రాజకీయంగా ఎదుర్కోలేేకే చంద్రబాబుపై అక్రమ కేసులు - ఎడిసన్ నగరంలో ప్రవాసాంధ్రులు
Memu saitham babu kosam in America : "మేము సైతం బాబు కోసం“ అంటూ అమెరికా న్యూ జెర్సీలోని ఎడిసన్ నగరంలో ప్రవాసాంధ్రులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం నేత మన్నవ మోహనకృష్ణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడ్ని రాజకీయంగా ఎదుర్కొలేేకే అధికాాార పార్టీ వారిపై అక్రమ కేసులు పెట్టారని మన్నవ మోహనకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టు అక్రమం కాబట్టే ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు చేశారని వివరించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తెలుగుదేశం, జనసేన కూటమికి ప్రవాసాంధ్రులు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు.
Chandrababu Naidu Fans in America : తెలుగుదేశం, జనసేన పార్టీల అనుచరులు ఎడిసన్ నగరంలో పెద్దఎత్తున కార్యక్రమం నిర్వహించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. చంద్రబాబు అరెస్టు అయిన తర్వాత నుంచి ఆయన అభిమానులు వివిధ రకాల మీటింగ్లు, సమావేశాలు నిర్వహిస్తూ బాబుకు మద్ధతు తెలితూనే ఉన్నారు. దేశ విదేశాల్లో మేము సైతం బాబు కోసం అని వారి అభిమానాన్ని చాటుకుంటున్నారు.