ETV Bharat / state

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరు.. వైఎస్సార్సీపీకి బుద్ధి చెప్పాలని పిలుపు

author img

By

Published : Mar 5, 2023, 10:55 AM IST

Updated : Mar 5, 2023, 11:39 AM IST

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరు
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరు

MLC Election Campaign : మార్చి 13న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. రాజకీయ పక్షాలు తమ అభ్యర్థుల తరపున ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. వైఎస్సార్సీపీ పాలనలో ఉద్యోగులకు అంతా అన్యాయమే జరిగిందని విపక్ష పార్టీల నేతలు మండిపడ్డారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరు..వైఎస్సార్సీపీకి బుద్ధి చెప్పాలని పిలుపు

MLC Election Campaign : వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తరపున ఆయన ప్రచార కార్యక్రమం నిర్వహించారు. శింగనమల మండలం బండమీదపల్లి గ్రామంలో టీడీపీ అభ్యర్థి తరపున ఆ పార్టీ నేత చింతమనేని ప్రభాకర్ విస్తృతంగా ప్రచారం చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేస్తున్న కంచర్ల శ్రీకాంత్‌ను గెలిపించాలని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా సంతమాగులూరులో పార్టీ నాయకులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

" సీపీఎస్ రద్దు మీద ఈ ప్రభుత్వం మాట చెప్పి ఎట్లా వెనక్కి పోయింది. ఉద్యోగస్థుడికి ఎట్లా ఉందంటే వాళ్ల దాచి పెట్టుకున్న డబ్బులను కూడా గవర్మమెంట్ వాడేసింది. చదువుకున్న నిరుద్యోగులకు కనీసం మనం నిరుద్యోగ భృతి పెట్టినాము. అది కూడా తీసేశారు. " - పయ్యావుల కేశవ్, టీడీపీ నేత

" మూడు రాజధానులు అని చెప్పి మూడు ప్రాంతాలుగా విడగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే దురుద్ధేశ్యంతో చేసే ఈ విషయాలను ఖండించాలి. తప్పని సరిగా పట్టభద్రుల యొక్క నియోజకవర్గాల్లో టీడీపీ ఎవరిని అయితే బలపరుస్తుందో వారిని గెలిపించాల్సిన అవసరం ఉంది. " - చింతమనేని ప్రభాకర్, టీడీపీ నేత

బీజేపీతోనే రాష్ట్రాభివద్ధి : తాడిపత్రిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు. బీజేపీతోనే రాష్ట్రాభివద్ధి సాధ్యమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధులను ఓడించి ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలని అనంతపురం సీపీఐ నేతలు పిలుపును ఇచ్చారు. సీఎం అరాచకాలను అడ్డుకోవాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఓడించాలని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ పీడీఎఫ్ అభ్యర్థి పోతుల నాగరాజు కర్నూలులో కోరారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ పోతుల నాగరాజును ఆదరించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు నంద్యాలలో విజ్ఞప్తి చేశారు. ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి అవసరమైన ప్యాకేజీ సాధించేందుకు తన వంతు కృషి చేస్తానని పీడీఎఫ్ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ కోరుట్ల రమాప్రభ అన్నారు.

" ప్రాంతీయ పార్టీల మూలంగా అవినీతి, కుటుంబ పరిపాలన, అభివృద్ధి లేకుండా, అప్పులు చేయడం తప్ప ఆంధ్ర రాష్ట్రం సాధించింది ఏమి లేదు. ఒక్క మోదీ గారి నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరుగులు తీస్తుంది అనే నినాదంతో ఈ ఎన్నికల్లో ముందుకెళ్లి మూడు చోట్ల విజయం సాదించే ప్రయత్నం గట్టిగా చేస్తున్నాం. " - సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

"మంత్రుల పీఏలుగా, అటెండర్​లుగా, కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్లను తీసుకెళ్లి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎలెక్టు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి హానికరం. " - ముప్పాళ్ల నాగేశ్వరరావు, సీపీఐ నేత

" పోతుల నాగరాజుగా విద్యావంతులకు ఒక్కటే హామీ ఇస్తున్నా. ఈ రాయలసీమ సమగ్ర అభివృద్ధి కోసం శాసన మండలిలో ప్రశ్నించే గొంతునైతా. " - పోతుల నాగరాజు, పీడీఎఫ్ ఎమ్​ఎల్​సీ అభ్యర్థి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ విశాఖ కొత్త వెంకోజీపాలెం లవకుశ అపార్ట్‌మెంట్‌లో చోడవరం మండలం బెన్నవోలు వాసి రమేశ్‌ నాయుడు వద్ద 26 లక్షలు 89 వేల 500 రూపాయలు పోలీసులు గుర్తించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో సీఎం జగన్‌ ఫోటోలు ఎక్కడికక్కడ దర్శనమిస్తున్నా అధికారులు మాత్రం ఎన్నికల కోడ్‌ను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇవీ చదవండి

Last Updated :Mar 5, 2023, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.