ETV Bharat / state

హెచ్ఎల్సీ లో గల్లంతయిన యువకుల మృతదేహాలు లభ్యం

author img

By

Published : Oct 3, 2019, 7:33 PM IST

హెచ్ఎల్సీ లో గల్లంతయిన యువకుల మృతదేహాలు లభ్యం

దసరా సెలవుల కోసం ఇంటికి వచ్చిన ఇద్దరు స్నేహితులు మృతిచెందారు. ద్విచక్రవాహనంపై వెళ్తూ ప్రమాదవశాత్తు తుంగభద్ర ఎగువ కాలువలో పడి మరణించారు.

అనంతపురం జిల్లా కణేకల్లు మండలం మాల్యం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. రుద్ర, గంగాధర అనే ఇద్దరు ఇంటర్ విద్యార్థులు ద్విచక్రవాహనంపై వెళ్తూ ప్రమాదవశాత్తు తుంగభద్ర ఎగువ కాలువలో పడి మృతిచెందారు. గత నెల 30వ తేదీన ఇద్దరు స్నేహితులు కలిసి మాల్యం నుంచి కణేకల్లు మండల కేంద్రానికి ద్విచక్రవాహనంపై వెళ్లారు. 3 రోజులైనా తిరిగి ఇంటికి రాకపోవటం వల్ల కుటుంబ సభ్యులు అనుమానంతో ఎగువ కాలువ వెంబడి గాలించారు. ఈ క్రమంలో మండలంలోని గరుడచెడు-మీ ఇండ్ల పల్లి గ్రామాల మధ్య హెచ్ఎల్సీ లో గల్లంతయినట్లు గుర్తించారు. దసరా సెలవుల కోసం ఇంటికి వచ్చిన ఇద్దరు స్నేహితులు మృతిచెందడం వల్ల గ్రామంలో విషాదం నెలకొంది. కణేకల్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హెచ్ఎల్సీ లో గల్లంతయిన యువకుల మృతదేహాలు లభ్యం

ఇదీ చూడండి: కొల్లిమర్ల డ్రైన్​లో పడి రైతు గల్లంతు

Intro:శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి లో మూడు రోజులుగా జరుగుతున్న కొత్తమ్మ తల్లి జాతర మహోత్సవాలు అంబరాన్ని తాకాయి. ఉత్సవాల చివరి రోజు మహిళలు భారీ సంఖ్యలో ఘట్టాలతో ఊరేగింపు నిర్వహించారు.
ఘటాలతో కొత్తమ్మ తల్లి ఆలయానికి చేరుకుని అభిషేకించారు. దారిపొడవునా డప్పు వాయిద్యాలు, తప్పెటగుళ్ళు , మేళతాళాల నడుమ యువత ఉత్సాహంగా నృత్యాలు చేశారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ సమీపంలో ఎగ్జిబిషన్ వద్ద సందడి వాతావరణం కనిపించింది. బొమ్మల దుకాణాలు, తినుబండారాల దుకాణాలు దారిపొడవునా ఏర్పాటు చేశారు.


Body:విక్రమ్


Conclusion:విక్రమ్, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా
8008574284
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.