'తెలుగు రాష్ట్రాల్లో 'పఠాన్' ప్రమోషన్స్.. రామ్​చరణ్‌ తీసుకెళ్తే వస్తా!'

author img

By

Published : Jan 21, 2023, 9:10 PM IST

Etv Bharat

బాలీవుడ్ బాద్​షా షారుక్​ ఖాన్.. మరోసారి రామ్​చరణ్​పై తనకున్న ప్రేమను వ్యక్తం చేశారు. తన కొత్త సినిమా పఠాన్​ ప్రమోషన్స్..​ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించాలంటే చరణ్​ వచ్చి తనను తీసుకెళ్లాలని ట్వీట్​ చేశారు.

బాలీవుడ్ బాద్​షా షారుక్​ ఖాన్.. పఠాన్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీని సృష్టించేందుకు సిద్దంగా ఉన్నారు!. జనవరి 25న విడుదల కాబోతోన్న ఈ సినిమా కోసం వీలైనంతగా ప్రమోషన్స్ చేసేందుకు కింగ్ ఖాన్ సిద్ధమయ్యారు. అందుకే ఈ మధ్య వీలైనప్పుడల్లా ట్విట్టర్‌లో తన ఫ్యాన్స్‌తో చిట్​చాట్ చేస్తున్నారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానాలు ఇస్తున్నారు.

అయితే తాజాగా షారుక్​ తన ఫాలోవర్లతో మరోసారి చిట్​చాట్ చేశారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లకు వస్తారా? అని అడిగారు. అందుకు షారుక్​ చాలా తెలివిగా సమాధానమిచ్చారు. రామ్​చరణ్‌ తనను తీసుకెళ్తే వస్తానంటూ మెగా పవర్​స్టార్ మీద తనకున్న ప్రేమను వ్యక్తం చేశారు. అంతకుముందు పఠాన్ ట్రైలర్ రిలీజ్ చేసిన సమయంలోనూ చరణ్‌ మీదున్న ప్రేమను వ్యక్తం చేశారు. 'ఆస్కార్ మీ ఇంటికి వచ్చినప్పుడు నన్ను తాకనివ్వు' అని ప్రేమగా ట్వీట్ చేశారు.

మరికొద్ది రోజుల్లో పఠాన్​ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల మార్కెట్ గురించి బాలీవుడ్​ నటులకు బాగా అర్థమైంది. ఇక్కడ కనుక సినిమా క్లిక్ అయితే మాత్రం కోట్లకు కోట్లు దండుకోవచ్చని తెలిసి వచ్చింది. అందుకే తెలుగులోనూ ఈ సినిమాను గట్టిగానే ప్లాన్ చేసినట్టు అనిపిస్తోంది. ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను రామ్​చరణ్ షేర్ చేసేలా ప్లాన్ చేశారు పఠాన్​ మేకర్స్​.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.