ETV Bharat / state

పందుల మృతిపై స్పందించిన అధికారులు.. క్షేత్రస్థాయిలో పర్యటన

author img

By

Published : Mar 13, 2023, 4:41 PM IST

Animal Husbandry Department Reacted : ఎన్టీఆర్ జిల్లాలో వందల సంఖ్యలో పందులు మృతి చెందటంతో వాటి యాజమానులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఈనాడు-ఈటీవీ భారత్​లో వచ్చిన కథనాలకు పశుసంవర్ధక శాఖ స్పందించింది. పందులు మృత్యువాత పడటానికి గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు.

Animal Husbandry Department
పశుసంవర్ధక శాఖ

Animal Husbandry Department : ఎన్టీఆర్ జిల్లాలో అంతుచిక్కని వ్యాధితో పందులు మృతి చెందుతున్న విషయం తెలిసిందే. అయితే గత 15 రోజులుగా సుమారు 1500 వరకు ఆ మహమ్మారి సోకి మృత్యువాత పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈనాడు-ఈటీవీ భారత్​లో ప్రచురితమైన వరుస కథనాలను పశుసంవర్ధక శాఖ అధికారులు స్పందించారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు, వైద్యులు జిల్లాలోని పెనుగంచిప్రోలులో పర్యటించారు. అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. పందులు మృతి చెందిన ప్రదేశాలు, అవి ఎక్కువగా తిరిగే ప్రాంతాలను అధికారులు పరిశీలించారు.

వారు పర్యటిస్తున్న సమయంలో ఓ పంది మృతి చెంది ఉండగా.. ఆ మృత కళేబరం నుంచి నమూనాలు సేకరించారు. పందులలో స్పైన్ ఫీవర్ అనే వ్యాధి అధికంగా ఉందని.. దాని కారణంగా అవి మృతి చెంది ఉంటాయని ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. వాటి మరణాలను తగ్గించటానికి కొంత రక్షణగా ఉంటుందనే ఉద్దేశ్యంతో స్పైన్ ఫీవర్ టీకాను పందులకు ఇవ్వనున్నట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు. అంతుచిక్కని ఆ వ్యాధితో మృతి చెందిన పందుల కళేబరానికి పోస్టుమార్టం నిర్వహిస్తే.. అంతుచిక్కని ఆ మహమ్మరిపై అవగాహన వస్తుందని అన్నారు. దానివల్ల మరింత మెరుగైన చర్యలు తీసుకోవటానికి అవకాశం ఉంటుందని వెల్లడించారు.

ఇంతకీ ఏమైందంటే.. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని కొంతమంది ప్రజలు పందుల పెంపకాన్ని చేపట్టి జీవానాన్ని కొనసాగిస్తున్నారు. ఇవి స్థానికంగా ఉన్న మునేరు, ఇతర పరిసర ప్రాంతల్లో సంచరిస్తుంటాయి. ఆ సమయంలో ఏదైనా దొరికితే తిని కడుపు నింపుకుంటాయి లేకపోతే.. వాటి యాజమానులే ఏదైనా ఆహారం సమకూరుస్తారు. అంతేకాకుండా గ్రామంలో గాని, అందుబాటులో ఉన్న ప్రాంతాలలో ఏదైనా కార్యక్రమం నిర్వహించినప్పుడు మిగిలిన ఆహారాన్ని వాటికి మేతగా వేస్తారు.

ఇలా వాటి పెంపకం సాగుతుండగా.. గత 15 రోజుల నుంచి మునేరు పరిసర ప్రాంతాలకు మేతకు వెళ్లిన పందులు ఇంటికి తిరిగి రావటం లేదు. యాజమానులు వెతుక్కుంటూ వాటి కోసం వెళ్లినప్పుడు అవి కదలలేని స్థితిలో దర్శనమిస్తున్నాయి. కొన్నింటి ఆచూకీ తెలియక మృత్యువాత పడుతున్నాయి. మృతి చెందిన కళేబరాలు లభిస్తే వాటిని యాజమానులు పాతిపెడుతున్నారు. ఆచూకీ తెలియనివి అలాగే కుళ్లిపోతున్నాయి.

ఆందోళనలో పెంపకందారులు : ఈ అంతుచిక్కని వ్యాధి బారినపడి పందులు మృతి చెందుతుండటంతో యాజమానులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక వైద్యులకు చూపించిన పందుల మరణాలు తగ్గటం లేదని పెంపకందారులు వాపోయారు. తమ జీవనాధారమైన పందులు మృతి చెందుతుండటంతో లక్షల్లో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.