భారీ ధరకు ఉమెన్స్​ ఐపీఎల్ మీడియా రైట్స్.. ఎవరు దక్కించుకున్నారంటే?

author img

By

Published : Jan 16, 2023, 1:01 PM IST

Viacom18 Media Pvt Ltd wins Women s IPL media rights

పురుషుల ఐపీఎల్ డిజిటల్​ ప్రసార హక్కులను దక్కించుకున్న వయాకామ్ 18 ఉమెన్స్​ ఐపీఎల్​ మీడియా రైట్స్​ను కూడా దక్కించుకుంది. ఇందుకోసం రూ.951 కోట్లు చెల్లించనుంది.

బీసీసీఐ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న టోర్నీ ఉమెన్స్​ ఐపీఎల్. అయితే ఈ లీగ్​లో టీమ్స్‌ను కొనుగోలు చేసేందుకు మెన్స్​ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోని ఫ్రాంచైజీలు బాగానే ఆసక్తి చూపించాయి. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్‌, దిల్లీ క్యాపిటల్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ వంటి ఫ్రాంచైజీలన్నీ మహిళల ఐపీఎల్ టీమ్‌లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేయడంతో ఈ టోర్నీకి మంచి క్రేజ్ వచ్చింది.

అయితే ఈ క్రమంలోనే ఉమెన్స్ ఐపీఎల్‌ మీడియా హక్కుల విక్రయం కోసం బిడ్డింగ్ నిర్వహించింది బీసీసీఐ. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో పాటు సోనీ నెట్‌వర్క్, అమెజాన్ ప్రైమ్ వంటి బడా కంపెనీలన్నీ ఈ మీడియా రైట్స్​ కోసం పోటీపడ్డాయి. అయితే ఉమెన్స్​ ఐపీఎల్​ మీడియా రైట్స్​ను రూ.951 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది వయాకామ్​ 18. 2023-27 ఐదేళ్ల కాలానికి గాను కొనుగోలు చేసింది. దీంతో ఒక్కో మ్యాచ్‌కు రూ.7.09 కోట్ల ఆదాయం బీసీసీఐ ఖాతాలో చేరనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జైషా సోషల్​మీడియాలో ట్వీట్ చేశారు. "వయాకామ్18, వుమెన్స్ ఐపీఎల్ మీడియా హక్కులను దక్కించుకుంది. బీసీసీఐపై, బీసీసీఐ వుమెన్స్ టీమ్స్‌పై నమ్మకం పెట్టినందుకు మీకు థ్యాంక్యూ. వయాకామ్ రూ.951 కోట్లు అంటే మ్యాచ్‌కు రూ.7.09 కోట్లు చెల్లించేందుకు ఒప్పుకుంది. మహిళా క్రికెట్‌ అభివృద్ధికి ఇది చాలా ఉపయోగపడుతుంది." అంటూ బీసీసీఐ సెక్రటరీ జై షా ట్వీట్ చేశారు.

ఇప్పటికే పురుషుల ఐపీఎల్ 2023-27 సీజన్ మీడియా హక్కుల విక్రయం ద్వారా రూ.48,390 కోట్లు బీసీసీఐ ఆర్జించింది. ఇప్పుడు మహిళా ఐపీఎల్ 2023-27 సీజన్ మీడియా రైట్స్​ ఆదాయం ద్వారా మరో రూ.951 కోట్లు బోర్డు ఖాతాలోకి చేరాయి. మొత్తంగా మెన్స్, ఉమెన్స్​ ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా బీసీసీఐ ఖాతాలోకి రూ.50 వేల కోట్లు (రూ. 49,341 కోట్లు) వచ్చాయి.

ఇదీ చూడండి: IND VS SL: కోహ్లీ, సిరాజ్​.. ఈ ఇంట్రెస్టింగ్​​ వీడియోస్​ చూశారా?​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.