ETV Bharat / state

అత్యాచారానికి పాల్పడిన ఆర్​పీఎఫ్​ కానిస్టేబుల్​.. కేసు నమోదు

author img

By

Published : Dec 14, 2022, 3:06 PM IST

RPF Constable Rape Attempt : ఉద్యోగం కోసం ప్రిపేర్​ అవుతున్న సమయంలో వారిద్దరూ ఓ శిక్షణ సంస్థలో కలిశారు. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది.. ఆ తర్వాత వారిద్దరికీ ఉద్యోగాలొచ్చాయి. కొన్నాళ్లకు విజయవాడలోని ఓ హోటల్​లో కలిశారు. అయితే అతను వివాహానికి నిరాకరిస్తున్నాడని.. తనపై అత్యాచారం చేశాడని యువతి ఆరోపిస్తూ దిశ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం అతను గుంతకల్​లో ఆర్​పీఎఫ్​ కానిస్టేబుల్​గా పని చేస్తున్నాడు.

attempt to rape
అత్యాచారం

RPF Constable Rape Attempt: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆర్​పీఎఫ్​ కానిస్టేబుల్​పై దిశ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన ఓ యువతి పోటీ పరీక్షల కోసం 2020లో నగరంలోని ఓ ఇనిస్టిట్యూట్​లో శిక్షణ తీసుకుంది. ఆ సమయంలో అమెకు చంద్రశేఖర్​ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. తర్వాత అతనికి ఆర్​పీఎఫ్​ కానిస్టేబుల్​గా ఉద్యోగం రాగా.. ఆమెకు బీఎస్​ఎఫ్​ కానిస్టేబుల్​గా ఉద్యోగం వచ్చింది. ఇద్దరు విధులలో చేరి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఆమె అస్సాంలో, అతను గుంతకల్​లో విధులు నిర్వహిస్తున్నారు. చంద్రశేఖర్​ 2021లో విజయవాడకు రాగా.. మాట్లాడుకుందామని చెప్పి యువతిని హోటల్​కు పిలిచాడు. అక్కడ తనపై చంద్రశేఖర్​ అత్యచారానికి పాల్పడ్డాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఇటీవల అతని ప్రవర్తన సరిగా లేకపోవటంతో పెళ్లి చేసుకోవాలని నిలదీసింది. చంద్రశేఖర్​ నిరాకరించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.