ETV Bharat / state

నేతకార్మికులకు ప్రోత్సాహం.. న్యూజిలాండ్​లో "రాజన్న సిరిపట్టు" ఆవిష్కరణ

author img

By

Published : Nov 9, 2022, 2:15 PM IST

Rajanna siripattu brand sarees
Rajanna siripattu brand sarees

Rajanna siripattu brand sarees: అందమైన అంచులు.. ఆకట్టుకొనే రంగులు.. కంటికి నచ్చేలా కొంగులు.. ఇదీ తెలంగాణలో రాజన్న సిరిసిల్లలో తయారైన ప్రత్యేక పట్టుచీరల విశేషాలు. కంటికి ఇంపైన ఈ కొత్తరకం చీరలకు దేశవిదేశాల్లో డిమాండ్ పెరిగింది. రాజన్న సిరిసిల్లలో ఉత్పత్తి అవుతున్న జకార్డు చీరలకు.. 'రాజన్న సిరిపట్టు'గా నామకరణం చేశారు. నేతకార్మికుల ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు.. న్యూజిలాండ్‌లో 'రాజన్న సిరిపట్టు'ను ఆవిష్కరించారు.

నేతకార్మికులకు ప్రోత్సాహం.. న్యూజిలాండ్​లో "రాజన్న సిరిపట్టు" ఆవిష్కరణ

Rajanna siripattu brand sarees: తెలంగాణలో రాజన్న సిరిసిల్లలో ఒకప్పుడు కేవలం కాటన్‌, పాలిస్టర్, ముతక బట్ట మాత్రమే ఉత్పత్తి అవుతుండగా.. ఇప్పుడు పరిస్థితి మారింది. అధునాతన యంత్రాలతో తయారైన కొత్తరకం చీరలను.. దేశవిదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అందమైన కొంగులు, ఆకట్టుకునే అంచు కలిగిన చీరలకు.. రాజన్న సిరిపట్టుగా నామకరణం చేశారు. ఇప్పటివరకు సిరిసిల్ల చీరలకు ఎలాంటి బ్రాండ్ లేదు. జకార్డు యంత్రంపై అగ్గిపెట్టెలో ఇమిడే చీరలు.. దబ్బనంలో దూరే చీరలు రూపొందించిన వెల్ది హరిప్రసాద్‌.. సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు.

ఇక్కడి నేతన్నల ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు న్యూజిలాండ్‌లో రాజన్నసిరిపట్టు చీరలను లాంచ్ చేశారు. నాలుగేళ్ల క్రితం సిరిసిల్లలో బతుకమ్మ చీరలను చూసేందుకు వచ్చిన న్యూజిలాండ్‌ బ్రాండ్‌ తెలంగాణ వ్యవస్థాపకురాలు సునితావిజయ్.. వెల్ది హరిప్రాద్‌ ప్రతిభను గుర్తించి లూమ్స్‌పై పట్టుచీర తయారు చేయించారు. వాటికి మార్కెటింగ్ చేసి ఉపాధి కల్పించారు. ఇక్కడ ఉత్పత్తి అయిన పట్టుచీరలను అమెరికా, న్యూజిలాండ్‌, లండన్‌తోపాటు ఇతర దేశాలకు పంపిస్తున్నారు.

అగ్గిపెట్టేలో ఇమిడే చీరను, ఉంగరంలో దూరే చీరలను తయారు చేయడం చూసిన న్యూజిలాండ్​లో స్థిర పడ్డ సునీత గారు నన్ను గుర్తించి, మనం కంచి, ధర్మవరం వంటి చీరలను సిరిసిల్లలో ఎందుకు ఉత్తత్తి చేయకూడదని నాలుగు సంవత్సరాల నుంచి నన్ను ప్రోత్సహిస్తూ ఈరోజు రాజన్న సిరిపట్టుగా ఈ చీర మీ ముందుకు వచ్చింది. - వెల్ది హరిప్రసాద్‌, జకార్డు చీరల ఉత్పత్తిదారుడు

హరిప్రసాద్‌ కంప్యూటర్ సాయంతో సరికొత్త డిజైన్లతో చీరలను నేస్తున్నారు. ఇందుకు అవసరమైన మెటిరీయల్, యంత్రాలు బెంగళూరు, తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అత్యాధునికి డిజైన్​లతో కూడిన చీరలను నేస్తున్నారు. అన్ని రకాల హంగులు, డిజైన్​లు, నేటి యువత ఇష్టపడే కొత్త,కొత్త డిజైన్​లు చేస్తున్నారు.

సిరిసిల్ల అంటేనే మామూలు మగ్గాలు ఉండేవి. అయితే నేను బెంగళూరు వెళ్లి జకార్డు మెషన్​లు తీసుకువచ్చి సరికొత్త డిజైన్​లు నేస్తున్నాను. అనేక రకాలైన డిజైన్​లు, ఆధునిక యువతకు కావలసిన అన్ని రకాల డిజైన్​లు చేస్తాము. - వెల్ది హరిప్రసాద్‌, జకార్డు చీరల ఉత్పత్తిదారుడు

జకార్డు చీరలను నేయడంతోపాటు హరిప్రసాద్ మరో 40 మందికి శిక్షణ ఇచ్చారు. వీరు 800గ్రాముల బరువుతో 6.30మీటర్ల పొడవుతో జాకెట్‌తో కూడిన చీరలను ఉత్పత్తి చేస్తున్నారు. ఒక్కో చీర ధర 3500రూపాయలు మొదలుకొని 60వేల వరకు ఉంటోంది. నెలకు 15 నుంచి 20 చీరలు ఉత్పత్తి చేస్తుండగా.. ఆర్డర్లు మరింత పెరుగుతున్నాయని కార్మికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నేత కార్మికుల ఆత్మహత్యల నుంచి చీరలను దేశవిదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి సిరిసిల్ల ఎదిగింది. ఇదే తరహాలో ప్రభుత్వం ప్రోత్సహిస్తే జకార్డు చీరలను మరింత విస్తృతం చేస్తామని నేతకార్మికులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.