ETV Bharat / sports

ఒకే ఓవర్​లో 5 సిక్స్​లు.. భారత బౌలర్​కు చుక్కలు!

author img

By

Published : Feb 3, 2023, 10:28 AM IST

ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20లో మరో అద్భుతం చోటు చేసుకుంది. ఓ బ్యాటర్​ మాజీ క్రికెటర్​ యూవీ రికార్డును అందుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఐదు బంతుల్లో ఐదు సిక్స్​లు బాది ఔరా అనిపించాడు. ఆ మ్యాచ్ వివరాలు..

Sherfane rutherford 5 sixer
ఒకే ఓవర్​లో 5 సిక్స్​లు.. భారత బౌలర్​కు చుక్కలు!

టీ20 క్రికెట్‌లో రికార్డులకు కొదువే లేదు. ఈ ఫార్మాట్‌లో బ్యాటర్లు తమ బ్యాట్​కు పని చెబుతూనే ఉంటారు. తమ ధనాధన్​ బ్యాటింగ్​తో ఫోర్లు, సిక్సర్లు బాదుతూ ఉంటారు. 2007 టీ20 ప్రపంచకప్‌లో బ్రాడ్‌పై యువరాజ్ సింగ్​ బాదిన ఆరు సిక్సర్లు ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. అయితే తాజాగా అబుదాబి వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20లో.. యూవీ ఫీట్​ను అందుకునేందుకు ఓ బ్యాటర్ యత్నించి.. కేవలం ఒక షాట్‌ తేడాతో కోల్పోయాడు. అతడే షెర్ఫెన్‌ రూథర్‌ఫోర్డ్‌. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల ఫీట్‌ మిస్‌ అయినప్పటికీ ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి ఔరా అనిపించాడు.

గురువారం రాత్రి దుబాయ్‌ క్యాపిటల్స్‌, డెసర్ట్‌ వైపర్స్‌ మధ్య 25వ లీగ్‌ మ్యాచ్‌ జరిగింది. ఇన్నింగ్స్‌ 16 ఓవర్లో బౌలింగ్​కు దిగిన భారత ప్లేయర్​ యూసఫ్‌ పఠాన్​కు షాక్ తగిలింది. తొలి బంతికి సామ్‌ బిల్లింగ్స్‌ సింగిల్‌ తీసి రూథర్‌ఫోర్డ్‌కు స్ట్రైక్‌ ఇచ్చాడు. ఇక్కడ అక్కడ మొదలైంది రూథర్​ పూనకం. తన బ్యాట్​తో చెలరేగిపోయాడు. రెండో బంతిని లాంగాఫ్‌ మీదగా 93 మీటర్లు, మూడో బంతి లాంగాన్‌ మీదుగా, నాలుగో బంతిని బ్యాక్‌ఫుట్‌ తీసుకొని కళ్లుచెదిరే స్ట్రెయిట్‌ సిక్స్‌ కొట్టి హ్యాట్రిక్‌ సిక్సర్లు నమోదు చేశాడు. ఆ తర్వాత ఐదో బంతిని స్క్వేర్‌లెగ్‌లో భారీ సిక్సర్‌ బాదాడు. ఇక ఓవర్‌ చివరి బంతిని మోకాళ్లపై కూర్చొని స్వీప్‌ షాట్‌తో సిక్సర్​గా మలిచాడు. అలా పఠాన్ వేసిన ఈ ఓవర్‌లో మొత్తం 31 సమర్పించుకున్నాడు. ఈ ఐదు సిక్సర్ల సాయంతో రూథర్‌ఫోర్డ్ 23 బంతుల్లోనే హాఫ్​ సెంచరీ పూర్తి చేశాడు. ఇక వెంటనే పెవిలియన్​ చేరుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇదే మ్యాచ్​లో సామ్‌ బిల్లింగ్స్‌(48 బంతుల్లో 54 పరుగులు) మంచి ఇన్నింగ్స్ ఆడాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన డెసర్ట్‌ వైపర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రూథర్‌ఫోర్డ్‌(23), సామ్‌ బిల్లింగ్స్‌(54), ముస్తఫా(31) పరుగులు చేశారు. అనంతరం 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దుబాయ్‌ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా 22 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఇదీ చూడండి: T20 Tri series: వరల్డ్​కప్​ ముందు భారత్​కు షాక్​.. సఫారీపై ఓటమి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.