ETV Bharat / state

రాష్ట్రాన్నిఅరాచకాంధ్రప్రదేశ్‌గా మార్చిన వైసీపీ కార్యకర్తలు, నేతలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 15, 2023, 7:27 AM IST

Updated : Nov 15, 2023, 8:08 AM IST

YSRCP anarchists In Andhra Pradesh: రాష్ట్రంలో వైసీపీ నాయకులు, కార్యకర్తల అధికార అహం రోజురోజుకు పెచ్చుమీరుతోంది. వారి అరాచకాలను అడ్డుకున్న, ప్రతిపక్ష నేతలకు సంఘీభావాలు ప్రకటించిన.. వైసీపీ నాయకులు హద్దులు మీరుతున్నారు. దాడులకు తెగబడుతూ భయనక పరిస్థితులకు కారణం అవుతున్నారు. ఇంత జరుగుతున్న పోలీసులు అసలు పట్టించుకోవడం లేదు. ఏవో చిన్న చితక కేసులు నమోదు చేస్తూ.. చేతులు దులిపేసుకుంటున్నారు.

ysrcp_anarchists_in_andhra_pradesh
ysrcp_anarchists_in_andhra_pradesh

రాష్ట్రాన్నిఅరాచకాంధ్రప్రదేశ్‌గా మార్చిన వైసీపీ కార్యకర్తలు, నేతలు - భయనక పరిస్థితులకు కారణమవుతూ

YSRCP anarchists In Andhra Pradesh: రాష్ట్రంలో దాడులు, దాష్టీకాలు, దౌర్జన్యాలతో వైసీపీ నాయకులు పెట్రేగిపోతున్నారు. అన్యాయాలను ప్రశ్నించినందుకు, అరాచకాలపై ఫిర్యాదు చేసినందుకు.. ఇష్టారీతిన దాడులు చేస్తున్నారు. బాలికలు, వృద్ధులపైన సైతం మూకదాడులతో రెచ్చిపోతున్నారు. అసలే అరాచకశక్తులైన వైసీపీ నేతలకి అధికారం తోడవడంతో.. రాష్ట్రంలో అడ్డూ అదుపూ లేకుండా దాష్టీకాలకు పాల్పడుతున్నారు. నేరచరితుల జోలికి వెళ్లని పోలీసులు బాధితులపైనే తిరిగి కేసులు పెడుతున్నారు.

భూ ఆక్రమణలపై ఫిర్యాదు చేసినందుకు దళిత న్యాయవాదిపై అతనిపై వైసీపీ నేతలు దాడికి తెగబడతారు. కళాశాలలో ఎప్పుడో జరిగిన ఓ చిన్నపాటి గొడవను మనసులో పెట్టుకుని ఓ దళిత యువకుడ్ని కారులో తిప్పుతూ చిత్రహింసలకు గురిచేస్తారు. మంచినీళ్లు అడిగితే మూత్రం పోసి అమానుషంగా ప్రవర్తిస్తారు. చంద్రబాబుకు మద్దతుగా పాదయాత్ర చేస్తున్న 70 ఏళ్ల వృద్ధుడ్ని సైతం వదలకుండా అధికార దర్పంతో దాష్టీకానికి పాల్పడతారు.

రోజురోజుకూ పెరుగుతున్న ఆంధ్రప్రదేశ్ అప్పుల చిట్టా!

దాడులతో చెలరేగిపోతున్నారు: శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ సైకిల్‌ యాత్ర చేస్తున్న టీడీపీ అభిమానులపై దౌర్జన్యానికి తెగబడతారు. దాడులు, దౌర్జన్యాలు, దాష్టీకాలతో చెలరేగిపోతోంది. మొన్నటికి మొన్న కంచికచర్లలో దళిత యువకుడిపై జరిగిన అమానుష ఘటన మరవక ముందే.. తాజాగా కొలిమిగుండ్లలో దళిత న్యాయవాదిపై వైసీపీ నేతలు చేసిన దాడి.. రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా కొనసాగుతున్న వైసీపీ ప్రాయోజిత అరాచకాన్ని మరోమారు కళ్లకు కట్టింది.

రాష్ట్రంలో భయానక పరిస్థితులు: బీహార్, ఉత్తరప్రదేశ్‌ లాంటి రాష్ట్రాల్లో ఒకప్పుడు ఉన్న పరిస్థితులు.. ఇప్పుడు జగన్‌ పాలనలో ఏపీలో నిత్యకృత్యమైపోయాయి. అధికార పార్టీ నాయకుల అరాచకాల్ని చూస్తూ.. తాము మాత్రం ఏం తక్కువ అన్నట్లుగా అసాంఘిక శక్తులు, రౌడీమూకలు మరింత రెచ్చిపోతున్నాయి. రోడ్డుకు అడ్డంగా పెట్టిన ద్విచక్రవాహనాన్ని తీయాలంటూ హారన్‌ మోగించినందుకు నెల్లూరు జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్‌ను బస్సు నుంచి కిందికి దింపి అందరూ చూస్తుండగా విచక్షణరహితంగా దాడి చేయటం రాష్ట్రంలో నెలకొన్న భయానక పరిస్థితులకు అద్దం పడుతోంది. వీటిని ఉక్కుపాదంతో అణిచేయాల్సిన పోలీసులే అధికార పార్టీ నాయకుల అరాచకాలకు వత్తాసు పలుకుతుండటంతో రాష్ట్రం ‘‘అరాచకాంధ్రప్రదేశ్‌ ’’ గా మారిపోయింది.

ఆ ఆరోపణలపై - బీటెక్‌ రవికి 14 రోజులు రిమాండ్‌

దాడులను ముఖ్యమంత్రి ఎందుకు ఖండిచలేదు : వైసీపీ నాయకులు దాడులు, దౌర్జన్యాలు, దాష్టీకాలతో రెచ్చిపోతుంటే ముఖ్యమంత్రి జగన్‌ ఒక్క రోజు కూడా వాటిని ఖండించలేదు. ‘‘నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ పదే పదే వల్లెవేసే ఆయన.. తన పార్టీ నాయకులే దళితులు, గిరిజనులపై దాడులకు తెగబడుతుంటే కనీసం వాటిపై స్పందించలేదు. ఏనాడూ సమీక్షించనే లేదు.

సంఘీభావం ప్రకటిస్తే దాడులా : టీడీపీ అధినేత చంద్రబాబుకు సంఘీభావంగా శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సైకిల్‌ యాత్ర చేపట్టిన టీడీపీ కార్యకర్తలపై పుంగనూరులో దాష్ఠీకానికి పాల్పడ్డ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు, వైసీపీ నాయకుడు చెంగలాపురం సూరి అలియాస్‌ సురతోటి సురేష్‌పై 2013లో రౌడీషీట్‌ తెరిచారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అధికార పార్టీ నేతల సిఫార్సులు, ఒత్తిళ్లతో అతనిపై ఉన్న రౌడీషీట్‌ను గతేడాది డిసెంబర్‌లో పోలీసులు ఎత్తేశారు. ఆ తర్వాత నుంచి అతని దాష్టీకాలు మరింత పెరిగిపోయాయి.

సామాజిక మాధ్యమాల్లో రాజకీయ నేతలపై అవమానకరమైన పోస్టులు - వ్యక్తి అరెస్ట్

నీచంగా 70 ఏళ్ల వృద్ధుడిపై దాడి : చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ, నారా భువనేశ్వరిని కలిసి సంఘీభావం తెలిపేందుకు 70 ఏళ్ల వృద్ధుడు చింతల నారాయణ అనే వృద్ధుడు నంద్యాల జిల్లా చినదేవళాపురం నుంచి రాజమహేంద్రవరానికి పాదయాత్రగా బయల్దేరాడు. యాత్ర వినుకొండ సమీపానికి రాగానే నలుగురు యువకులు దాడి చేసి, పళ్లు ఊడిపోయేలా ముఖంపై బలంగా కొడితే పోలీసులు కనీసం దానిపై ఇప్పటివరకూ కేసు కూడా నమోదు చేయలేదు.

బాధితులపైనే రివర్స్​ కేసులు : అధికార పార్టీ నాయకులు దాడులకు, దాష్టీకాలకు పాల్పడినా సరే పోలీసులు వారికే వత్తాసు పలకుతున్నారు. ఆ దాడులకు రాజకీయ పార్టీలతో ఎలాంటి సంబంధం లేదంటూ ప్రకటనలిచ్చి తిరిగి బాధితులపైనే రివర్స్‌ కేసులు పెడుతున్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో దళిత న్యాయవాది మంద విజయ్‌కుమార్‌పై వైసీపీ నాయకులు దాడి చేయగా.. దాడి చేసిన వారి ఫిర్యాదు ఆధారంగా తిరిగి బాధితుడిపైనే కేసు పెట్టారు.

రాజకీయంగా ఎదుర్కోలేేకే చంద్రబాబుపై అక్రమ కేసులు - ఎడిసన్ నగరంలో ప్రవాసాంధ్రులు

కేసులు తప్ప చర్యలేవి : భూ ఆక్రమణలపై విజయ్‌కుమార్‌ ఫిర్యాదు చేయటమే తప్పు అనే భావన కలిగేలా ప్రకటన ఇచ్చారు. వైసీపీ నాయకులు దాడులకు పాల్పడినప్పుడు మరీ తప్పనిసరి పరిస్థితుల్లో కేసులు నమోదు చేసినా వారిని అరెస్టు చేయటం, తదుపరి చర్యలు తీసుకోవటం వంటివేవి చేయట్లేదు. దీంతో బాధితులు నిస్సహాయులుగా మారుతున్నారు.

పాతనేరగాళ్లపై నిఘాలేందుకు లేవు : నెల్లూరులో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడికి పాల్పడిన వారంతా పాతనేరగాళ్లే. ప్రతి ఒక్కరిపైనా చాలా కేసులున్నాయి. అలాంటి వారిని ఇంత కాలం ఎందుకు ఉపేక్షించారు. నిఘా ఎందుకు పెట్టలేదో పోలీసులే చెప్పాలి. ముఖ్యమంత్రి జగన్‌ ఏడాది కిందట అవనిగడ్డ బహిరంగ సభలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ కృష్ణాజిల్లా అవనిగడ్డలో టీడీపీ, జనసేన నేతలు ధర్నా చేపట్టారు. వారిపై వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్​ బాబు తన పార్టీ నాయకులు, కార్యకర్తలను వెంటేసుకుని వెళ్లి మరి కర్రలతో దాడి చేశారు.

ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకు కరవు విలయతాండవం: ఎంపీ రామ్మోహన్‌ నాయుడు

తవ్వకాలను అడ్డుకుంటే దాడులా : ఇసుక తవ్వకాలను అడ్డుకున్నందుకు వైఎస్‌ఆర్‌ జిల్లా ఎర్రగుంట్ల మండలం ఇల్లూరు గ్రామానికి చెందిన జ్యోతిపై అధికార పార్టీ నేతలు దాడికి పాల్పడ్డారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే వెంకటేగౌడను ప్రశ్నించినందుకు.. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం లక్కనపల్లెలో జనసేన కార్యదర్శి మధుపై దాడికి పాల్పడ్డారు.

దారుణంగా కొట్టిన దిక్కేది : కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కె.కొత్తపాలెం గ్రామానికి చెందిన వైసీపీ నేత రాజబాబు ఓ గిరిజన బాలిక, ఆమె బంధువులను దారుణంగా కొట్టారు. తన ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ చిత్రహింసలకు గురిచేయటమే కాకుండా పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చి అప్పగించారు. దీంతో వారు ముగ్గురు నడవలేనంతగా ఓ మహిళా ఎస్సై వారిని కొట్టారు.

భద్రతను గాలికొదిలేసిన పోలీసులు: ప్రతిపక్షాలను అణిచివేయటం, అక్రమ కేసులతో ఇబ్బందులు పెట్టటం, అధికార పార్టీ నాయకుల సేవలో తరిస్తూ వారి చెప్పిన పనులు చేయటానికి పరిమితమవుతున్న పోలీసులు గస్తీని గాలికొదిలేశారు. రౌడీషీట్లు, హిస్టరీషీట్లు కలిగిన, నేరచరిత్ర ఉన్న వారి కదలికలు, కార్యకలాపాలపై నిఘా ఉండట్లేదు. అరాచకశక్తుల గురించి పటత్టించుకోవట్లేదు. వాటి ఫలితం రాష్ట్రంలో దారుణాలు పెచ్చురిల్లుపోతున్నాయి. పోలీసులు అంటే భయం లేకుండా పోవటంతో గంజాయి గ్యాంగులు, బ్లేడ్‌బ్యాచ్‌లు, రౌడీలు, నేరగాళ్లు చెలరేగిపోతున్నారు.

జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీలో భారీ కుంభకోణం: జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

Last Updated : Nov 15, 2023, 8:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.