ETV Bharat / state

మహిళల కష్టం.. కోట్ల మొత్తంలో మాయం

author img

By

Published : Aug 17, 2020, 11:03 PM IST

స్వయం సహాయక మహిళా సంఘాల పొదుపు డబ్బులను కొంతమంది మాయం చేస్తున్నారు. చిరు వ్యాపారాలు, కూలీకి వెళ్లి కూడబెట్టుకున్న నిరుపేద మహిళలను నిలువునా మోసం చేస్తున్న సంఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. బ్యాంకు లావాదేవీలపై అంతగా అవగాహన లేని గ్రామీణ మహిళల సంతకాలు తీసుకొని లక్షల రూపాయలు రుణాలు కాజేస్తున్న వైనం అనంతపురం జిల్లాలో పలుచోట్ల బయటపడింది. గ్రామస్థాయిలోని మహిళాసంఘాలను పర్యవేక్షణ చేసే యానిమేటర్, డీఆర్డీఏ సిబ్బంది కలిసి పొదుపు మహిళల సొమ్ము కాజేస్తున్నారు. ఏళ్ల తరబడి లక్షల రూపాయలు కాజేస్తున్నా కనీసం క్రిమినల్ కేసులు కూడా పెట్టకుండా అధికారులు చోద్యం చూస్తున్నారు.

scam at   Self help women's groups in anantapur district
మహిళా పొదుపు సంఘాలలోని డబ్బులు కాజేస్తున్న డీఆర్డీఏ సిబ్బంది

స్వయం సహాయక మహిళా సంఘాల పొదుపు డబ్బులపై ..కొంతమంది కన్నేశారు. వారు నిరాక్ష్యరాసులు అవడంతో..వేలిముద్రలతో లక్షలు లక్షలు కాజేస్తున్నారు. ఇంత డబ్బు మాయమవుతున్నా జిల్లా యంత్రాంగం పట్టించుకోవట్లేదు. కూలీలకు వెళ్లి డబ్బులు కడుతున్నామని తమకి న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే... మహిళా పొదుపు సంఘాలు ఇటీవల అభివృద్ది చెందాయి. రోజూ రూపాయి చొప్పున రాష్ట్రంలో మొదలైన పొదుపు ఉద్యమం లక్షల రూపాయల రుణాలు తీసుకొని వ్యాపారాలు చేసే స్థాయికి మహిళలు ఎదిగారు. పొదుపు ఉద్యమం ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందగా... ఇప్పటికే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వారికి సొంతమయ్యాయి.

కానీ.. చదువురాని నిరుపేద మహిళలను నిలువునా మోసం చేస్తూ కొందరు వారి కష్టాన్ని దోచుకుంటున్నారు. డీఆర్డీఏ సిబ్బంది చేసే మోసాలు అనంతపురం జిల్లాలో అనేకం వెలుగుచూస్తున్నాయి. తమ పేర్లతో లక్షల రూపాయలు బ్యాంకుల నుంచి రుణాలు కొట్టేశారని గ్రామీణ ప్రాంతాల్లోని పొదుపు మహిళలు కన్నీటి పర్యంతమవుతున్నారు.

అనంతపురం జిల్లాలో 1851 గ్రామ ఐక్య పొదుపు సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల్లోని మహిళలు ప్రతినెలా కొంత మెత్తం పొదుపు చేసుకుంటే, దానికి సరిపడా మొత్తాన్ని బ్యాంకులు పావలా వడ్డీకి రుణం ఇస్తాయి. గ్రామ ఐక్య సంఘంలో 20 నుంచి 50 వరకు ఆ గ్రామంలో మహిళల జనాభానుబట్టి పొదుపు సంఘాలు ఉంటాయి. ప్రతి సంఘంలో పది మంది మహిళలు గ్రూప్​గా ఉండి, అందరూ సంయుక్తంగా బ్యాంకు ఖాతా నిర్వహిస్తుంటారు.

ఈ ఖాతాల ద్వారానే మహిళలకు బ్యాంకులు రుణాలు ఇస్తాయి. ఈ రుణాలతో మహిళలు చిరువ్యాపారాలు, స్వయం ఉపాధి కల్పన వంటి వాటితో కుటుంబ పోషణ చేసుకుంటున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం చెర్లోపల్లిలో నాగలక్ష్మి అనే ఓ యానిమేటర్ ఆ గ్రామంలోని మహిళలతో సంతకాలు చేయించి రుణాలు మొత్తం తీసుకుంది. పదేళ్లుగా ఆమె కోటి 70 లక్షల రూపాయల వరకు మహిళల కష్టార్జితాన్ని కాజేసింది.

కాపలాగా ఉండాల్సిన డీఆర్డీఏ సీసీ, ఏపీఎం లతో సహా పలువురు చెర్లోపల్లి యానిమేటర్ తో కలిసి డబ్బు స్వాహా చేశారు. ఈ తరహాలోనే నల్లచెరువు, బుక్కరాయసముద్రం మండలాల్లో కూడా లక్షల రూపాయల కుంభకోణాలు వెలుగు చూశాయి. మహిళల సొమ్ము తీసుకుంది వాస్తవేమని, చెర్లో ల్లిలో డబ్బు తిరిగి ఇప్పించటానికి ప్రయత్నిస్తున్నట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు.

పొదుపు మహిళల సొమ్ము స్వాహా చేసిన వారిపై జిల్లా అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోవటంలేదు. రుణాలపై వడ్డీ భారం తట్టుకోలేక వందలాది మంది మహిళలు పొదుపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నారు.

ఇదీ చూడండి:

'ప్రభుత్వానికి ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు'

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.