ETV Bharat / state

సాగు తగ్గినా.. వృద్ధి పెరుగుతుందా..? ఈ లెక్కలెంటో..

author img

By

Published : Apr 8, 2023, 7:33 AM IST

cultivation of crops details in ap
ఏపీ పంట సాగు వివరాలు

Crops Cultivation in AP : రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్, రబీల్లో సాగు తగ్గింది. గత ఏడేళ్ల గణాంకాలు పరిశీలిస్తే.. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఇది వ్యవసాయ రంగంలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నా.. సర్కారు మాత్రం సాగు ఘనమే అంటూ వెన్ను చరుచుకుంటోంది. తమ పాలనలో వ్యవసాయం అద్భుతంగా ఉందని, పంట దిగుబడులు పెరుగుతున్నాయని సీఎం జగన్‌ చెబుతున్నారు.

సాగు తగ్గితే ఉత్పత్తి పెరుగుతుందా?

Crops Yielding in AP : 'రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్, రబీల్లో సాగు తగ్గింది. సాధారణ విస్తీర్ణం కన్నా ఖరీఫ్‌లో 5.49 లక్షల ఎకరాలు, రబీలో 10.77 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేయలేదు. వరితోపాటు వేరుసెనగ, సెనగ, జొన్న వంటి పంటల సాగు గణనీయంగా తగ్గింది. దీంతో ఉత్పత్తి కూడా పడిపోనుంది. గత ఏడేళ్ల గణాంకాలు పరిశీలిస్తే.. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఇది వ్యవసాయ రంగంలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నా.. సర్కారు మాత్రం సాగు ఘనమే అంటూ వెన్ను చరుచుకుంటోంది. వైసీపీ ప్రభుత్వం పాలనలో వ్యవసాయం పంట దిగుబడులు పెరుగుతున్నాయని, సాగు అద్భుతంగా ఉందని, సీఎం జగన్‌ చెబుతున్నారు.

'మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, దేవుడి దయ వల్ల నాలుగు సంవత్సరాలుగా వర్షాలు సమృద్ధిగా పడ్డాయి. గతంలో మాదిరిగా రెయిన్​ గన్​లు లేవు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కరవు లేదు. ఈ నాలుగేళ్లోలో ఒక్క మండాలాన్ని కరవు మండలం ప్రకటించాల్సిన అవసరం లేదు. ప్రతియోటా పంటల దిగుబడులు పెరుగుతున్నా పరిస్థితులు కనిపిస్తున్నాయి.' అని ముఖ్యమంత్రి గతంలో ప్రసంగించారు. పంట దిగుబడి పెరిగిందని, ఒక్క కరవు మండలమూ ప్రకటించాల్సిన పరిస్థితి లేదని ముఖ్యమంత్రి చెబుతుంటే.. రాష్ట్రంలో సాగు మాత్రం తగ్గిపోతోంది. ఈ ఏడాది ఖరీఫ్, రబీల్లో సాధారణ విస్తీర్ణం కన్నా 16.26 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. ఖరీఫ్, రబీ మొత్తం సాగులో ఇది 10.88శాతం. అంతెందుకు అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌లో 6.44 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడలేదు. అంటే సాగు తగ్గితే ఉత్పత్తి పెరుగుతుందా? అవేం లెక్కలో, అందులో మతలబేంటో ప్రభుత్వమే చెప్పాలి.

సాగు తగ్గితే వృద్ధి పెరుగుతుందా : ఈ ఏడాది వ్యవసాయంలో 20.72శాతం వృద్ధి నమోదవుతుందని 2022-23 సామాజిక ఆర్థిక సర్వేలో ప్రభుత్వం అంచనా వేసింది. అంటే సాగు తగ్గితే.. వృద్ధి పెరుగుతుందా? ఈ లెక్కలేంటో, ఆ వృద్ధి ఎంతో ఆ నివేదిక విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిలే వివరించాలి. ఖరీఫ్, రబీ రెండు పంట కాలలను కలిపితే రాష్ట్రంలో వరి సాగు సుమారు 6.44 లక్షల ఎకరాల్లో తగ్గింది. ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి చొప్పున మద్దతు ధరపై లెక్కిస్తే 2 వేల 628 కోట్ల పంట ఉత్పత్తికి విఘాతం కలిగింది. మద్దతు ధర లభించక నష్టపోతున్న కౌలు రైతులు సాగు నుంచి వైదొలుగుతుండటం, వర్షాలతో పంటల నష్టాలు ఇందుకు ప్రధాన కారణం. అంబేడ్కర్​ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు నెల్లూరు, కడప, బాపట్ల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల రైతులు పంట విరామన్ని ప్రకటించారు.

ఖరీఫ్​, రబీలో ప్రధాన పంటల సాగు వివరాలు
ఖరీఫ్​, రబీలో ప్రధాన పంటల సాగు వివరాలు

తగ్గిన అపరాల సాగు : నూనెగింజల పంటల సాగు ఖరీఫ్‌లో సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే 19శాతం, రబీలో 14శాతం తగ్గింది. పప్పు ధాన్యల పంటల సాగు ఖరీఫ్‌లో 16శాతం, రబీలో 25శాతం మేర తక్కువగా నమోదైంది. రబీలో 30శాతం విస్తీర్ణంలో, 33శాతం విస్తీర్ణంలో పెసర వేయలేదు. ఖరీఫ్‌లో సాధారణ విస్తీర్ణం కన్నా పత్తి సాగు లక్షా 37 వేల 500 ఎకరాలు, మిరప లక్షా 92 వేల 500 ఎకరాల మేర పెరిగాయి. మొక్కజొన్న, ఉల్లి, నువ్వు, ఆముదం, పొద్దుతిరుగుడు వంటి పంటల విస్తీర్ణం కొంతమేర పెరిగింది.

ఈ సంవత్సరం ఆహార, ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం
ఈ సంవత్సరం ఆహార, ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం

కరవు మండలాలను ప్రకటించలేదు : ఖరీఫ్‌లో రాష్ట్రవ్యాప్తంగా 273 మండలాల్లో పొడి వాతావరణం నెలకొందని గణాంకశాఖ నివేదికల ఆధారంగా తెలుస్తోంది. అధికంగా రాయలసీమ, దక్షిణ కోస్తాల్లోనే ఈ మండలాలు ఉన్నాయి. అత్యధికంగా శ్రీసత్యసాయిలో 15, కర్నూలు జిల్లాలో 15, ప్రకాశంలో 13, అనంతపురంలో 12, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో 11 చొప్పున మండలాలున్నాయి. మిగతా జిల్లాల్లోనూ సుమారు 2 నుంచి 10 మండలాల్లోనూ ఇదే పరిస్థితి. సాగు అనుకూలించక పోవటంతోనే కర్నూలు, అనంతపురంతో పాటు ఇతర జిల్లాల నుంచి వలసలు పెరిగాయి. ఇలా జరుగుతున్న క్రమంలో క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసి ఆ ప్రాంతాలలో కరవు మండలాలను ప్రకటించాలి. అధికార వైసీపీ పాలనలో కరవు అనేందుకు జగన్‌ ప్రభుత్వం ఇష్టపడటం లేదు. కనీసం సమీక్ష చేయలేదు. రైతులు, వ్యవసాయ కూలీల కష్టాలను పట్టించుకోలేదు.

ఈ సంవత్సరం ఆహార, ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం
పొడి వాతావరణ మండలాలు

పట్టించుకోని ప్రభుత్వం : ఖరీఫ్, రబీల్లో ఈ స్థాయిలో సాగు తగ్గిపోవడం రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఎప్పుడూ లేదు. ఖరీఫ్‌తో పోలిస్తే రబీలోనే గణనీయంగా తగ్గింది. అయినా సర్కారు దీనిపై దృష్టి సారించడం లేదు. సాగు తగ్గటానికి గల కారణాలను అన్వేషించే పరిస్థితి రాష్ట్రంలో కనిపించడం లేదని వ్యవసాయ నిపుణులు, రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.

ఏడు సంవత్సరాలలో రాష్ట్రంలోని ఖరీఫ్​, రబీ సాగు వివరాలు
ఏడు సంవత్సరాలలో రాష్ట్రంలోని ఖరీఫ్​, రబీ సాగు వివరాలు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.