ETV Bharat / state

యువత 'బిజీ'నెస్! మేనేజ్‌మెంట్‌ కోర్సుల దిశగా అడుగులు - ప్రపంచస్థాయిలో అపార అవకాశాలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 29, 2023, 12:40 PM IST

MBA_Opportunities
MBA_Opportunities

MBA Opportunities: మీరు జీవితంలో ఏ రంగాన్ని ఎంచుకుంటారంటే ఏ డాక్టరో.. ఇంజినీరో అని చాలా మంది చెబుతారు. కానీ, కాలాక్రమంగా వస్తున్న మార్పులు ఆ పరిస్థితిని మార్చేస్తున్నాయి. మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లోనూ ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండటంతో యువత క్రమంగా అటువైపు మళ్లుతోంది. వ్యాపారవేత్తగా ఎదగాలనుకునే వారికీ ఎంబీఏ ఎంతగానో ఉపయోగపడుతుంది. మేనేజ్‌మెంట్‌ కోర్సులతోపాటు నైపుణ్యాభివృద్ధిని పెంచుకుంటే అవకాశాలు వెంటనే రాకపోయినా తమవద్ద ఉన్న విజ్ఞానంతో స్టార్టప్‌లు, పరిశ్రమలు స్థాపించే స్థాయికి యువత చేరుకుంటుంది. మరి, ఈ విషయంలో నిపుణులు ఏం చెబుతున్నారో.. ఇప్పుడు చూద్దాం.

MBA Opportunities: ఒకప్పుడు ఇంజినీరింగ్, డాక్టర్‌ కోర్సులకు మొగ్గుచూపిన యువత.. క్రమంగా తమ ఆలోచనల్ని మార్చుకుంటోంది. ఉద్యోగిగానే కాక వ్యాపారవేత్తలుగానూ రాణించాలని భావిస్తున్నారు. అందుకు మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో అవకాశాలు మెరుగ్గా ఉండటంతో.. అటువైపు మళ్లుతున్నారు. మార్కెట్‌ మేనేజ్‌ చేసుకోవడం నుంచి ఆర్థికవనరులు సమకూర్చుకునే వరకు కావాల్సిన అన్ని మెళకువలను నేర్పుతున్నాయి.. మేనేజ్‌మెంట్‌ కోర్సులు.

గతంలో కొన్నిరంగాలకే పరిమితమైన ఎంబీఏ గ్రాడ్యుయేట్ల అవసరం ప్రస్తుతం ఇతర రంగాలకూ విస్తరిస్తోంది. అంటే.. ఎంబీఏ చేసి మంచి నిపుణ్యత కలిగిన వారికి డిమాండ్‌ పెరుగుతోంది. మేనేజ్‌మెంట్‌ విద్యలో భారత్ ఇప్పుడు ప్రపంచస్థాయి వేదికగా అవతరిస్తోంది. భారత్‌లో మేనేజ్‌మెంట్‌ విద్య ఇప్పటిదాకా సంప్రదాయబద్ధమైన తరగతి బోధనకే పరిమితమైంది. ఇప్పుడు క్రమంగా ఆ ధోరణిలో మార్పు వస్తోందని అంటున్నారు నిపుణులు.

యువత 'బిజీ'నెస్! మేనేజ్‌మెంట్‌ కోర్సుల దిశగా అడుగులు - ప్రపంచస్థాయిలో అపార అవకాశాలు

'ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో నంబర్ వన్' సామాజిక అంశాలపై ఆసక్తి కొద్దీ మరో లక్ష్యానికి చేరువైన తులసి

Management Courses Importance: ఉద్యోగిగానే కాకుండా వ్యాపారవేత్తగా ఎదగాలని యువత భావిస్తోంది. అందుకు ఎంబీఏ సరైన వేదిక అనేది వారి ఆలోచన. దీంతో ఉద్యోగులుగా కాలం వెళ్లదీసేకంటే.. పలువురికి ఉపాధి చూపే పారిశ్రామికవేత్తలుగా ఎదిగే వీలుంది. అంకుర సంస్థలు, పరిశ్రమల స్థాపన వరకు అన్నింటా అవకాశాలుండడం వీరికి కలిసొచ్చే అంశం. చాలా ఉద్యోగాల్లో అనేక ఒడుదొడుకులు ఎదురైనా మేనేజ్‌మెంట్‌ నిపుణుల భవితకు ఢోకా లేదంటున్నారు నిపుణులు.

ఉద్యోగ నియామకాలు చేపట్టే సంస్థలు.. అదనపు అర్హతగా ఎంబీఏ చేస్తే మేలంటున్నాయి. ఒక ఆసుపత్రి నిర్వహించాలంటే వైద్యుడిగా పట్టా సంపాదిస్తే సరిపోదు. ఓ పరిశ్రమ స్థాపనకు ఆర్థిక వనరులు ఉన్నా వీలుకాదు. ప్రణాళిక, ఫైనాన్స్‌, మార్కెటింగ్‌, టెక్నాలజీ వంటి విభిన్న అంశాలపై పట్టుండాలి. అందుకే చాలామంది వైద్యవిద్య, ఇంజనీరింగ్‌, డిగ్రీలు వంటివి చేసిన తర్వాత కూడా ఎంబీఏ వైపు చూస్తున్నారు.

అంతర్జాతీయ జల సదస్సులో 'ఫ్లాష్ మాబ్' - ప్రతినిధుల మెప్పు పొందిన 'ఆంధ్ర' విద్యార్థుల మైమ్

ప్రపంచీకరణతో ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు గతంకంటే ఎన్నో రెట్లు అవకాశాలు పెరిగాయి. వారి చదువు ఏదైనా కన్సల్టింగ్‌ రంగంలో స్థిరపడాలంటే ఎంబీఏ తప్పనిసరైంది. దీంతో ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌, ప్రైవేటు ఈక్విటీ, కార్పొరేట్‌ బ్యాంకింగ్‌ రంగాలూ వీరికే ప్రాధాన్యమిస్తున్నాయి. బిజినెస్‌ డెవలప్‌మెంట్‌, టెక్నాలజీ కన్సల్టింగ్‌, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ తదితర విభాగాల్లో వీరికి అవకాశాలు అధికం.

సొంత వ్యాపార స్థాపనకు కావాల్సిన జ్ఞానం ఎంబీఏతో లభిస్తుందని యువత భావన. కుటుంబ వ్యాపారం ఉన్నవారూ ఈ రంగంపట్ల ఆసక్తి చూపుతున్నారు. వారి వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి కావలసిన నైపుణ్యాలు ఈ కోర్సుల్లో నేర్చుకోవాలనేది వారి ఆశ. కొన్ని కళాశాలలు ఫ్యామిలీ బిజినెస్‌కి అనుగుణంగా కూడా కోర్సుల్ని ఆఫర్‌ చేస్తున్నాయి. బహుళ ప్రయోజనాలు కలిగిన ఎంబీఏ కోర్సులు చేయడం మేలని భావిస్తోంది యువత. మేనేజ్‌మెంట్‌ కోర్సులు చేస్తే ఉద్యోగితో పాటు తమ విజ్ఞానంతో స్టార్టప్‌లు, పరిశ్రమలు స్థాపించే సత్తా ఉంటుందని యువత భావిస్తోంది.

సివిల్​ సర్వీసెస్​ అభ్యర్థులకు టెన్త్​ క్లాస్​ స్టూడెంట్​ పాఠాలు- యువ ప్రొఫెసర్​గా రికార్డ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.