దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు.. కోహ్లీ ఈ రికార్డు సాధించేనా?

author img

By

Published : Jan 10, 2022, 5:41 PM IST

Virat Kohli latest news, Virat Kohli record, ద్రవిడ్ రికార్డుపై కోహ్లీ కన్ను, విరాట్ కోహ్లీ రికార్డు

Kohli Record: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్​ను ఎలాగైనా కైవసం చేసుకోవాలని భారత జట్టు ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే సిరీస్​ 1-1తో సమం కాగా కేప్​టౌన్​లో జరగబోయే టెస్టులో గెలవాలని తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే ఈ టెస్టు ద్వారా ఓ రికార్డు నెలకొల్పాలని టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎదురుచూస్తున్నాడు.

Kohli Record: దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతోంది టీమ్ఇండియా. ఇప్పటికీ సిరీస్ 1-1 తేడాతో సమం కాగా.. మూడో టెస్టులో గెలిచి ఈ ఘనత సాధించాలన్న పట్టుదలతో ఉంది. గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్​కు అందుబాటులోకి రానున్నాడు. దీంతో భారత బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలంగా మారనుంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్​ ద్వారా ఓ రికార్డు కైవసం చేసుకోవాలని ఎదురుచూస్తున్నాడు కోహ్లీ. ఆ రికార్డేంటంటే!

సౌతాఫ్రికా పిచ్​లపై టెస్టుల్లో ద్రవిడ్ 22 ఇన్నింగ్స్​ల్లో 624 పరుగులు చేశాడు. సగటు 29.71గా ఉంది. ప్రస్తుతం కెప్టెన్​గా ఉన్న విరాట్.. ఇక్కడి పిచ్​లపై 11 ఇన్నింగ్స్​ల్లో 611 పరుగులు సాధించాడు. ఇక ఈ ఆఖరి టెస్టులో మరో 14 పరుగులు సాధిస్తే.. సఫారీ గడ్డపై టెస్టుల్లో ఎక్కువ పరుగులు సాధించిన భారత బ్యాటర్ల జాబితాలో కోహ్లీ.. ద్రవిడ్​ను దాటి రెండో స్థానానికి చేరతాడు. కానీ.. అగ్రస్థానానికి చేరడం మాత్రం కష్టమే. ఎందుకంటే బ్యాటింగ్ దిగ్గజం సచిన్.. సౌతాఫ్రికా పిచ్​లపై 15 టెస్టులాడి 46.44 సగటుతో 1161 పరుగులు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇందులో ఐదు సెంచరీలు, మూడు అర్ధశతకాలు ఉండటం విశేషం.

ఇవీ చూడండి: టీమ్ఇండియాకు కలిసిరాని కేప్​టౌన్.. మరి ఈసారైనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.