Farmers Diverted Irrigation Water to Guntakallu Branch Canal: గుంతకల్లు బ్రాంచ్ కెనాల్‌కి నీటిమట్టాన్ని పెంచుకున్న రైతులు..
Farmers Diverted Irrigation Water to Guntakallu Branch Canal: అనంతపురం జిల్లా గుంతకల్లు బ్రాంచ్ కెనాల్‌కి ఆయకట్టు రైతులు నీటి మట్టాన్ని పెంచుకున్నారు. ప్రస్తుతం తాగునీటి అవసరాలకు మాత్రమే అధికారులు కాలువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో కాలువ కింద మిరప, పొద్దుతిరుగుడు, కంది తదితర పంటలు సాగు చేస్తున్న చివరి ఆయకట్టు గ్రామాల రైతులు.. ఉరవకొండ మండలం నింబగల్లు వద్దకు చేరుకొని రాడ్లతో జీబీసీ షటర్లు ఎత్తి నీటిని కాలువకు మళ్లించుకున్నారు. అంతకు ముందు అక్కడి హెచ్ఎల్సీ హెడ్ రెగ్యులేటర్ షటర్ల వద్ద దాదాపు 200 బస్తాల సిమెంట్, చెట్లను అడ్డుగా వేసి నీరు ముందుకు వెళ్లకుండా చేసి జీబీసీకి నీటి మట్టాన్ని పెంచుకున్నారు. జీబీసీ చివరి ఆయకట్టు భూములకు చుక్కనీరు అందడం లేదని రైతులు తెలిపారు. నీటిమట్టాన్ని పెంచాలని అధికారులకు చాలాసార్లు చెప్పిన పట్టించుకోకపోడంతో తామే షటర్లు ఎత్తి నీటిని మళ్లించుకోవాల్సి వచ్చిందన్నారు. లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి.. నీరులేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోయారు. పంటలు ఎండిపోతే తాము నష్టపోతామని ఆవేదనకు లోనయ్యారు.