ETV Bharat / state

సూక్ష్మ చిత్రాలు గీస్తూ.. ప్రపంచ రికార్డులు సొంతం చేసుకుంటూ

author img

By

Published : Dec 11, 2022, 3:56 PM IST

Teacher Art on Chalk Pieces
విజయవాడ ఉపాధ్యాయుడు

Teacher Art on Chalk Pieces, Pencils : సుద్దముక్క, పెన్సిల్‌ ఇలాంటి వాటితో ఎవరైనా బొమ్మలు గీస్తారు లేదా ఏదైనా రాస్తారు. కానీ, ఇందుకు భిన్నంగా ఓ కళాకారుడు వీటితో అందమైన ఆకృతులు తీర్చిదిద్దుతున్నారు. అంతేకాదు ఈయన కుంచె నుంచి జాలువారిన కళాఖండాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. పాఠశాలలో చిత్రలేఖన ఉపాధ్యాయునిగా పని చేస్తున్న డాక్టర్ నడిపల్లి రవికుమార్‌ గురించి తెలుసుకుందాం.

Teacher Art on Chalk Pieces, Pencils : విజయవాడ పటమటకు చెందిన డాక్టర్ నడిపల్లి రవికుమార్.. సూక్ష్మ చిత్రాలు గీస్తూ ఇప్పటివరకు 16 ప్రపంచ రికార్డులు సొంతం చేసుకున్నారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, ఆరెంజ్ బుక్ ఆఫ్ రికార్డు, అసిస్ట్ బుక్ ఆఫ్ రికార్డు, డైమండ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, విశ్వం బుక్ ఆఫ్ రికార్డ్స్ వంటి పలు రికార్డుల్లో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం పెనమలూరు ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిత్రలేఖనం ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. పెన్సిల్‌పై అంబేడ్కర్ చిత్రాలను గీసి ప్రసంశలందుకున్న ఆయనకు ఎన్టీఆర్‌ పురస్కారం కూడా లభించింది. 2018 సంవత్సరానికిగానూ అతి చిన్న క్యాలెండర్ గీసి పలు ప్రపంచస్థాయి అవార్డులు సొంతం చేసుకున్నారు. సేవా రంగంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఉపాధ్యాయుడంటే పాఠశాలలోని విద్యార్థులు ఎనలేని మక్కువ కనబరుస్తుంటారు. తోటి ఉపాధ్యాయులు ఆయనలోని సేవా భావాలను ఆదర్శంగా తీసుకున్నామంటున్నారు.

సూక్ష్మ చిత్రాల ద్వారా 16 ప్రపంచ రికార్డులు సొంతం చేసుకున్న విజయవాడ ఉపాధ్యాయుడు

మాకు చిత్రలేఖనం చాలా బాగా నేర్పిస్తారు. ఆయన నేర్పించే సమయంలో ఒక్కసారి గీయటం సరిగా రాకపోతే మళ్లీ నేర్పిస్తారు. సార్​ చెప్పే మాటలు మాకు ప్రేరేపితంగా ఉంటాయి." - విద్యార్థిని, పెనమలూరు ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

"విద్యార్థులు ఎవరేవరు ఏ ప్రతిభ కలిగి ఉన్నారో చూసి వారిని అందులో ప్రోత్సాహిస్తారు. కేవలం ఆర్ట్​కే పరిమితం కాకుండా ఆయన సాంస్కృతిక కార్యక్రమాలలో పిల్లలను ప్రొత్సహిస్తున్నారు. పిల్లలు ఆయన క్లాస్​కి సంతోషంతో హాజరవుతుంటారు." -దుర్గాభవాని, ప్రధానోపాధ్యాయురాలు

"ఆయనతో సహోపాధ్యాయులుగా పని చేయటం మాకు సంతోషంగా ఉంది. చిత్రకారునిగా మాత్రమే కాకుండా సామాజిక కార్యకర్తగా ఆయన సేవ చేస్తున్నాడు. ఆయన మాకెంతో ఆదర్శవంతుడు." -డి సుబ్బారావు, ఉపాధ్యాయుడు

ప్రస్తుతం భగవద్గీతను సూక్ష్మ పుస్తకంగా రవికుమార్ తయారుచేస్తున్నారు. దాన్ని త్వరలోనే పూర్తిచేసి ప్రజల ముందుకు తీసుకువస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రవికుమార్ ఉపాధ్యాయునిగా, సూక్ష్మ చిత్రకారునిగానే కాకుండా లయన్స్ క్లబ్ వంటి అంతర్జాతీయ గుర్తింపు పొందిన సంస్థలకు విజయవాడ అధ్యక్షుడిగా పనిచేశారు. సూక్ష్మ చిత్రకారుడిగా రాణించడంలో తన భార్యాపిల్లల ప్రోత్సాహమే కీలకమని ఆయన అంటున్నారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా.. 12 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆర్థిక సాయం అందించానని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాంలోని విద్యార్థులను చైతన్యవంతం చేయాలనే ముఖ్య ఉద్దేశ్యంతో నేను పని చేస్తున్నాను. వాళ్లని చైతన్యం చేయటం వల్ల కొంత మేల్కోల్పగలిగాను. 33 సంవత్సరాల నుంచి కళ రంగంలో, 20 సంవత్సరాల నుంచి సేవ రంగంలో చురుగ్గా పాల్గొంటున్నాను. కళ, సేవ రెండు నాకు రెండు కళ్లలాంటివి. భవిష్యత్తులో ఒక సేవ సంస్థను స్థాపించి.. దాని ద్వారా అనాథలకు సేవలందించి, వారికి మంచి భవిష్యత్​ కల్పించాలని అనుకుంటున్నాను." -డాక్టర్ నల్లపల్లి రవికుమార్, సూక్ష్మ చిత్రకారుడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.