ETV Bharat / state

Single Major Subject in Degree : డిగ్రీలో సింగిల్ సబ్జెక్ట్.. పేద విద్యార్ధుల అవకాశాలపై ఎఫెక్ట్..!

author img

By

Published : May 30, 2023, 7:25 AM IST

Single Major Subject in Degree : ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీలో తీసుకొస్తున్న సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టు విధానంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల పాలిట శాపంగా మారింది. ఎలాంటి అధ్యయనం లేకుండా ఉన్నత విద్యామండలి హడావుడిగా తీసుకొచ్చిన ఈ విధానం.. పేద విద్యార్థుల అవకాశాలకు గండికొడుతుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Etv Bharat
Etv Bharat

Single Major Subject in Degree : అధ్యాపకుల కొరత సాకుతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టులను తగ్గించేస్తున్నారు. అన్ని సబ్జెక్టుల్లోనూ విద్యార్థులకు అవకాశాలు కల్పించాల్సి ఉన్నా కొన్నింటికే పరిమితం చేస్తుండడంతో కొన్ని సబ్జెక్టులు చదివేందుకు విద్యార్థులు జిల్లాలు దాటి వెళ్లాల్సిన దుస్థితి. సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టును తీసుకొస్తున్న సమయంలో 54 మేజర్‌, 53 మైనర్‌ సబ్జెక్టులతో పాటు ఉపాధి నిచ్చే మరో 45 మైనర్‌ సబ్జెక్టులు కొత్తగా అందుబాటులో ఉంటాయని ఉన్నత విద్యామండలి వెల్లడించింది. కళాశాలల్లో అధ్యాపకులు లేకపోతే ఉన్నత విద్యామండలి ఆన్‌లైన్‌లో పాఠాలు చెబుతుందని చెప్తూ.. ప్రభుత్వ కళాశాలల్లో ఇప్పటికే ఉన్న సబ్జెక్టులను తొలగించేస్తున్నారు.

Prathidwani: హామీలతో ఆశలు కల్పించి.. అధికారంలోకి రాగానే అటకెక్కించి

నిబంధనలకు నీళ్లు.. సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టును ప్రవేశపెట్టాలంటే కనీసం 25 మంది విద్యార్థులు ఉండాలనేది కళాశాల విద్యా కమిషనరేట్‌ నిబంధన. కానీ, విద్యార్థుల ఆసక్తితో సంబంధం లేకుండా ఏ కోర్సులు పెట్టాలో కమిషనరేట్‌ నుంచే నిర్ణయించేస్తున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని ప్రభుత్వ కళాశాలల్లో కొన్ని కోర్సులనే పెడుతూ ఆదేశాలు జారీ చేశారు. అన్ని సబ్జెక్టుల్లోనూ మేజర్‌లను ప్రవేశపెడితే అధ్యాపకుల సంఖ్య పెంచాల్సి ఉండగా.. అధ్యాపకుల సంఖ్యను తగ్గించుకునేందుకు కొన్ని సబ్జెక్టుల్లోనే కోర్సులు ప్రవేశపెడుతున్నారు.

టెస్టోస్టిరాన్ లెవెల్స్​​ తగ్గితే ఇబ్బందా?.. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందా?

విద్యాశాఖ మంత్రి జిల్లాలో.. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన సింగిల్‌ మేజర్ సబ్జెక్ట్ విధానంలో ఒక సబ్జెక్ట్‌ మేజర్‌, మరొకటి మైనర్‌గా చదవొచ్చు. ఉదాహరణకు బీఎస్సీలో గణితం మేజర్‌గా సబ్జెక్టుగా ఎంపిక చేసుకుంటే మైనర్‌ సబ్జెక్టులుగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్‌సైన్సు చదవాలి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత జిల్లా విజయనగరంలో ఆరు ప్రభుత్వ కళాశాలలు ఉండగా.. వీటిల్లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివేందుకు అవకాశం లేకుండా పోయింది. ఈ జిల్లాలోనే ఓ కళాశాలలో గతంలో 8 గ్రూపులు ఉండగా... సింగిల్‌ సబ్జెక్టు విధానంలో ఆర్థిక శాస్త్రం, కామర్స్‌, జంతుశాస్త్రం, రసాయన శాస్త్రాలనే మేజర్‌ సబ్జెక్టులుగా పెట్టారు. ఫలితంగా గణితం, భౌతికశాస్త్రం, కంప్యూటర్‌సైన్సు సబ్జెక్టులను విద్యార్థులకు దూరం చేశారు.

అధ్యాపకుల కొరత.. నూతన విద్యా విధానంలో మూడేళ్ల డిగ్రీ కోర్సులో మేజర్‌ సబ్జెక్టులో 21 పేపర్లు ఉండగా.. సబ్జెక్టుకు నలుగురు అధ్యాపకులు అవసరం. సైన్సు కోర్సుల్లో అధ్యాపకుల సంఖ్య తక్కువగా ఉండడంతో కొన్ని కళాశాలల్లో కోర్సులను తీసేస్తుండగా.. ఉన్న వారినే సర్దుబాటు చేస్తున్నారు. కాగా, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ పోలా భాస్కర్‌ ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి, ఏ కళాశాలలో ఏ కోర్సు పెట్టాలో ఆయనే నిర్ణయించేస్తున్నారు. గతేడాది 57 వేల సీట్లకు గాను 26 వేల అడ్మిషన్లు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టులను తగ్గించేయడంతో విద్యార్థులు ప్రైవేటు కళాశాలలను ఆశ్రయించే అవకాశాలున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 12 ప్రభుత్వ కళాశాలలు ఉంటే రెండింట్లోనే గణితం మేజర్‌ సబ్జెక్టుగా డిగ్రీ ఉంది. ప్రభుత్వ కళాశాలలకు వచ్చే వారిలో ఎక్కువ మంది నిరుపేద విద్యార్థులే. వారికి అన్ని రకాల అవకాశాలను కల్పించాల్సి ఉండగా.. కొన్ని సబ్జెక్టుల్లోనే చదవాలనే ఆంక్షలు ఎలా పెడతారని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఇంటర్‌లో ప్రస్తుతం ఎంపీసీ చదువుతున్న వారే ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో గణితం, భౌతిక శాస్త్రం సబ్జెక్టులు మేజర్‌గా డిగ్రీ లేకపోతే వారందరూ ఎక్కడికి వెళ్తారని నిపుణులు నిలదీస్తున్నారు.

Wife Conduct Her Husband Final Rites: అకస్మాత్తుగా భర్త మృతి.. ఇంట్లోనే దహనం చేసిన భార్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.