ETV Bharat / sports

'గంగూలీని ఒక్క మాట కూడా అనలేదు'.. రూమర్స్​పై క్లారిటీ!

author img

By

Published : Oct 14, 2022, 8:45 PM IST

బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి గంగూలీ తప్పుకోనున్నారు. 1983 వరల్డ్​ కప్​ ప్లేయర్ రోజర్ బిన్నీ ఏకగ్రీవంగా ఎన్నికవడం దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలో గంగూలీపై వస్తున్న వార్తలపై కాబోయే ఐపీఎల్ ఛైర్మన్​ అరుణ్ ధుమాల్​ స్పందించారు. బీసీసీఐ అధ్యక్ష పదవి గురించి భారత మాజీ కోచ్​ రవిశాస్త్రి గంగూలీ సైతం స్పందించారు.

team india ex coach ravi shashtri
team india ex coach ravi shashtri

మరో సారి బీసీసీఐ అధ్యక్ష పదవి సౌరవ్​ గంగూలీని వరించే అవకాశం లేదు. ఈ విషయంపై గంగూలీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా దీనిపై కాబోయే ఐపీఎల్​ ఛైర్మన్ అరుణ్ ధుమాల్​ స్పందించారు. గంగూలీకి వ్యతిరేకంగా ఏ ఒక్కరూ కూడా మాట్లాడలేదని అన్నారు. ఈ క్రమంలో బీసీసీఐ అధ్యక్ష పదవిపై టీమ్‌ ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. రోజర్‌ బిన్నీ బీసీసీఐ అధ్యక్షుడిగా వస్తాడనే వార్తలను స్వాగతిస్తున్నట్లు రవిశాస్త్రి వెల్లడించాడు.

"స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి బీసీసీఐ అధ్యక్షుడిగా ఏ ఒక్కరూ మూడు సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పదవిలో కొనసాగలేదు. దాదా గురించి మీడియాలో వస్తున్న ఊహాగానాలు.. కొంత మంది ఆయనకి వ్యతిరేకంగా ఉన్నారన్న మాటలు అన్నీ అసత్య ప్రచారాలు. ఎవరూ గంగూలీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కొవిడ్​ వల్ల ఇబ్బందులు వచ్చినప్పటికీ.. బీసీసీఐ పని చేసిన తీరుపై అందరూ సంతృప్తిగా ఉన్నారు. దాదాకు మంచి కెప్టెన్​గా విశిష్ఠమైన గుర్తింపు ఉంది. అయన టీమ్​ని అంతా తనతో నడిపించేవాడు. మేము ఒక టీమ్ లాగా పని చేసేవాళ్లం." అని చెప్పారు.

రోజర్​ బిన్నీ గురించి.. ఐపీఎల్ ఛైర్మన్​​ గురించి మాట్లాడారు ధుమాల్​. గంగూలీ హయాంలో బోర్డు, క్రికెట్​ ఎలా అభివృద్ధి చెందాయో వివరించారు. ఆయన బయటకు వెళ్లడంలో ఏ రాజకీయాలు లేవని చెప్పారు. ఇలాంటి ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం.. కాబట్టి మనుషులకు ఆలోచనలు వేరేగా ఉంటాయి. కానీ బీసీసీఐకి వచ్చేసరికి అందరి ఫోకస్​ భారత క్రికెట్​ను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై ఉంటుందని చెప్పుకొచ్చారు.

వరుసగా రెండోసారి బీసీసీఐ అధ్యక్ష పదవిని గంగూలీ ఆశించినా.. ఇతర సభ్యుల నుంచి పెద్దగా మద్దతు లేకపోవడంతో విరమించుకొన్నారు. దానిపైనా రవిశాస్త్రి స్పందించాడు. "వరుసగా రెండోసారి బీసీసీఐ అధ్యక్షుడిగా అయినవారు ఎవరూ లేరు. ఇప్పుడు మరొక క్రికెటర్‌కు అవకాశం వచ్చిందనుకోవాలి. ఎందుకంటే జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. కొంతకాలం కేటాయించిన విధులు నిర్వర్తించడమే మన బాధ్యత. ఆ తర్వాత ముందుకు సాగిపోవడమే జీవితం. ఇక రోజర్ బిన్నీ సామర్థ్యం ప్రశ్నించలేం. అంతేకాకుండా వరల్డ్ కప్‌ విన్నింగ్‌ టీమ్‌లో సభ్యుడు. అందుకే బీసీసీఐ అధ్యక్షుడిగా అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. కేవలం అగ్రశ్రేణి ఆటగాళ్లను మాత్రమే కాకుండా క్షేత్రస్థాయిలో ప్రతి ప్లేయర్‌కు మంచి చేయగలడని భావిస్తున్నా. స్వతంత్రంగా పనిచేయగల సమర్థుడు. క్రికెట్‌కు సంబంధించిన అంశాలపై గట్టిగా మాట్లాడగలడు" అని రవిశాస్త్రి వెల్లడించాడు. క్రికెట్ మైదానల్లో మౌలిక సదుపాయాలు, వసతులు ఇంకా వృద్ధి చెందాలని ఆకాంక్షిచాడు.

ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్‌ బోర్డు.. భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ).. టీమ్ఇండియాకు తొలి ప్రపంచకప్‌ను అందించిన కపిల్‌ సేనలో కీలక సభ్యుడు, మాజీ ఆటగాడు రోజర్‌ బిన్నీ కొత్త అధ్యక్షుడిగా రావడం ఖాయంగా కనిపిస్తోంది. అక్టోబర్‌ 18వ తేదీన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ అధ్యక్షుడిగా ఉన్నాడు. వరుసగా రెండోసారి ప్రెసిడెంట్‌గా వద్దామని భావించినా సాధ్యపడలేదు.

"రోజర్‌ బిన్నీ బీసీసీఐ అధ్యక్షుడిగా వస్తాడని ప్రచారం సాగుతోంది. నాకెంతో ఆనందంగా ఉంది. ప్రపంచకప్‌లో నా సహచరుడు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం అతడికి ఉంది. ఇప్పుడు టాప్‌ పోస్టులోకి రాబోతున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. దానికి కారణం.. బీసీసీఐ చరిత్రలో భారత్‌కు తొలి వన్డే ప్రపంచకప్‌ను అందించిన జట్టులోని సభ్యుడు బాస్‌గా రావడం అద్భుతం" అని తెలిపాడు. రోజర్‌ బిన్నీ మాత్రమే బీసీసీఐ అధ్యక్ష పదవి కోసం నామినేషన్‌ దాఖలు చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇవీ చదవండి : బుమ్రా ప్లేస్​లో జట్టులోకి వచ్చిన స్టార్​ బౌలర్.. ఆశలు నెరవేరుస్తాడా?

భారత క్రికెట్​ బోర్డుకు రూ.995 కోట్లు నష్టం.. ఇదే కారణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.