ETV Bharat / city

'ప్రభుత్వానికి ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు'

author img

By

Published : Aug 17, 2020, 7:58 PM IST

ప్రభుత్వానికి ఎవరి ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం లేదని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు చేస్తున్న ట్యాపింగ్ ఆరోపణలు నిరాధారమని ఆమె అన్నారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ కు దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణ చూడలేక ఇలాంటి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.

హోంమంత్రి సుచరిత
హోంమంత్రి సుచరిత

తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు నిరాధారమని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. సుదీర్ఘ కాలం సీఎంగా పని చేసిన వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వంపై బురదజల్లే పనులు మానుకోవాలని సూచించారు. లోకేశ్ మానభంగం చేశారని ఆరోపిస్తే ఊరుకుంటారా అని సుచరిత ప్రశ్నించారు.

సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికి అందిస్తున్న సమయంలో ప్రభుత్వ ఆదరణ పెరగకుండా ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాదులపై మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేస్తారని సుచరిత పేర్కొన్నారు. గతంలో మోదీని వ్యక్తిగతంగా విమర్శించి, ఇప్పుడు కీర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. అందితే జుట్టు... అందక పోతే కాళ్లు అనేది చంద్రబాబు నైజమని విమర్శించారు.

"ఫోన్ ట్యాపింగ్ అంటూ పత్రికలో వార్త రాస్తారు. దానిపై చంద్రబాబు ప్రధానికి లేఖ రాస్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయటం కోసం గత ప్రభుత్వం ఇజ్రాయిల్ నుంచి పరికరాలు తెప్పించారని ఆరోపణలు ఉన్నాయి. దేశంలోనే మూడో అత్యుత్తమ ముఖ్యమంత్రి అని పేరు తేచ్చుకోవటం చూసి ఓర్వలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఫోన్ ట్యాపింగ్ చేస్తే మీ మనీ ల్యాండరింగ్ వ్యవహారం బయటకు వస్తుందని భయపడుతున్నారా? లేక మీరు ఏమైనా సంఘ విద్రోహ కార్యకలాపాలు చేస్తున్నారా? ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీయడానికి ఇలాంటి కుట్రలు పన్నుతున్నారు" --మేకతోటి సుచరిత, హోంమంత్రి

ఇదీ చదవండి : ఊహించని ఉపద్రవం.... బాధితుల్ని ఆదుకోండి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.