కోహ్లీ గడ్డంపై విలియమ్సన్​ కామెంట్.. సోషల్​మీడియాలో ఇప్పుడిదే చర్చ!

author img

By

Published : Nov 21, 2022, 5:35 PM IST

Kohli kanewilliamson beard

భారత స్టార్​ క్రికెటర్​ విరాట్​ కోహ్లీ, న్యూజిలాండ్​ కెప్టెన్​ కేన్​ విలియమ్సన్​ గడ్డం గురించి సోషల్​మీడియాలో ఓ చర్చ జరుగుతోంది. కోహ్లీ గడ్డంపై విలియమ్సన్​ చేసిన​ కామెంట్​ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్​ అవుతోంది. ఇంతకీ అతడు ఏమన్నాడంటే?

టీమ్​ఇండియా స్టార్​ క్రికెటర్​ విరాట్​ కోహ్లీ.. క్రికెటర్లలో ఎంత స్టైలిష్​గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆటలోనే కాదు తన లుక్​తోనూ ప్రేక్షకుల్లో సూపర్​ క్రేజ్​ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా అతడి హెయిర్​ స్టైల్​, బియర్డ్(గడ్డం) లుక్​కు​​ వీరాభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే కింగ్​ కోహ్లీకి తన జుట్టుతో ప్రయోగాలు చేయడమంటే చాలా ఇష్టం. న్యూ లుక్స్​తో సోషల్​ మీడియాలో ఎప్పుడు ట్రెండింగా ఉంటాడు. హీరోలకు ధీటుగా తన స్టైల్​తో అందరిని కట్టిపడేస్తుంటాడు.​ అందుకే కావచ్చు బాలీవుడ్​ అగ్ర కథానాయిక అనుష్క శర్మ సైతం.. కోహ్లీ అందానికి ఫిదా అయి లైఫ్​ పార్ట్నర్​గా మారిపోయింది. ఇక క్రికెటర్లలో తన లుక్​తో ఆకట్టుకునే మరో ప్లేయర్​ న్యూజిలాండ్​ కెప్టెన్​ విలియమ్సన్​. ఎందుకంటే అతడికి తన గడ్డమే ప్రత్యేకత. ఎప్పుడు బియర్డ్​తో కనిపించే అతడు తాజాగా కోహ్లీ గడ్డంపై ఓ కామెంట్​ చేశాడు. ఏంటంటే?

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విలియమ్సన్​కు 'మీ గడ్డం బాగుంటుందా..? లేదా విరాట్​ కోహ్లీ గడ్డం బాగుంటుందా?' అని ప్రశ్న ఎదురైంది. దీనికి అతడు సమాధానం చెబుతూ.. 'ఇది కొంచం కఠినమైన ప్రశ్న.. అయినా నా గడ్డమే బాగుంటుంది' అని అతడి గడ్డాన్ని పొగుడుకున్నాడు విలియమ్సన్​. అయితే ఇద్దరు సూపర్​ హీరోలని, కొంత మంది కింగ్​ కోహ్లీ హైలైట్​ అని, మరికొందరు విలియమ్సన్​ సూపర్​​ అని క్రికెట్​ ప్రేమికులు కామెంట్లు చేస్తున్నారు.

ఇదీ చదవండి: BCCI కొత్త చీఫ్‌ సెలెక్టర్‌ ఎవరు?.. రేసులో ఇద్దరు మాజీలు!

సూర్య సూపర్ సెంచరీ.. కివీస్​తో టీ20 సిరీస్​లో టీమ్ఇండియా బోణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.