పట్టపగలు నడిరోడ్డుపై కత్తులతో వెంటాడుతూ.. ఫ్యాక్షన్ సినిమా సీన్.. ఎక్కడంటే?
- జగన్ ను గద్దె దించేందుకు కలిసే నడుస్తామంటున్న.. ఆ పార్టీలు
