ETV Bharat / state

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 7 PM

author img

By

Published : Oct 20, 2022, 7:28 PM IST

AP TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు

..

  • బ్రిటన్ ప్రధాని రాజీనామా- పదవి చేపట్టిన 45 రోజులకే..
    బ్రిటన్ ప్రధానమంత్రి లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. ఆమె ఇటీవల తీసుకున్న నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమైన నేపథ్యంలో పదవి నుంచి తప్పుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • జగన్​ పాలనలో చిన్నపిల్లలు సైతం నిరసన బాట: చంద్రబాబు
    CBN REACTS ON CHILDRENS PROTEST : రాష్ట్రంలో చిన్నపిల్లలు కూడా నిరసనలు చేపట్టే పరిస్థితిని ఈ ముఖ్యమంత్రి తీసుకొచ్చారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. నర్సీపట్నంలో వంతెన అప్రోచ్​ కోసం చిన్నపిల్లలు చేపట్టిన నిరసనలపై స్పందించిన బాబు.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పాదయాత్రలో తెదేపా నేతకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
    Nallamilli Ramakrishna Reddy: అమరావతి రైతుల పాదయాత్రలో తెదేపా నేత నల్లమిల్లి రామకృష్టారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. అనుచరులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • నెల్లూరులో దారుణం.. యువతిపై యువకుడు కత్తితో దాడి
    నెల్లూరులో దారుణం జరిగింది. జిల్లాలోని రాజుపాలెం వద్ద యువతిపై ఓ యువకుడు విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో యువతికి తీవ్రగాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రెచ్చిపోయిన వైకాపా శ్రేణులు.. ఇసుక, ల్యాండ్ అక్రమాల వీడియో తీశారని
    ఆ ప్రాంతంలో ఇసుకు అక్రమ రవణా, భూముల కబ్జా జరుగుతోంది. అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. జియావుల్లా అనే యూవకుడు ఇదే అంశంపై యూట్యూబ్​లో కథనాలు ప్రసారం చేశాడు. అధికారులు తనిఖీలు చేస్తున సమయంలో అక్కడికి వెళ్లిన జియావుల్లాపై దాడికి దిగారు వైకాపా నాయకులు.. అక్రమాలపై వీడియోలు చేసినందుకే వైకాపా నేతలు తనపై దాడి చేశారని జియావుల్లా ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మ్యాచ్​ చూసేందుకు మహిళ సాహసం.. జీప్​లో కేరళ నుంచి ఖతర్​కు సోలో ట్రిప్​
    కేరళకు చెందిన ఓ మహిళ వినూత్న సాహసయాత్రకు శ్రీకారం చుట్టారు. సాకర్​ ప్రపంచకప్​ మ్యాచ్ చూసేందుకు కన్నూర్​ నుంచి ఖతర్ వరకు మహేంద్ర జీపులో ఒంటరిగా పయనమయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • నిర్దోషినంటూ 26 ఏళ్లుగా పోరాటం.. తీర్పు రాగానే ఆనందంతో గుండెపోటు.. కోర్టులోనే మృతి
    26 ఏళ్లుగా నిర్దోషినంటూ పోరాటం చేస్తున్న వ్యక్తి.. నిర్దోషిగా ప్రకటించగానే ఆనందం తట్టుకోలేక మరణించాడు. ఈ విషాద ఘటన బిహార్​లోని బాంకాలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రోల్స్ రాయిస్ లగ్జరీ ఎలక్ట్రిక్ కారు ధర తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం
    ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ మొట్టమొదటిసారిగా ఎలక్ట్రిక్ లగ్జరీ కారును ఆవిష్కరించింది. ఇంగ్లాండ్​కు చెందిన ఈ సంస్థ స్పెక్టర్​ అనే పేరుతో రూపొందిస్తున్న కొత్త కారు చిత్రాలను విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వన్డే ప్రపంచకప్​పై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు.. పాక్​కు రీకౌంటర్​
    2023 వన్డే ప్రపంచకప్‌, ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ విషయంలో పీసీబీ చేసిన వ్యాఖ్యలపై​ తాజాగా కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ స్పందించారు. ఏమన్నారంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • దీపావళి తారా జువ్వలు వీరే బాక్సాఫీస్​ ముందు హిట్​సౌండ్​తో పేలేదెవ్వరో
    తెలుగునాట పండగంటే సినిమా సినిమా అంటే పండగే. పండగొస్తుందంటే చూడాల్సిన కొత్త సినిమాల జాబితా కూడా సిద్ధమైపోతుంది. సాధారణంగానే వరుస పండగలు సెలవులతో ప్రతి వారం కొత్త సినిమాలు వెండితెరపై సందడి చేస్తుంటాయి. అయితే ముఖ్యంగా సంక్రాంతి సమ్మర్ దసరా దీపావళికైతే ఇక చెప్పనక్కర్లేదు. అదిరిపోయే సరికొత్త చిత్రాల సందడి చేస్తూ బాక్సాఫీస్​ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ ఉంటాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.