సామాజిక మాధ్యమాల్లో రాజకీయ నేతలపై అవమానకరమైన పోస్టులు - వ్యక్తి అరెస్ట్
Police Arrested Man Objectionable Posts in Social Media: సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత పోస్టులు పెడుతున్నారనే ఫిర్యాదుపై అన్నమయ్య జిల్లా పుల్లంపేటకు చెందిన చింత సుదర్శన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ కృష్ణారావు తెలిపారు. నకిలీ మెయిల్ ఐడీల ద్వారా చింతల హరి పేరుతో పేస్‌బుక్ పేజీని సృష్టించి కమ్యూనిటీ ప్రమాణాలను ఉల్లంఘించారన్నారు. నకిలీ ఖాతాలతో రాజకీయ నేతలపై అవమానకర రీతిలో పోస్టులు పెడుతున్నట్లు గుర్తించామని ఎస్పీ తెలిపారు. సుదర్శన్ గత ఆరు నెలల నుంచి సామాజిక మాధ్యమాలలో యాక్టివ్‌గా ఉంటున్నాడని తెలిపారు. ఓ పార్టీకి చెందిన వ్యక్తులకు వ్యతిరేకంగా రోజూ పోస్టులు పెడుతున్నట్లు ఎస్పీ వెల్లడించారు. రోజుకు 100 నుంచి 125 వరకు పోస్ట్‌లను ఫార్వార్డ్ చేస్తున్నాడని ఎస్పీ పేర్కొన్నారు.
బీఫార్మసీ పట్టభద్రుడైన సుదర్శన్‌కు నెలకు రూ. 8000 వేలు ఇస్తూ కొందరు టీడీపీకి చెందిన వాట్సప్ గ్రూపులలో అవమానకరమైన కంటెంట్‌ను పంచుకునేలా ప్లాన్ చేశారన్నారని ఎస్పీ కృష్ణారావు ఆరోపించారు. సుధా, చింత సుదర్శన్, చింత సుకన్య, గంట అస్మితారెడ్డి, మౌనిక రెడ్డి, నికిత రెడ్డిల... పేరిట నకిలీ ప్రొఫైల్స్ ఖాతాలను సృష్టించినట్లు ఎస్పీ తెలిపారు. రాజకీయ నేతలపై అవమానకరమైన పోస్ట్‌లు చేశాడని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నిబంధనలు ఉల్లంఘించి సామాజిక మధ్యమాలలో పోస్టులు పెడుతున్న నేపథ్యంలో సుదర్శన్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు.