ETV Bharat / sports

ఒలింపిక్స్​ వేళ టోక్యోను కలవరపెడుతున్న కరోనా

author img

By

Published : Jul 27, 2021, 6:05 PM IST

కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఒలింపిక్స్ క్రీడలను కట్టుదిట్టమైన ఆంక్షల నడుమ నిర్వహిస్తున్నా.. మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. టోక్యోలో మంగళవారం 2,848 కొవిడ్ కేసులు వెలుగుచూసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది జనవరి తర్వాత అత్యధిక కేసులు మంగళవారం నమోదయ్యాయి.

Covid-19 cases surge in Tokyo during Olympics
ఒలింపిక్స్​ వేళ టోక్యోను కలవరపెడుతున్న కరోనా

అనుకున్నట్టే జరుగుతోంది! టోక్యో నగరంలో కొవిడ్‌-19 కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఒలింపిక్స్‌ క్రీడల ప్రభావం కనిపిస్తోంది! మంగళవారం ఒక్కరోజే 2,848 కొత్త కేసులు నమోదయ్యాయి. జనవరి 7న నమోదైన అత్యధిక కేసులు 2,520 కన్నా ఈ సంఖ్య ఎక్కువే కావడం గమనార్హం. గతేడాది మహమ్మారి మొదలైయ్యాక నగరంలోని మొత్తం కేసులు 2 లక్షలకు చేరుకున్నాయి.

ఒలింపిక్స్‌ నిర్వహించడం వల్ల అతివేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియెంట్‌ విజృంభించే అవకాశం ఉందని నిపుణులు ముందుగానే హెచ్చరించారు. యువకులు, టీకాలు తీసుకోని వారు ఎక్కువగా వైరస్‌ బారిన పడుతున్నారని వివరించారు. 50 ఏళ్లు పైబడిన వారిలో వ్యాధి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో చేరిన 3000 మందిలో వీరి వాటానే ఎక్కువ. ఈ నేపథ్యంలో నగరంలోని ఆసుపత్రుల్లో 3000గా ఉన్న పడకల సామర్థ్యాన్ని 6000కు పెంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

జపాన్‌లో కరోనా టీకా పంపిణీ నత్తనడకన సాగుతోంది. అయితే దేశంలో ఇప్పటి వరకు 25.5% మంది పూర్తిగా వ్యాక్సిన్‌ తీసుకున్నారని ప్రభుత్వం చెబుతోంది. జపాన్‌లో ఇప్పటి వరకు 8,70,445 కేసులు నమోదు అయ్యాయి. 15,129 మంది మృతిచెందారు. పౌరుల ఆరోగ్యం కన్నా ఒలింపిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని ప్రధాని యోషిహిదె సుగా ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి.

ఇదీ చూడండి.. ఒలింపిక్స్​ ప్రదర్శనతో షూటింగ్ సమాఖ్య షాక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.