ETV Bharat / state

క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు.. లోకేశ్

author img

By

Published : Dec 25, 2022, 2:20 PM IST

Updated : Dec 25, 2022, 2:33 PM IST

Chandrababu and Lokesh
చంద్రబాబు, లోకేశ్

Christmas Wishes: తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ క్రైస్తవ సోదరీ సోదరమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు రాజ్యంలో సేవ తప్ప మరి దేనికీ చోటు లేదన్నారు. ప్రపంచ‌శ్రేయ‌స్సుని కాంక్షించే ద‌యామ‌యుడు ఏసుక్రీస్తు అని లోకేశ్ పేర్కొన్నారు. క్రిస్మస్​ని సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

Christmas Wishes: క్రైస్తవ సోదరీ సోదరమణులకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో శాంతి కోసం పాటుపడటం, సాటి మనిషి శ్రేయస్సు కోసం కృషి చేయడమే అసలైన క్రైస్తవం అని చంద్రబాబు తెలిపారు. క్రీస్తు రాజ్యంలో సేవ తప్ప మరి దేనికీ చోటు లేదన్నారు. క్రీస్తు జన్మదినం సర్వ మానవాళికి పవిత్ర దినమని.. శాంతి శకానికి ఆరంభ దినమని చెప్పారు. ప్రపంచ‌శ్రేయ‌స్సుని కాంక్షించే ద‌యామ‌యుడు ఏసుక్రీస్తు జ‌న్మదినాన్ని క్రిస్మస్​గా జరుపుకుంటున్నామని లోకేశ్ పేర్కొన్నారు. ప్రేమ‌ను పంచిన శాంతిదూత ఉప‌దేశం మాన‌వాళి ఆచ‌రించ‌ద‌గిన నిత్యనూత‌న సందేశమని స్పష్టం చేశారు. క్రిస్మస్ పండ‌గ‌ని ఆనందంగా జ‌రుపుకోవాల‌ని కోరుకుంటున్నట్లు తెలిపారు.

  • సమాజంలో శాంతి కోసం పాటుపడటం, సాటి మనిషి శ్రేయస్సు కోసం కృషి చేయడమే అసలైన క్రైస్తవం. క్రీస్తు రాజ్యంలో సేవ తప్ప మరి దేనికీ చోటు లేదు. క్రీస్తు జన్మదినం సర్వ మానవాళికి పవిత్ర దినం. శాంతి శకానికి ఆరంభ దినం. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు!#MerryChristmas

    — N Chandrababu Naidu (@ncbn) December 25, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • ప్ర‌పంచ‌శ్రేయ‌స్సుని కాంక్షించే ద‌యామ‌యుడు ఏసుక్రీస్తు జ‌న్మ‌దిన‌మైన క్రిస్మ‌స్ సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను. ప్రేమ‌ను పంచిన శాంతిదూత ఉప‌దేశం మాన‌వాళి ఆచ‌రించ‌ద‌గిన నిత్య‌నూత‌న సందేశం. క్రిస్మ‌స్ పండ‌గ‌ని ఆనందంగా జ‌రుపుకోవాల‌ని కోరుకుంటూ.. #MerryChristmas

    — Lokesh Nara (@naralokesh) December 25, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు.. లోకేశ్

ఇవీ చదవండి:

Last Updated :Dec 25, 2022, 2:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.