ETV Bharat / state

సీఎం జగన్ ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు: బొప్పరాజు వెంకటేశ్వర్లు

author img

By

Published : Feb 3, 2023, 5:57 PM IST

ap
ap

Apjac President bopparaju Comments: ఏపీజేఏసీ చేపట్టిన 'చలో విజయవాడ' నేటీతో ఏడాది పూర్తి చేసుకుందని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. కానీ, ఆరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన ఏ ఒక్క హామీ నేరవేరలేదని గుర్తు చేశారు.

APJAC President Bopparaju Comments: గత సంవత్సరం ఫిబ్రవరి 3వ తేదీన లక్షలాది మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో చేపట్టిన 'చలో విజయవాడ' కార్యక్రమం నేటీతో ఏడాది పూర్తి చేసుకుందని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. చలో విజయవాడ కార్యక్రమం కారణంగా ఆనాడూ 11వ పీఆర్సీని సాధించుకున్నామన్నారు. కర్నూలు జిల్లాలోని రెవెన్యూ భవనంలో ఈరోజు ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ.. ఉద్యోగులు ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పరిష్కారం కోసం గత సంవత్సరం చేపట్టిన 'చలో విజయవాడ' కార్యక్రమం నేటీతో సంవత్సర కాలం గడచిందని గుర్తు చేశారు.

అనంతరం ఆ 'చలో విజయవాడ' ఉద్యమంతో 11వ పీఆర్సీ తప్ప కొత్తగా ఏమీ సాధించలేదన్నారు. చలో విజయవాడ కార్యక్రమం వల్ల గతంలో ఉన్న రాయితీలను పూర్తిగా నిలుపుకోగలిగామన్నారు. ఆరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉద్యోగ సంఘల నాయకులతో జరిపిన చర్చల్లో పలు హామీలు ఇచ్చారని.. ఆ హామీలు ఇంతవరకూ అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు. సంవత్సరాల కాలంగా ఆ హామీల అమలు కోసం ఎదురుచూస్తున్నా.. ఇప్పటికి ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేరలేదన్నారు. ముఖ్యమంత్రిపై ఉన్న నమ్మకంతో హామీల అమలుకై గత సంవత్సర కాలంగా ఎటువంటి ధర్నాలు గానీ, ఉద్యమాలు గానీ చెయ్యలేదని వెంకటేశ్వర్లు తెలిపారు.

సీఎం జగన్ ఇచ్చిమ హామీలు ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేరలేదు

ఇదే ఫిబ్రవరి 3వ తారీఖున గత ఏడాది చలో విజయవాడ కార్యక్రమం చేపట్టాము. రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాదిమంది ఉద్యోగులు ఉవ్వెత్తున తరలివచ్చి..ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పరిష్కారం కోసం ర్యాలీని నిర్వహించాం. ఆ కార్యక్రమం నేటితో సంవత్సర కాలం పూర్తి చేసుకుంది. ఆ కార్యక్రమం వల్ల గతంలో ఉన్న రాయితీలను పూర్తీగా నిలుపుకోగలిగాము. 11వ పీఆర్సీ తప్ప.. కొత్తగా ఆరోజు ఏమీ సాధించలేకపోయాము.-బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు

గత సంవత్సరం (2022-ఫిబ్రవరి 3న) ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ‘చలో విజయవాడ’ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఆయా జిల్లాల్లో పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్‌లు, గృహ నిర్బంధాలు చేసినప్పటికి వాళ్లను ఛేదించుకుని మరీ విజయవాడ చేరుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజయవాడలో భారీ ప్రదర్శన నిర్వహించి.. ఎన్జీవో భవన్‌ నుంచి అలంకార్‌ థియేటర్‌ కూడలి మీదుగా భారీ ర్యాలీని నిర్వహించి ముందుకు సాగారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఉద్యోగ సంఘల నాయకులతో జరిపి వారి డిమాండ్లను పరిష్కారిస్తామని పలు హామీలిచ్చింది.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.