ఆ రికార్డు సాధించిన క్రికెటర్​​ సూర్య ఒక్కడే

author img

By

Published : Nov 21, 2022, 6:55 PM IST

Surya kumar yadav

టీమ్​ఇండియా టీ20 స్టార్ బ్యాటర్​ సూర్యకుమార్ యాదవ్​ మళ్లీ అదిరిపోయే రికార్డులను దక్కించుకున్నాడు. అవేంటంటే..

టీమ్​ఇండియా టీ20 విధ్వంసకర బ్యాటర్​ సూర్యకుమార్‌ ధాటికి రికార్డులు బద్దలవుతున్నాయి. పలు శిఖరాలను సూర్యా ఒక్కడే అలవోకగా అధిరోహించాడు. ప్రపంచ వ్యాప్తంగా టీ20ల్లో 1,000 పరుగులు చేసిన ఆటగాళ్లల్లో 150కు పైగా స్ట్రైక్‌ రేట్‌తో ఉన్నావారు ఏడుగురే. ఇక 160, 170 స్ట్రైక్‌ రేట్ల పూల్‌లో కేవలం సూర్యకుమార్‌ ఒక్కడే ఉండటం విశేషం. స్కై 181 స్ట్రైక్‌ రేట్‌తో 1,395 పరుగులు చేసి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.

  • క్రికెట్‌ ప్రపంచంలో సెనా( సౌతాఫ్రికా, ఇంగ్లాండ్‌,న్యూజిలాండ్‌,ఆస్ట్రేలియా) దేశాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ అత్యంత కఠినమైన పిచ్‌లు ఉంటాయి. వీటిపై శతకం సాధించడం ఆషామాషీ కాదు. ఇవి సీమర్లకు స్వర్గధామాలు. ముఖ్యంగా స్పిన్‌ అనుకూలంగా ఉండే ఆసియా పిచ్‌లపై సాధన చేసిన ఆటగాళ్లకు ఇవి నరకం చూపిస్తాయి. అటువంటి పిచ్‌లపై టీ20ల్లో ఒక్క శతకం బాదినా అదొక రికార్డుగా మిగిలిపోతుంది. అటువంటిది సూర్యకుమార్‌ ఏకంగా రెండు శతకాలు బాదాడు.
  • సెనా దేశాలపై అత్యధిక శతకాలు బాదిన తొలి ఆటగాడిగా నిలిచాడు. గతంలో ట్రెంట్‌లో ఇంగ్లాండ్‌పై 117 పరుగులు చేసినా సూర్య.. ఈ సారి న్యూజిలాండ్‌పై 111 పరుగులతో అజేయంగా ఉన్నాడు. ఈ రెండు సెనాలో భాగమైన దేశాలే. రోహిత్‌శర్మ, కేఎల్‌ రాహుల్‌, బాబర్‌ అజామ్‌లు మాత్రమే సెనాపై ఒక్కో శతకం చొప్పున సాధించారు.
  • వాస్తవానికి సెనా దేశాల్లో న్యూజిలాండ్‌ ఒక్కటే గతంలో కొంత బలహీనంగా ఉండేది. కానీ, ఇటీవల కాలంలో ఆ దేశ జట్టు బాగా పుంజుకొంది. 2015, 2019 ప్రపంచకప్‌ల ఫైనల్స్‌కు చేరుకొంది. ఇటీవల టీ20 ప్రపంచ కప్‌లో కూడా సెమీస్‌కు చేరుకొంది.
  • రోహిత్‌ తర్వాత భారత్‌ తరపున ఒకే ఏడాదిలో రెండు శతకాలు బాదిన క్రికెటర్‌ కూడా సూర్యకుమార్‌ యాదవే. రోహిత్‌ ఇటువంటి అరుదైన ఘనతను 2018లో సాధించాడు.

టీ20 క్రికెట్‌లో ఒకే ఏడాది 7 మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌లు గెలుచుకున్న భారత ఆటగాడిగా సూర్య నిలిచాడు. ఇప్పటి వరకు 6 అవార్డులతో ఈ స్థానంలో కొనసాగుతోన్న స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీని వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించాడు.

ఇదీ చూడండి: కోహ్లీ గడ్డంపై విలియమ్సన్​ కామెంట్.. సోషల్​మీడియాలో ఇప్పుడిదే చర్చ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.