ETV Bharat / state

AP Financial Condition : ఆందోళనకరంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ.. అప్పు చేసినా జీతాలివ్వలేని పరిస్థితి

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 23, 2023, 7:12 AM IST

Updated : Oct 23, 2023, 11:01 AM IST

ap_financial_condition
ap_financial_condition

AP Financial Condition : వైసీపీ అధికారంలోకొచ్చాక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అత్యంత దారుణ స్థితిలో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలలకు కాగ్ లెక్కలను చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకర స్థితిలో ఉంది. అప్పులు చేసినా సరే.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వలేని దుస్థితిలోకి ప్రభుత్వం కూరుకుపోయింది.

AP Financial Condition : ఆందోళనకరంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ.. అప్పు చేసినా జీతాలివ్వలేని పరిస్థితి

AP Financial Condition : 'నిబంధనలకు లోబడి F.R.B.Mలో 3 శాతం వరకు మాత్రమే రాష్ట్రం అప్పులు తీసుకోవచ్చు. చంద్రబాబు సర్కార్ అంతకుమించి అప్పులు చేసింది... ఇది ప్రభుత్వమా, ప్రైవేటురంగ సంస్థా... పబ్లిక్ డిపాజిట్లను ఇష్టారాజ్యంగా వాడుకునే అధికారం ప్రభుత్వానికి ఎక్కడుంది' అంటూ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్న మాటలివి. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అత్యంత దారుణ స్థితిలో ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి అయిదు నెలలకు కాగ్ వెల్లడించిన లెక్కలను చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకర స్థితిలో ఉంది. అప్పులు చేసినా ఉద్యోగులకు జీతాలివ్వలేని దుస్థితిలోకి ప్రభుత్వం కూరుకుపోయింది.

No Salaries For Teachers : అప్పులు చేస్తూ.. అవస్థలు పడుతూ ! మూడు నెలలుగా వేతనాలు అందక ఉపాధ్యాయుల వెతలు..

నాడు ప్రతిపక్ష నేతలుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పెడబొబ్బలు పెట్టిన జగన్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పట్టాలు తప్పించేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారం అనుభవిస్తూ మరో బాట. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి అయిదు నెలల కాలంలో 37వేల 326.72 కోట్ల రూపాయల మేర రెవెన్యూ లోటు ఏర్పడింది. అంటే రాష్ట్ర రెవెన్యూ రాబడికన్నా ఖర్చులు అంతమేర ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్ర బడ్జెట్ లో ఆర్థిక సంవత్సరం (Financial year) మొత్తమ్మీద 12 నెలల కాలానికి ఎంత రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేశారో.. ఆ మొత్తం ఎప్పుడో దాటిపోయింది.

ఒక రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ చక్కగా సాగాలంటే రెవెన్యూ లోటును వీలైనంతగా నియంత్రించాలి. అభివృద్ధి వ్యయాన్ని సాధ్యమైనంతగా పెంచుకోవాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 22వేల 316.70 కోట్ల మేర రెవెన్యూ లోటు ఉంటుందని మంత్రి లెక్క కట్టారు. అదే ఎక్కువ. అలాంటిది తొలి ఐదు నెలల్లోనే ఏకంగా 7వేల326.72 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు ఏర్పడింది. రాబడి, చేసిన అప్పులన్నీ రెవెన్యూ ఖర్చులకే వినియోగించేస్తున్నారు. ఏడాది మొత్తమ్మీద వంద రూపాయలు రెవెన్యూ లోటుగా అంచనా వేశారనుకుంటే.. ఆగస్టు నెలాఖరుకే.. అంటే ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లోనే ఏకంగా 119 రూపాయలు రెవెన్యూ లోటు ఏర్పడిందని కాగ్ (CAG) గణాంకాలు పేర్కొంటున్నాయి. మిగిలిన ఏడు నెలల్లో ఇది ఎన్ని రెట్లు పెరిగిపోతుందో అంచనా వేయొచ్చు.

Andhra Pradesh Top in Debts: ఐ డోంట్ కేర్ అంటున్న ఏపీ ప్రభుత్వం.. కాగ్‌ హెచ్చరికలు బేఖాతరు చేస్తూ అప్పుల్లో టాప్

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం... ఆగస్టు నెలాఖరువరకు ఆర్థిక పరిస్థితిపై కాగ్ లెక్కలు వెల్లడించింది. తొలి రెండు నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన రెవెన్యూ రాబడి 70వేల 330.55 కోట్ల రూపాయలు. అదే రెవెన్యూ ఖర్చు చూస్తే ఏకంగా లక్ష 7వేల 657.26 కోట్ల రూపాయలుగా ఉంది. ఇతర కార్పొరేషన్ల ద్వారా అప్పులు చేసి రెవెన్యూ (Revenue) ఖర్చులకు వినియోగిస్తున్న మొత్తం కూడా పరిగణనలోకి తీసుకుంటే రెవెన్యూ లోటు తీవ్రత ఇంకా ఎక్కువే. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు సహా ఇతర అవసరాలకు అనేక రూపాల్లో నిధులను సమీకరించి వెచ్చిస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్ నుంచే ఆ అప్పులను తీర్చాల్సి వస్తోంది.

AP Debts Crossing Limits: పరిమితికి మించిన అప్పుల్లో ఆంధ్ర.. అస్తవ్యస్థంగా ఆర్థిక పరిస్థితి.. అయినా తగ్గేదేలే అంటున్న జగన్ సర్కార్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కన్నా అప్పులే ఎక్కువగా ఉన్నాయి. తొలి అయిదు నెలల్లో పన్నుల రూపేణా 48వేల 942.38 కోట్ల రూపాయలు రాగా, అప్పు 53వేల 557 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ అప్పులను ఆస్తుల సృష్టికి కాకుండా రెవెన్యూ ఖర్చుల కోసమే వెచ్చించారని కాగ్ గణాంకాలే పేర్కొంటున్నాయి. కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలను ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోంది. అవి కూడా కలిపితే మొత్తం ద్రవ్యలోటు మరింత పెరిగిపోతుంది.

ప్రతి నెలా 10వ తేదీ వచ్చినా రాష్ట్రంలో పింఛన్లనూ ఇవ్వలేని పరిస్థితి. రిజర్వుబ్యాంకు (Reserve Bank) కల్పించిన ఓవర్ డ్రాఫ్ట్ వెసులుబాటును ఇష్టానుసారం వాడేస్తోంది. ఏటా రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు అంచనాలకు మించిపోతున్నాయి. చేసిన అప్పులన్నీ రెవెన్యూ ఖర్చులకే మళ్లిపోతున్నాయి. ఆస్తులను సృష్టించింది లేనేలేదు. 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి అయిదు నెలలకు సంబంధించిన లెక్కలను చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకర స్థితిలో ఉంది.

Prathidwani: జీతాలు చెల్లించలేని స్థితిలో ఆంధ్రప్రదేశ్.. దేశంలో చర్చనీయాంశంగా రాష్ట్ర అప్పులు

Last Updated :Oct 23, 2023, 11:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.