ETV Bharat / state

జగన్​ పాలనలో చిన్నపిల్లలు సైతం నిరసన బాట: చంద్రబాబు

author img

By

Published : Oct 20, 2022, 6:08 PM IST

CBN REACTS ON CHILDRENS PROTEST : రాష్ట్రంలో చిన్నపిల్లలు కూడా నిరసనలు చేపట్టే పరిస్థితిని ఈ ముఖ్యమంత్రి తీసుకొచ్చారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. నర్సీపట్నంలో వంతెన అప్రోచ్​ కోసం చిన్నపిల్లలు చేపట్టిన నిరసనలపై స్పందించిన బాబు.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

CBN FIRES ON CM JAGAN
CBN FIRES ON CM JAGAN

CBN FIRES ON CM JAGAN : చిన్నపిల్లలు సైతం వంతెన అప్రోచ్ రోడ్డు కోసం నిరసనల బాట పట్టే స్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ ముఖ్యమంత్రికి ఎలా చెబితే అర్థం అవుతుందో తెలియడం లేదన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వరాహనదిపై వంతెనను తెదేపా నిర్మించిందన్న చంద్రబాబు.. వైకాపా ప్రభుత్వం వచ్చాక పెండింగ్​లో ఉన్న ఆ అప్రోచ్ రోడ్డు పనులు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. దీంతో మోడల్ ​స్కూల్​కు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లలో దిగి తమ కష్టం తీర్చాలని వేడుకుంటున్నారన్నారు.

ఈ ముఖ్యమంత్రి తన పాలనలో కొత్తగా ఏమీ కట్టలేదన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసన్న బాబు.. కనీసం రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్​లో ఉన్న నిర్మాణాలను పూర్తి చేసినా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ప్రజా సమస్యలపై జగన్ రెడ్డికి ఈగో తగదని.. సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

  • నర్సీపట్నంలో వరాహ నదిపై మా ప్రభుత్వ హయాంలోనే వంతెన నిర్మించాం...వైసీపీ ప్రభుత్వం వచ్చాక పెండింగ్ లో ఉన్న ఆ కాసింత అప్రోచ్ రోడ్డు పనులు కూడా పూర్తిచేయలేదు. దీంతో మోడల్ స్కూల్ కు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లలో దిగి తమ కష్టం తీర్చాలని వేడుకుంటున్నారు.(2/3)

    — N Chandrababu Naidu (@ncbn) October 20, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.