ETV Bharat / state

సీఎం జగన్ పెద్ద తిమింగలం.. ఎమ్మెల్యేలు చిన్న తిమింగలాలు : చంద్రబాబు

author img

By

Published : Apr 7, 2023, 8:03 PM IST

Updated : Apr 8, 2023, 6:21 AM IST

Chandrababu Naidu is angry on Jagan నెల్లూరు జిల్లాలో తెలుగు దేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణుల సన్నద్ధ సమావేశం ప్రాంగణం మొత్తం పసుపు రంగుతో నిండిపోయింది. నెల్లూరు జాతీయ రహదారి పక్కన వేణు గోపాలస్వామి కళాశాల మైదానంలో 2500 మంది సభ్యులతో జోన్4 సభ ప్రారంభమైంది. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఎమ్మెల్యేలు, నాయకుల అక్రమాలు, అవినీతి దందాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

Chandrababu Naidu is angry on Jagan : సీఎం జగన్ మోహన్ రెడ్డి తిమింగలమైతే.. ఎమ్మెల్యేలు చిన్న తిమింగలాలుగా మారారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అక్రమాలపై నిలదీస్తే జైలుకు పంపుతున్న ఈ ప్రభుత్వం.. ఇంకా ఎంతమందిని జైలుకు పంపుతుందని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ పాలనలో ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అయ్యాయని, బాధితుల తరఫున పోరాడితే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం చంద్రబాబు వ్యక్తం చేశారు.

కార్యకర్తలకు అండగా ఉండాలి... నెల్లూరులో జాతీయ రహదారి పక్కన వేణు గోపాలస్వామి కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన జోన్4 సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. నిరంతరం ప్రజల్లో ఉండి పనిచేయాలని శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ప్రజాభిప్రాయాలు తెలుసుకుని ముందుకెళ్లాలని చెప్పారు. పార్టీలో కార్యకర్తలు లేకపోతే నాయకులు ఉండరని, కార్యకర్తకు కష్టం వస్తే వారిని ఆదుకోవాలని అన్నారు.

బాధితుల తరఫున పోరాడితే కేసులా..? వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకు పడ్డారు. అక్రమాలను ఎత్తి చూపుతూ, ప్రభుత్వ వైఫల్యాలు, ఎమ్మెల్యేలు, నాయకుల దందాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలపై నిలదీస్తే జైలుకు పంపుతున్న ఈ ప్రభుత్వం.. ఇంకా ఎంతమందిని జైలుకు పంపుతుందని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ పాలనలో ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అయ్యాయని, బాధితుల తరఫున పోరాడితే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నీ దోచుకుంటున్నారు... కావలి ఎమ్మెల్యే.. పేదల ఇళ్లలో వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. కమీషన్లకు కక్కుర్తి పడి మొత్తం బొక్కేశారని, భూమి అమ్మాలన్నా, కొనాలన్నా అనుమతి తీసుకోవాల్సిందేనని విమర్శించారు. పలమనేరు ఎమ్మెల్యే గ్రానైట్‌ పరిశ్రమను దోచుకుంటున్నారని, సత్యవేడు ఎమ్మెల్యే ఇసుకను చెన్నైకి తరలిస్తున్నారని తెలిపారు. కాళహస్తిలో స్వర్ణముఖి నదిలో ఇసుక, డంపింగ్‌ యార్డు భూమి ఆక్రమించుకున్నారని, పుంగనూరు వైఎస్సార్సీపీ నేత మైనింగ్‌ మొత్తం దోచుకుంటున్నాడని, ఒంగోలులో వైఎస్సార్సీపీ నేత గ్రానైట్‌ దోచుకున్నారని ధ్వజమెత్తారు.

వాలంటీర్లపై ఆగ్రహం.. వాలంటీర్ వ్యవస్థ దుర్వినియోగం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వాలంటీర్లు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని, అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తే వదిలేది లేదని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేసినంత కాలం అందరూ సహకరించాలని చెప్పారు.

తమ్ముళ్లలో నవోత్సాహం.. నెల్లూరు జిల్లాలో తెలుగు దేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణుల సన్నద్ధ సమావేశం ప్రాంగణం మొత్తం పసుపు రంగుతో నిండిపోయింది. నెల్లూరు జాతీయ రహదారి పక్కన వేణు గోపాలస్వామి కళాశాల మైదానంలో 2500 మంది సభ్యులతో జోన్4 సభ ప్రారంభమైంది. ఉదయం నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఐదు పార్లమెంట్ స్థానాల క్లస్టర్ ఇన్‍ఛార్జ్​లు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట, బాపట్ల స్థానాల టీడీపీ కమిటీల శ్రేణులు హాజరయ్యారు.

ఇవీ చదవండి :

Last Updated : Apr 8, 2023, 6:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.