ETV Bharat / state

'తాజా పీఆర్సీపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు'

author img

By

Published : Feb 28, 2022, 2:05 PM IST

Justice for PRC
Justice for PRC

Letter to CM: పీఆర్సీపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని జస్టిస్ ఫర్ పీఆర్సీ సమితి అన్నారు. ఈ మేరకు సీఎం జగన్​కు బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై చర్చించాలని కోరారు.

Justice for PRC: పీఆర్సీపై ముఖ్యమంత్రి జగన్​కు 'జస్టిస్ ఫర్ పీఆర్సీ సమితి' నాయకులు బహిరంగ లేఖ రాశారు. తాజా పీఆర్సీపై రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సంఘ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. పీఆర్సీపై చర్చించాలని సీఎం కార్యాలయాన్ని కోరామని.. కానీ ఎటువంటి స్పందన లేకపోవడంతోనే బహిరంగ లేఖ రాశామని చెప్పారు.

సమస్యలు పరిష్కరించకపోతే మరో ఉద్యమం చేపట్టాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం జరిపిన చర్చల్లో ఒప్పుకున్న రెండు అంశాలపై జీవోలు ఇవ్వలేదన్నారు. పీఆర్సీ 5 ఏళ్లకు ఇస్తామన్నారు... దానిపై జీవో విడుదల చేయలేదని ప్రస్తావించారు. ఓట్ల కోసం ఎన్నో పథకాలు తీసుకువస్తున్నారని.. తమని కూడా దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ చేయాలని స్పష్టం చేశారు. తమ వెనుక ఏ పార్టీ జెండా లేదన్నారు.

ఇదీ చదవండి

వాహనదారులకు గుడ్ న్యూస్.. ట్రాఫిక్‌ జరిమానాల రాయితీ రేపట్నుంచే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.