ఉద్యోగుల డిమాండ్లను నేరవేర్చకపోతే ఉద్యమానికి సిద్ధం: బండి శ్రీనివాసరావు
Updated on: Jan 24, 2023, 4:23 PM IST

ఉద్యోగుల డిమాండ్లను నేరవేర్చకపోతే ఉద్యమానికి సిద్ధం: బండి శ్రీనివాసరావు
Updated on: Jan 24, 2023, 4:23 PM IST
Bandi Srinivasa Rao: ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏపీఎన్జీఓ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం.. ఉద్యోగులకు రావాల్సిన డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలని, సీపీఎస్ రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోతే ఉద్యమానికి సిద్ధమని ఆయన ప్రకటించారు.
Bandi Srinivasa Rao: ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నేరవేర్చకపోతే ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు.. జగన్ సర్కార్ ను హెచ్చరించారు. తిరుపతిలో వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు ప్రభుత్వం సకాలంలో జీతాలివ్వాలని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుపడాలని శ్రీవారిని కోరుకున్నట్లు చెప్పారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నేరవేర్చి సీఎం జగన్ మాట నిలబెట్టుకోవాలన్నారు. ఉద్యోగులకు రావాల్సిన డీఏ బాకాయిలు వెంటనే చెల్లించాలని, సీపీఎస్ రద్దు చేయాలని బండి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి :
