ETV Bharat / state

Madakasira Branch Canal Works by Neglect YSRCP Government: మడకశిర కాలువ పనులపై జగన్‌ సర్కారు నిర్లక్ష్యం.. అన్నదాతల ఆగ్రహం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 29, 2023, 9:18 AM IST

Updated : Sep 29, 2023, 12:02 PM IST

Madakasira Branch Canal Works by Neglect YSRCP Government: ఎన్నికల ప్రచారంలో పెండింగు పనులను పూర్తి చేసి చెరువులన్నింటికీ కృష్ణా జలాలు అందిస్తామని ఊదరగొట్టారు. 20 శాతం పనులు చేస్తే నీళ్లు ఇవ్వొచ్చని నాడు చెప్పిన జగన్‌.. ఈ నాలుగేళ్లలో ఒక్క శాతమూ పని చేయలేదు. కరవుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లా అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లారు. మడకశిర కాలువకు 83 కోట్ల విలువైన పని చేస్తే నీళ్లు ప్రవహించే అవకాశమున్నా అది గాలికొదిలేసి కొత్తగా బైపాస్‌ కాలువ అంటూ అంతకుమించి నిధులు ఖర్చు చేస్తామనడంపై విమర్శలు వస్తున్నాయి.

Madakasira_Branch_Canal_Works_by_Neglect_YSRCP_Government
Madakasira_Branch_Canal_Works_by_Neglect_YSRCP_Government

Madakasira Branch Canal Works by Neglect YSRCP Government: మడకశిర కాలువ పనులపై జగన్‌ సర్కారు నిర్లక్ష్యం.. అన్నదాతల ఆగ్రహం

Madakasira Branch Canal Works by Neglect YSRCP Government : మడకశిర బ్రాంచి కెనాల్‌ పనులను తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు పూర్తి చేసి చెరువులన్నింటికీ కృష్ణా జలాలు (Krishna Waters to all Ponds) అందిస్తాదని 2019 మార్చి 30న ఎన్నికల ప్రచారంలో భాగంగా మడకశిరలో నిర్వహించిన రోడ్డు షో లో జగన్‌ ఘనంగా ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా మడకశిర బ్రాంచి కాలువ పనులను పూర్తి చేయలేదు. ఇప్పటికే తవ్విన కాలువలు మట్టితో పూడిపోతున్నాయి. కొన్ని వంతెనలు నిర్మిస్తే చాలు చెరువులకు నీళ్లివ్వొచ్చు. ప్రధాన కాలువను పక్కన పెట్టి కొత్తగా బైపాస్‌ కాలువ అంటూ పనులు అప్పగించారు. దీనివల్ల ఉపయోగం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
YSRCP Government Spend Funds on Bypass Canal : శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా వరద జలాలను కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు తరలించే హంద్రీనీవా సుజల స్రవంతిలో భాగంగానే మడకశిర బ్రాంచి కాలువ నిర్మాణం చేపట్టారు. హంద్రీనీవా రెండో దశలో 26 టీఎంసీలను తరలించాలనేది ప్రధాన ఉద్దేశం. తెలుగుదేశం హయాంలో మడకశిర వరకు కాలువ పనులు పూర్తి చేసి హరేసముద్రం చెరువుకు నీరందించారు.

Budameru Canal: దశాబ్దాలుగా దుర్వాసనతో జీవనం.. ఇంకెప్పుడు బాగుపడతాయి సార్ వాళ్ల జీవితాలు..?

2019లో ప్రభుత్వం మారిపోవడంతో పనులు నిలిచిపోయాయి. అసంపూర్తి పనులను పూర్తి చేస్తే వందల చెరువులకు నీరందుతుంది. జగన్‌ సర్కారుకు ఆ మాత్రం చిత్తశుద్ధి కూడా లేదు. కాలువలు రూపు కోల్పోయి చెట్లు మొలిచాయి. గుత్తేదారులకు 7 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో పనులు నిలిపేశారు. మిగిలిన పనులకు అధికారులు ప్రతిపాదనలు పంపుతున్నా పట్టించుకోవటం లేదు.

మడకశిర నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 56, 57, 58 ప్యాకేజీల్లో బ్రాంచి కాలువ పనులు చేపట్టారు. తెలుగుదేశం ప్రభుత్వంలోనే 58వ ప్యాకేజీ వందశాతం పూర్తయింది. 56, 57 ప్యాకేజీలను 80 శాతం పూర్తి చేశారు. కల్వర్టులు, వంతెనలు, పలు స్ట్రక్చర్లు మినహా ప్రధాన కాలువ పూర్తయింది. మూడు ప్యాకేజీల్లో కలిపి 280 వరకు వంతెనలు, కల్వర్టులు నిర్మించాల్సి ఉండగా.. గతంలోనే 208 వరకు పూర్తి చేశారు. 72 వరకు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి నిర్మాణం, పలుచోట్ల పూడికతీత పనులకు 89 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. మడకశిర ఉప కాలువ 160 కిలోమీటర్లు ఉంటుంది.

Farmers Diverted Irrigation Water to Guntakallu Branch Canal: గుంతకల్లు బ్రాంచ్ కెనాల్‌కి నీటిమట్టాన్ని పెంచుకున్న రైతులు..

Ananthapuram District Farmers Fire on CM Jagan : ప్రస్తుతం 125వ కిలోమీటరు దాటిన తర్వాత 160వ కిలోమీటరు వరకు పనులు పెండింగులో ఉన్నాయి. వీటిని పెండింగులో ఉంచి బైపాస్‌ కాలువ అంటూ 175 కోట్ల రూపాయలతో మరో సంస్థకు పనులు అప్పజెప్పారు. ఈ బైపాస్‌ కాలువ 47వ కిలోమీటరు నుంచి తవ్వి 125వ కిలోమీటరు వద్ద ఉప కాలువతోనే కలుస్తుంది. ఆ మేరకు ఉప కాలువ పనులూ ఎలాగూ పూర్తయ్యాయి. అవనసరంగా బైపాస్‌ కాలువ నిర్మించే బదులు ఆ నిధులతో ఉప కాలువ పెండింగు పనులు పూర్తి చేస్తే మేలు కదా అని రైతులు ప్రశ్నిస్తున్నారు.

KC Canal: ఘన చరిత్ర కలిగిన కేసీ కెనాల్​.. నేడు మురికి కూపంలా

Last Updated :Sep 29, 2023, 12:02 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.