ETV Bharat / sports

IND VS ENG: ఐదో టెస్టులో నమోదైన రికార్డులివే

author img

By

Published : Jul 6, 2022, 7:33 AM IST

IND VS ENG Fifth test records: ఐదో టెస్ట్​లో టీమ్​ఇండియాపై ఇంగ్లాండ్​ 7వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్ 2-2తో​ సమమైంది. అయితే ఈ మ్యాచ్​లో కొన్ని రికార్డులు నమోదయ్యాయి. అవేంటో తెలుసుకుందాం...

Teamindia VS England fifth test records
ఇంగ్లాండ్​ ఐదో టెస్టు రికార్డ్స్​

IND VS ENG Fifth test records: గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఐదో టెస్టులో ఇంగ్లాండ్‌ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా నిర్దేశించిన 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. దీంతో ఇంగ్లిష్‌ జట్టు తమ టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగుల లక్ష్య ఛేదనను పూర్తిచేసి సరికొత్త రికార్డు నమోదు చేసింది. దీంతో పాటు మరికొన్ని రికార్డులు కూడా నమోదయ్యాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.

టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగుల భారీ ఆధిక్యం సాధించినా ఓటమిపాలవ్వడం ఇది రెండోసారి. 2015లో గాలే వేదికగా శ్రీలంకతో ఆడిన మ్యాచ్‌లో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 192 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అయినా, ఆ మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది.

టీమ్‌ఇండియాపై టెస్టుల్లో ఏ జట్టుకైనా ఇదే అత్యధిక పరుగుల ఛేదన. అంతకుముందు 1977లో పెర్త్‌ వేదికగా జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా 339 పరుగుల రికార్డు ఛేదన చేసింది. అలాగే 1987లో దిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ 276 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇక 2002లో జోహెనెస్‌బర్గ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

ఇక ఇంగ్లాండ్‌ జట్టుకు టెస్టుల్లో ఇదే అత్యధిక ఛేదన. ఇదివరకు 2019లో లీడ్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. అలాగే 1928/29 సీజన్‌లో మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 332 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేసింది.

ఇదీచూడండి: IND VS ENG: ఆ ఒక్క క్యాచ్​.. టీమ్​ఇండియా ఓటమికి కారణమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.