ETV Bharat / bharat

సివిల్​ సర్వీసెస్​ అభ్యర్థులకు టెన్త్​ క్లాస్​ స్టూడెంట్​ పాఠాలు- యువ ప్రొఫెసర్​గా రికార్డ్

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 15, 2023, 4:49 PM IST

Updated : Nov 15, 2023, 6:12 PM IST

10th Class Student Teaches Civil Services Aspirants : పదో తరగతి చదివే పిల్లవాడు సివిల్ సర్వీసెస్​కు ప్రిపేర్​ అవుతున్న అభ్యర్థులకు పాఠాలు చెబుతున్నాడు. వినడానికి వింతగా ఉన్నా.. ప్రముఖులు సైతం అతడి ప్రతిభకు ఔరా అంటున్నారు. మరీ ఆ పిల్లాడు ఎవరు? యువ ప్రొఫెసర్​గా ఎలా పేరు తెచ్చుకున్నాడు?

10th class Student Teaches Civil services Aspirants
10th class Student Teaches Civil services Aspirants

సివిల్​ సర్వీసెస్​ అభ్యర్థులకు టెన్త్​ క్లాస్​ స్టూడెంట్​ పాఠాలు- యువ ప్రొఫెసర్​గా రికార్డ్

10th Class Student Teaches Civil Services Aspirants : చదివేది పదోతరగతే.. కానీ చేసే పని మాత్రం పాఠాలు చెప్పడం! అది కూడా స్కూల్​ పిల్లలకు కాదు.. ఏకంగా సివిల్స్​కు ప్రిపేర్​ అయ్యే అభ్యర్థులకు, లా స్టూటెండ్స్​కు క్లాస్లులు​ చెబుతున్నాడు ఈ బాలుడు. అతడి ప్రతిభను చూసి.. సీఎం, గవర్నర్లు, కేంద్రమంత్రులు సైతం మెచ్చుకోలేక ఉండలేకపోయారు మరీ. ఆ పిల్లాడే ఉత్తర్​ప్రదేశ్​లోని కాన్పుర్​కు చెందిన యశ్వర్ధన్ సింగ్​.

10th class Student Teaches Civil services Aspirants
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​తో యశ్వర్ధన్ సింగ్

సివిల్ సర్వీసెస్​కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు హిస్టరీ, పొలిటీ, ఇంటర్నెషనల్ రిలేషన్స్, జాగ్రఫీని చెబుతున్నాడు. అతి చిన్న వయసులోనే ఇంటర్నేషనల్ టాపిక్స్ బోధిస్తున్న వ్యక్తిగా లండన్​కు చెందిన హార్వర్డ్ రికార్డ్స్​లో పేరు సంపాదించాడు. అలానే ఇండియా పోస్టల్ డిపార్ట్​మెంట్ కూడా అతడి పేరు మీద పోస్టల్ స్టాంప్స్​ను కూడా విడుదల చేశారు.

10th class Student Teaches Civil services Aspirants
అవార్డును అందుకుంటున్న యశ్వర్ధన్

ఇంత చిన్న వయస్సులోనే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మార్గనిర్దేశం ఇవ్వటం, యువ ప్రొఫెసర్​గా పేరు తెచ్చుకోవడానికి తన తల్లి కారణం అని అంటున్నాడు యశ్వర్ధన్ సింగ్. "మా అమ్మ కంచన్ పాల్ ఇంట్లో.. ఉత్తర్​ప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్​కు ప్రిపేర్​ అయ్యేవారు. ఏం చేస్తున్నావు? ఏం చదువుతున్నావు? అని ఆమెను అడిగేవాడిని. అమ్మ చెప్పిన మాటలకు నాకు కూడా ఆసక్తి పెరిగింది. అమ్మ చదువుకునేటప్పుడు పాలిటీ, హిస్టరీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఏంటి అనే అడిగి తెలుసుకున్నాను. నేను కూడా అప్పటి నుంచి చదవటం ప్రారంభించాను" అని యశ్వర్ధన్ సింగ్ తెలిపాడు.

10th class Student Teaches Civil services Aspirants
యశ్వర్ధన్​తో మచ్చటిస్తున్న గవర్నర్

అంతర్జాతీయ సదస్సులో భారత్ తరపున ప్రతినిధ్యం.. విద్యా రంగానికి సంబంధించి దిల్లీలో 'గ్లోబలైజ్డ్ వరల్డ్‌లో నావిగేట్ ఎడ్యుకేషన్' జరిగిన అంతర్జాతీయ సదస్సుకు భారత్ తరపున నాయకత్వం వహించాడు యశ్వర్ధన్ సింగ్. బాల్య విద్యా సంరక్షణ అంశంపై ప్రసంగించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఈ అంతర్జాతీయ సదస్సుకు 30 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. యశ్వర్ధన్ సింగ్​ ప్రతిభను చూసి ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ను పిలిచి మరీ మట్లాడారు.

10th class Student Teaches Civil services Aspirants
యశ్వర్ధన్ సాధించిన పతకాలు

"ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లినప్పుడు.. ఆయనతో నేను నేషనల్​ ఎడ్యుకేషన్ పాలసీ గురించి చర్చించాను. రాష్ట్రీయ సమగ్ర శిక్షా అభియాన్​తో కలిసి ఎలా పని చేస్తున్నాను అనే విషయాన్ని వివరించాను. అలానే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఎలా శిక్షణ ఇస్తున్నాను అనే విషయం గురించి చర్చించాను. ఈ నూతన విద్యా విధానం, రాష్ట్రీయ సమగ్ర శిక్షా అభియాన్.. ఉత్తరప్రదేశ్​కు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయని వివరించాను."

-యశ్వర్ధన్ సింగ్

గవర్నర్​ సూచనతో.. యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ యశ్వర్ధన్​ను విశ్వవిద్యాలయాల్లో లా విద్యార్ధులకు బోధించమని అడిగారు. 'ఐఏఎస్​ అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నావు. విశ్వవిద్యాలయాలలో కూడా బోధించవచ్చు కదా! నేనే వైస్​ ఛాన్సలర్​గా ఉండేది' అని అన్నారు. అప్పటివరకు సివిల్స్ ఆశావాహులకు పాఠాలు చెప్పిన యశ్వర్ధన్.. యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ సూచనతో లా స్టూడెంట్స్​కు సైతం బోధించడం మొదలుపెట్టాడు. భవిష్యత్తులో ఇండియన్ ఫారిన్ సర్వీస్​లో​ చేరాలన్నది తన లక్ష్యమని అంటున్నాడు యశ్వర్ధన్. దౌత్యవేత్తగా పనిచేస్తూ.. భారత్‌ను ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాలనుకుంటున్నట్లు తెలిపాడు.

10th class Student Teaches Civil services Aspirants
యశ్వర్థన్​ పేరుతో పోస్టల్ స్టాంప్స్

Bhangra Dance On Skates : స్కేట్స్​తో భాంగ్రా డ్యాన్స్​.. అమ్మాయి ప్రతిభ అదుర్స్.. దేశంలో ఏకైక వ్యక్తిగా..

అవలీలగా యోగాసనాలు.. అక్కాచెల్లెళ్ల అద్భుతమైన ప్రతిభ.. 70 ఏళ్ల తాతే గురువు..

Last Updated : Nov 15, 2023, 6:12 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.