ETV Bharat / state

మూడు ముక్కలాటతో ప్రజారాజధాని నాశనం - జగన్ విధ్వంసం ఆరంభించి నాలుగేళ్లు: లోకేశ్

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 17, 2023, 1:02 PM IST

Nara_Lokesh_Tweet_On_Supporting_Capital_Amaravati
Nara_Lokesh_Tweet_On_Supporting_Capital_Amaravati

Nara Lokesh Tweet on Supporting Capital Amaravati: మూడు ముక్కలాటతో ప్రజారాజధాని అమరావతిని నాశనం చేసి జగన్ ఆరంభించిన విధ్వంసానికి నాలుగేళ్లు పూర్తయిందని నారా లోకేశ్ మండిపడ్డారు. వేల కోట్ల రూపాయల విలువైన భవనాలు శిథిలం చేశారని, భూములు ఇచ్చిన రైతులను హింస పెట్టారని ధ్వజమెత్తారు. అమరావతి రైతుల ఉద్యమానికి నేటితో నాలుగేళ్లు పూర్తైంది. ఈ నేపథ్యంలో పలువురు నేతలు తమ మద్దతును తెలుపుతున్నారు. అధికార వైసీపీపై విమర్శలు చేస్తున్నారు.

Nara Lokesh Tweet on Supporting Capital Amaravati: రాజధానిగా అమరావతే కొనసాగించాలని రైతులు చేస్తున్న ఉద్యమానికి నేటితో నాలుగేళ్లు పూర్తైంది. రాజధాని రైతులు, మహిళల ఉద్యమం 1461వ రోజుకు చేరింది. తుళ్లూరు సభలో అమరావతి కోసం రాజధాని రైతుల సర్వమత ప్రార్థనలు చేస్తున్నారు. తుళ్లూరులో జెండా వందనం కార్యక్రమం నిర్వహంచి, ఉద్యమ అమరవీరులకు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా అమరావతి రైతులకు పలువురు నేతలు, ప్రజాసంఘాలు మద్దతు తెలుపుతున్నారు. మూడు ముక్కలాటతో ప్రజా రాజధాని అమరావతిని నాశనం చేయాలని కంకణం కట్టుకున్న సైకో జగన్, విధ్వంసం ఆరంభించి నాలుగేళ్లైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. వేల కోట్ల విలువైన భవనాలు శిథిలం చేశాడని, భూములు ఇచ్చిన రైతుల్ని హింస పెట్టాడని మండిపడ్డారు.

రోడ్లు, మౌలిక సదుపాయాలు ధ్వంసం చేయించాడని దుయ్యబట్టారు. ఇన్ని చేసినా ప్రజా రాజధాని అమరావతిని ఇంచు కూడా కదపలేకపోయాడన్నారు. సైకో జగన్ అరాచక పాలన మూడు నెలల్లో ముగిసిపోతుందన్నారు. రైతుల త్యాగాల పునాదులపై వెలిసిన ప్రజా రాజధాని అమరావతి అజరామరమై నిలుస్తుందని లోకేశ్ అన్నారు. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అంటూ సోషల్ మీడియా వేదికగా అమరావతి రైతుల ఉద్యమానికి తన మద్దతు తెలిపారు.

  • మూడు ముక్కలాటతో ప్రజా రాజధాని అమరావతిని నాశనం చేయాలని కంకణం కట్టుకున్న సైకో జగన్ విధ్వంసం ఆరంభించి నాలుగేళ్లు. వేల కోట్ల విలువైన భవనాలు శిథిలం చేశాడు. భూములు ఇచ్చిన రైతుల్ని హింస పెట్టాడు. రోడ్లు, మౌలిక సదుపాయాలు ధ్వంసం చేయించాడు. ఇన్ని చేసినా ప్రజారాజధాని అమరావతిని ఇంచు కూడా…

    — Lokesh Nara (@naralokesh) December 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

నమ్మకద్రోహానికి నాలుగేళ్లు - రాష్ట్ర అభివృద్ధిని తలకిందులు చేసిన నిర్ణయం

TDP Prathipati Pulla Rao Fires on CM Jagan: ప్రజా రాజధాని అమరావతికి వైసీపీ గ్రహణం పట్టి నాలుగేళ్లు పూర్తైందని మాజీమంత్రి ప్రతిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. అమరావతి అంతమే పంతంగా సైకో జగన్ కుతంత్రాల మూడు ముక్కలాటకి నాలుగేళ్లయ్యిందని మండిపడ్డారు. ప్రజల త్యాగాలకి తోడు, దైవసంకల్పంతో ఏర్పడిన అమరావతిని జగనాసురుడు మరో జన్మ ఎత్తినా ఏం చేయలేడని అన్నారు. జగన్ నయవంచనకు సాక్ష్యం ‌అమరావతి నాలుగేళ్ల ఉద్యమం అని తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే చీకటిదినంగా 2019 డిసెంబర్ 17 అని ప్రత్తిపాటి అన్నారు.

రైతుల త్యాగాల్ని స్వార్థరాజకీయాలకు బలిపెట్టిన దుర్మార్గుడు జగన్ అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలే ముందుండి నడిపిస్తున్న మహా ఉద్యమం అమరావతి పోరాటం అని కొనియాడారు. అమరావతిపై కక్షసాధింపు కోసమే జగన్‌ మూడు రాజధానుల పాట పాడుతున్నారని, 3 ప్రాంతాలపై ప్రేమ ఉంటే జగన్ నాలుగేళ్లలో ఎవరికేం అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు.

  • ప్రజా రాజధాని అమరావతి అంతమే పంతంగా సైకో జగన్ కుతంత్రాల మూడు ముక్కలాటకి నాలుగేళ్లయ్యింది. ప్రజల త్యాగాలకి తోడు, దైవసంకల్పంతో ఏర్పడిన ప్రజారాజధాని అమరావతిని జగనాసురుడు మరో జన్మ ఎత్తినా ఏం చేయలేడు.#4YearsOfAmaravatiMovement #WhyAPHatesJagan #Amaravathi #AndhraPradeshpic.twitter.com/GQk06sxnO3

    — Prathipati PullaRao (@PullaRaoP_TDP) December 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

విద్వేషాలు రెచ్చగొట్టి అధికారాన్ని కాపాడుకోవాలన్నదే జగన్ కుట్ర అని పేర్కొన్నారు. మరో మూడు నెలల్లో అమరావతి రైతుల పోరాటానికి న్యాయం జరుగుతుందని, టీడీపీ - జనసేన ప్రభుత్వం రాకతోనే అమరావతికి పునర్వైభవం వస్తుందని ప్రత్తిపాటి తెలిపారు. అన్ని ప్రాంతాల్ని సమానంగా అభివృద్ధి చేయాలన్నదే చంద్రబాబు విజన్ అని పేర్కొన్న ప్రత్తిపాటి, ఏపీ సమగ్రాభివృద్ధి కోసం చంద్రబాబు ఇప్పటికే ప్రణాళికలు ప్రకటించారని గుర్తుచేశారు.

రాజధాని రైతులపై ప్రభుత్వం ప్రతీకార చర్యలు - నాలుగేళ్లలో 3 వేల మందిపై కేసులు

Four Years Completed for Amaravati Farmers Protests: కాగా అమరావతి రైతుల ఉద్యమానికి నేటితో నాలుగేళ్లు పూర్తింది. 2019లో ఇదే రోజున అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేశారు. ప్రభుత్వ ప్రకటనను నిరసిస్తూ అమరావతి రైతులు, మహిళలు ఉద్యమ బాట పట్టారు. రాజధాని 29 గ్రామాల్లో దీక్షా శిబిరాలు వెలశాయి. నాలుగేళ్లుగా రాజధాని గ్రామాల్లో రైతుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రోజూ దీక్షా శిబిరాలకు వచ్చి రాజధాని గ్రామాల రైతులు, మహిళల నిరసన తెలుపుతున్నారు.

నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా నేడు రాజధాని రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ దున్నపోతుకు వినతిపత్రం సమర్పించారు. జెండా వందనం కార్యక్రమం నిర్వహించి, ఉద్యమ అమరవీరులకు నివాళులు అర్పించి, సర్వమత ప్రార్థనలు చేస్తున్నారు.

అమరావతి అభివృద్ధి చేయలేని జగన్​ ఉత్తరాంధ్రకు ఏం చేస్తాడు ?: రాజధాని రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.