ETV Bharat / state

Minister Botsa Satyanarayana on Skill Development Case: "స్కిల్ కేసు మొదలైంది ఈడీ, జీఎస్‌టీ నుంచే.. అధికారుల అరెస్టులూ ఉంటాయి"

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 23, 2023, 2:13 PM IST

Updated : Sep 23, 2023, 4:02 PM IST

Minister Botsa Satyanarayana on Skill Development Case
Minister Botsa Satyanarayana on Skill Development Case

Minister Botsa Satyanarayana on Skill Development Case: స్కిల్ డెవలప్​మెంట్ కేసులో చంద్రబాబుదే అంతిమ నిర్ణయం కనుకే కేసు పెట్టామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. స్కిల్ సెంటర్లలో 58 కోట్ల రూపాయల విలువైన సాఫ్ట్​వేర్ తప్ప ఏమీ లేదని అన్నారు. అసలు స్కిల్ కేసు మొదలైంది ఈడీ, జీఎస్​టీ నుంచే అని తెలిపిన బొత్స.. ఇందులో పాత్ర ఉన్నవారి అరెస్టులు ఉంటాయని పేర్కొన్నారు.

Minister Botsa Satyanarayana on Skill Development Case: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో.. సీమెన్స్ రాసిన లేఖను ప్రభుత్వం చూపిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలో సీమెన్స్ ఏర్పాటు చేసిన స్కిల్ కేంద్రాలు లేవు, శిక్షణ పొందిన విద్యార్థులూ లేరన్నారు. ప్రేమ చంద్రారెడ్డి తప్పు చేసినా చంద్రబాబు తప్పు చేసినా ఒక్కటేనని బొత్స వ్యాఖ్యానించారు. ఈ కేసులో చంద్రబాబుదే అంతిమ నిర్ణయం కాబట్టే కేసు పెట్టామని తెలిపారు.

స్కిల్ కేంద్రాలు లేవు, శిక్షణ పొందిన విద్యార్థులూ లేరు: రాష్ట్రంలో సీమెన్స్ ఏర్పాటు చేసిన స్కిల్ కేంద్రాలు లేవు, ఎక్కడా శిక్షణ పొందిన విద్యార్థులూ లేరని అన్నారు. అధికారులపై చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని అన్నారు. ప్రేమ చంద్రారెడ్డి తప్పు చేసినా చంద్రబాబు తప్పు చేసినా ఒక్కటేనని బొత్స వ్యాఖ్యానించారు. బిజినెస్ రూల్స్ ప్రకారం ఎవరైనా బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. కేబినేట్​లో నిర్ణయం తీసుకుంటే మంత్రుల అందరిదీ బాధ్యత ఎలా అవుతుందని నిలదీశారు.

AP High Court Dismissed Chandrababu Quash Petition: దర్యాప్తునకు ముందస్తు అనుమతి అవసరం లేదు.. చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ కొట్టివేత

దోపిడీ గురించి మాత్రమే విచారణ జరుగుతోంది: ఈ కేసులో చంద్రబాబుదే అంతిమ నిర్ణయం కాబట్టే కేసు పెట్టామని తెలిపారు. తమ ప్రభుత్వం స్కిల్ సెంటర్​లకు ఎలాంటి ప్రశంసా లేఖలను ఇవ్వలేదని బొత్స సత్యనారాయణ తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు వద్దు అని తమ ప్రభుత్వం చెప్పలేదని అన్నారు. అందులో జరిగిన దోపిడీ గురించి మాత్రమే విచారణ జరుగుతోందని తెలిపారు.

అధికారుల అరెస్టులూ ఉంటాయి: స్కిల్ డెవలప్​మెంట్ సెంటర్​లకు 58 కోట్ల విలువైన సాప్ట్ వేర్ తప్ప ఎమీ లేదని అన్నారు. అరెస్టు తీరు బాగోలేదు అనడానికి ఆయనను ఏమీ ఈడ్చుకొని వెళ్లలేదని వ్యాఖ్యానించారు. పగటి పూట అరెస్టు చేస్తే శాంతి భద్రతల సమస్య వస్తుందని రాత్రి పూట వెళ్లి తలుపు తట్టారన్నారు. అసలు కేసు మొదలైంది ఈడీ, జీఎస్టీ నుంచి అని పేర్కొన్న బొత్స.. ఆ తరవాతే ఏపీ ప్రభుత్వం కేసు పెట్టిందని తెలిపారు. స్కిల్ డెవలప్​మెంట్ వ్యవహారంలో ఎవరి ప్రమేయం ఉన్నా వారి అరెస్టులు ఉంటాయని బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
Chandrababu Expressed his Anguish Before Judge: "ఏ తప్పు చేయకపోయినా అరెస్టు చేశారు.. జైల్లో ఉంచి మానసిక క్షోభకు గురిచేస్తున్నారు"

"మేము చూపించింది సీమెన్స్ వాళ్లు ఇచ్చిన లెటరే చూపించాము. 58 కోట్లకు సంబంధించిన సాఫ్ట్​వేర్ మాత్రమే ఇచ్చారు తప్ప వేరేది అంకేమీ ఇవ్వలేదు. అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్​ అయి ఉంటే.. వారిని కూడా అరెస్టు చేస్తాం. ముఖ్యమంత్రి ఇమ్మని అన్నారు.. కాబట్టే వారు ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఎవరికి కూడా ప్రశంసా పత్రాలు ఇవ్వలేదు". - బొత్స సత్యనారాయణ, మంత్రి

Minister Botsa Satyanarayana Comments on GPS: జీపీఎస్ (Guaranteed Pension Scheme) అందరికీ ఆమోదయోగ్యం అని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సీపీఎస్, ఓపీఎస్ అనేది ఇక ముగిసిపోయిన అంశమన్నారు. భవిష్యత్ తరాలపై భారం పడకూడదనే జీపీఎస్ తీసుకువచ్చామని స్పష్టం చేశారు. బీజేపీ అధ్యక్షురాలుగా నియమితులు అయినట్టు ప్రజలకు తెలియజేసేందుకే పురందరేశ్వరి మద్యం అంశాలపై మాట్లాడి ఉండొచ్చని తెలిపారు.

Siemens Industry Software India MD Matthew Thomas: 'స్వయంగా సీమెన్స్‌ ఎండీ వివరించినా.. వైసీపీ నేతలకు కనిపించవు.. అవినీతి నిందలకు మాత్రం పోటీ'

Last Updated :Sep 23, 2023, 4:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.